Saturday 4 November 2017

Press Meet on 03.11.2017

ప్రచురణార్ధం:                                                                తేదీ:03.11.2017

రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం కోసం నగరపాలక సంస్థ చేత అప్పు చేయించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. విజయవాడలో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం.-బి.ఎస్‌.యు.పి పథకం క్రింద బలహీన వర్గాల కోసం జి+3 ఇళ్ళు నిర్మించుటకై రు. 100 కోట్లు అప్పు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ ఋణం తీసుకోవటానికి వడ్డీ రేట్ల వివరాలను తెలియజేయవలసిందిగా బ్యాంకర్లను కోరుతూ ఈనెల 1 వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక దిన పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌కు ఒక లేఖను వ్రాశింది. 
బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం, పౌరులకు గృహ వసతి కల్పించటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి. విజయవాడ నగరపాలక సంస్థకు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికీ సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనికి నగరపాలక సంస్థ అప్పు చేయటం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో ప్రశ్నించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఋణం నగరపాలక సంస్థకు భారంగా మారనున్నదని ఆలేఖలోస్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగరపాలక సంస్థ అప్పుచేయటం నగర ప్రజల నెత్తిన అప్పును రుధ్దటమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. 
వర్షం వస్తే నగరం జలాశయంలా మారటం, డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉండటం, పారిశుధ్ధ్యం నానాటికీ దిగజారటం, రోడ్లు అధ్వాన్నంగా తయారవటం, ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ తీవ్రమవటం, ఫుట్‌ పాత్‌లు లేకపోవటం లాంటి అనేక సమస్యల పరిష్కారానికిి నిధులు కావలసి యుండగా, వాటిని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులకు కార్పొరేషన్‌ అప్పులు చేయటం దారుణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ అప్పును తీర్చవలసింది విజయవాడ నగర ప్రజలేనని, ఈ అప్పు తీర్చటం కోసం భవిష్యత్తులో నగర ప్రజలపై భారాన్ని మోపవలసి వస్తుందని స్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగర పాలక సంస్థ అప్పుచేస్తే, దానిని నగర ప్రజలు ఎందుకు భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు, నగర ప్రజలకు భారంగా మారే ఈ ఋణ ప్రతి పాదనను తక్షణమే విరమించుకోవలసినదిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మున్సిపల్‌ కమీషనర్‌ను కోరింది. 
రాష్ట్ర పౌరులకు గృహవసతి కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ భాధ్యత. కనుక బలహీన వర్గాల కోసం నిర్మించే జి+3 ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.





విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌బ్లిక్ స్థ‌లాల ప్రైవేటీక‌ర‌ణ‌పై టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ విడుద‌ల చేసిన క‌ర‌ప‌త్రం



Thursday 5 October 2017

విజ‌య‌వాడ‌లోని సుమారు 47 ఎక‌రాల ప‌బ్లిక్ స్థ‌లాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు క‌ట్టబెట్టే విధంగా మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాల‌కు వ్య‌తిరేకంగా 02.10.2017 న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ప్రెస్ మీట్‌

ప్రచురణార్ధం:                                                                     తేదీ:02.10.2017
విజయవాడ నగరంలో సుమారు 47 ఎకరాల ప్రభుత్వ స్ధలాలను, నగర ప్రజల ప్రయోజనాలకు కాకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ నిర్ణయం చేయటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. స్వరాజ్యమైదానం 26 ఎకరాలు, నరపాలక సంస్థ ప్రాంతంలో ఉన్న పూలమార్కెట్‌, కూరగాయల  హోల్‌సేల్‌ మార్కెట్‌ మొత్తం ఎ.3.80లు, నగరపాలక సంస్థ స్థలం ఎ.3.22లు, సబ్‌స్టేషన్‌ ఎ.1.14లు, రాజీవ్‌గాంధి పార్కు ఎ.9.01లు , రైల్వే స్థలం ఎ.3.51లు మొత్తం ఎ.46.68లు నగర ప్రజలకు దక్కకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్ట బోతున్నారు. కేవలం నగరంలోని విలువైన పబ్లిక్‌ స్థలాలను తమ అనుమాయులకు, బడా పారిశ్రామిక వేత్తలకు, విదేశీ కంపెనీలకు కట్టబెట్టటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభివర్ణిస్తున్నది. నగరంలో వాహనాలసంఖ్య నానాటికీ పెరుగుతున్నది. సరైన పార్కింగ్‌ స్థలాలులేవు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దెభవనాలలో నడుస్తున్నాయి. నగరంలో సరైన క్రీడా మైదానాలు లేవు. ఏదైనా విపత్తు సంభవిస్తే తలదాచుకోవటానికి స్థలాలు లేవు. విజ్ఞాన,వినోద కార్యక్రమాలకు స్ధలాలు లేవు. ఇలా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు స్థలాలను ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం, నగరపాలకులు, అందుకు భిన్నంగా ఇప్పటికే ఉన్న స్థలాలలో రిటైల్‌ మాల్స్‌, ఎగ్జిబిషన్‌ హాల్స్‌, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయటం, టవర్లు కట్టడం లాంటి వాటివలన చేయటం వలన ప్రైవేటు వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలు నెరవేరుతాయి తప్ప నగర ప్రజల ప్రయోజనాలు నెరవేరవు. ఇప్పటికే ఆర్‌.టి.సి స్థలాలు క్రమేణా ప్రైవేటు వ్యక్తు చేతులలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్‌ స్థలాలు, నగరపాలక సంస్థ స్థలాలను కాజేయబోతున్నారు. ఇది నగరానికి తీరని నష్టం వాటిల్లుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టంచేస్తున్నది. నగర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేటర్లు కూడా కౌన్సిల్‌లో ఈ తీర్మానాలకు ఓటువేయటం దారుణం. ఇప్పటికైనా నగరప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ పాలకులు తమ నిర్ణయాలను వెనుక్కు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. నగరానికి నిధులిచ్చి అభివృధ్ధి చేయాల్సిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకపోగా, అభివృధ్ధికి వికృతి నిర్వచనాలిచ్చి, నగర ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాజేయటం మానుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

వి.సాంబిరెడ్డి                                                      యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                              కార్యదర్శి








Tuesday 11 April 2017

Press Meet Video on 10.04.2017


Press Meet on 10.04.2017

2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేయటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించాలనటం చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇది చట్ట విరుధ్ధమని తెలియజేస్తూ మున్సిపల్‌ కమీషనర్‌కు, మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 ప్రకారం ఆస్తి పన్నును అర్ధసంవత్సరానికి కాని లేక 3 నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలే తప్ప సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమనే హక్కు కమీషనర్‌కు లేదు. మున్సిపల్‌ కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది తప్ప, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడా లేని హక్కును మున్సిపల్‌ అధికారులు ఎలా అమలు జరుపుతారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్ట విరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం దారుణమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది.
మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాసి ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్లను ప్రయోగించి ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. పన్నులు చెల్లించని ఇలాంటి వారిపై అధికారులు ఈ సెక్షన్‌ల ప్రకారం చర్యలు తీసుకోనందున కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. వీరివలన కార్పొరేషన్‌ ఖజానాకు కలుగుతున్న నష్టానికి అధికారులే బాధ్యత వహించాలి.
ఆస్తి పన్ను ముందస్తుగా చలెల్లించకపోతే పోతే వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపి వేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తే సాధారణ పన్ను చెల్లింపుదారులు బెదిరిపోయి ఆస్తిపన్ను, దానితోబాటే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలను సంవత్సరం మొత్తానికీ ఒకేసారి కట్టేస్తారన్న వ్యూహంతోనే ఈ కరపత్రాలను పంచుతున్నారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. చట్టవిరుధ్దమైన అంశాలతో, బెదిరింపులతో కూడిన ఈ కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలని, ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షత లేకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 269(2)మరియు సెక్షన్‌ 270 ప్రకారం అత్యధిక మొత్తాలలో బకాయిలున్న వారితో ప్రారంభించి అవరోహణా క్రమం(Descending order) లో బకాయిదారులపై చర్యలు చేపట్టాలని, పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటి కప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                  యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                         కార్యదర్శి











Saturday 8 April 2017

ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కరపత్రాల పంపిణీ చేయ‌టం పై అభ్యంతరం తెలియ‌జేస్తూ క‌మీష‌న‌ర్‌కు వ్రాశిన లేఖ‌


                                                                                                తేదీ: 06.04.2017 
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి, 
ఆర్యా, 
విషయం: 2017-2018 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని 
డిమాండు చేస్తూ కరపత్రాల పంపిణీపౖౖె అభ్యంతరం 
రిఫరెన్స్‌: 15.07.2016 న టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్రాశిన లేఖ 
2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని, అదికూడా ఏప్రిల్‌ నెలలోనే చెల్లించాలని లేకుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) ప్రకారం నెలకు 2శాతం చొప్పున పెనాలిటీ విధించబడుతుందని, అదేచట్టం సెక్షన్‌ 269(2) ప్రకారం అత్యవసర సర్వీసులు నిలిపి వేయ వచ్చునని, సెక్షన్‌ 270 ప్రకారం చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని పన్ను చెల్లింపుదారులను బెదిరిస్తూ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌గా మీరు విజయవాడ నగరంలో కరపత్రాలను పంపిణి చేయిస్తున్నారు. పన్నుచెల్లింపుదారులను బెదిరిస్తూ మీరు కరపత్రాలను పంపిణీ చేయించటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము అభ్యంతరం తెలియ జేస్తున్నాము. 

అభ్యంతరం 1:- ఇది చట్ట విరుధ్ధం (Against GHMC Act1955).. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది. 

Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of- 
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October 

(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.
పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరం మొత్తానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 
పై చట్టం ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది. అంతేకాని సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడాలేని హక్కును మీరు ఏచట్ట ప్రకారం అమలు జరుపుతున్నారని ప్రశ్నిస్తున్నాము. 2016-2017 ఆర్ధిక సంవత్సరానికి సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని డిమాండు నోటీసులు పంపించారు. అప్పుడే అలా నోటీసులు పంపటం చట్టవిరుధ్ధమన్న విషయాన్ని పైన రిఫరెన్స్‌లో చూపిన లేఖ ద్వారా మీదృష్టికీ, గౌరవ మేయర్‌గారి దృష్టికి తీసుక వచ్చాము. అయినప్పటికీ మీరు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కూడా చట్టవిరుధ్ధంగా సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను వసూలు చేయటానికి నిర్ణయించుకున్నారని మీరు పంపిణీ చేయిస్తున్న కరపత్రాలనుబట్టి స్పష్టమవుతున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారిగా మీరే చట్టవిరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం సరికాదని స్పష్టం చేయదలుచుకున్నాము.  
అభ్యంతరం 2:- GHMC Act1955 సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 అమలు: 
ఈ సెక్షన్ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాశారు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఈ సెక్షన్లు, కోట్లు, లక్షలరూపాయలు ఆస్తిపన్ను బకాయిలున్న వారికి ఇప్పటివరకు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నిస్తున్నాము. రైల్వేలు, ప్రభుత్వ కార్యాలయాలు కోట్లు రూపాయలు ఆస్తిపన్ను చెల్లించాలి. ఆస్తిపన్ను బకాయిదారులలో ప్రజాప్రతినిధులు ఉన్నారన్న పేరుతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ నుండి తొలగించారు. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్ల ప్రకారం చర్య తీసుకోకుండా ఉండటానికి GHMC Act1955 లో ఎలాంటి మినహాయింపులు లేవన్న విషయం మీకు తెలియంది కాదు. పన్నులు బకాయిపడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నవిషయం తెలిసికూడా మీరు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వారిపై చర్యలు తీసుకోకుండా, వారినుండి పన్నులు వసూలు చేయకపోవటం ద్వారా మీరు కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని మీకు స్పష్టం చేయదలిచాము. దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వీరెవ్వరిపై చర్య తీసుకోకుండా, వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని కరపత్రం ద్వారా ప్రచారం చేయటం సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారుల పట్ల వివక్షత చూపటమేనని స్పష్టం చేస్తున్నాము. చట్టం ముందు అందరూ సమానులే (Equality Before Law)అన్న సూత్రానికి మీచర్య విరుధ్ధమని తెలియజేస్తున్నాము. 
పై రెండు అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మీముందుంచుతున్నాము. 
01. కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలి 
02. GHMC Act1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలి. 
03. ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షతలేకుండా GHMC Act1955  సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 ప్రకారం అవరోహణా క్రమం(Descending order) లో చర్యలు చేపట్టాలి. తీసుకున్న చర్యలను  మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాలి 
04. పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటికప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలి. 

                                                   అభివందనాలతో 

వి.సాంబిరెడ్డి                                                                యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                                       కార్యదర్శి 


CC to Sri Koneru Sridhar
         Hon'ble Mayor
Municipal Corporation
Vijayawada 




Friday 17 March 2017

Press Meet on Metro Rail Project Vijayawada


ప్రచురణార్ధం:                                                                                                    తేదీ:17.03.2017 
మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో ఎటువంటి మార్పులు జరగబోవని, బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు మరియు కాల్వల పైన మెట్రో నిర్మాణం సాధ్యం కాదని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ప్రకటించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఖండిస్తున్నది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని, ఏలూరు రోడ్డులో కాకుండా మెట్రో రైలు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు ద్వారా నిర్మించాలని మెట్రో రైల్‌ ప్రాజెక్టు వలన భూములు కోల్పోయే బాధితులు కోరుతున్నారు. ఆ మేరకు ప్రాజెక్టు రుణం మంజూరు చేయటానికి ముందుకు వచ్చిన జర్మనీ, ఫాన్స్‌లకు చెందిన సంస్థలకు లేఖ ఇచ్చినట్లుగా పత్రికలలో వచ్చింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు బాధితుల అభిప్రాయానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తు తెలియ జేస్తున్నది. 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కూడా మెట్రో రైలు రూట్లను మార్చాలని కోరింది. ఈ మేరకు జనవరి 31 వతేదీన అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ఛైర్మెన్‌కు లేఖ వ్రాశింది. మెట్రో రైల్‌ లక్ష్యాన్ని కేవలం ట్రాఫిక్‌ నియంత్రణకే పరిమితం కాకుండా, నగర విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో కొన్ని రూట్లను కూడా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. విజయవాడ- ఆగిరిపల్లి, విజయవాడ -పెద అవుట్‌పట్లి, విజయవాడ - జి.కొండూరు లేదా మైలవరం, విజయవాడ -కంకిపాడు. విజయవాడ - కంచిక చర్ల లేదా నందిగామ, విజయవాడ - అమరావతి (రాజధాని) మార్గాలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. ఇంతమంది కోరినా, ప్రత్యామ్నాయ మార్గాలున్నా, వేటినీ పట్టించుకోకుండా, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలోనే వేయాలని నిర్ణయించటం నియంతృత్వమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
మెట్రో రైల్‌ నిర్మాణానికిి అయ్యే ఖర్చును రాబట్టడం కోసం రాష్ట్రంలోని పెట్రోల్‌ డీజిల్‌పై మెట్రో సెస్‌ విధించాలని, ఆస్తి పన్ను మీద అదనపు సెస్‌ విధించాలని, వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలపై అదనంగా మెట్రో చార్జి విధించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహనాలపై ఒకసారి గ్రీన్‌ సెస్‌ విధించాలని డి.పి.ఆర్‌. లో చేసిన ప్రతిపాదనలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మిస్తూ రాష్ట్ర ప్రజలందరి మీద సెస్‌ విధించాలనటం అన్యాయమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎ.యం.ఆర్‌.సి కి స్పష్టం చేసింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్‌ లలో మాదిరిగా విజయవాడ మెట్రోరైలును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతోనే నిర్మించాలని, ప్రైవేటు యాజయాన్యానికి అప్పగించటం, ప్రజలపై భారాలు విధించటం చేయరాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. మెట్రో రైల్‌ కోసం భూములు కోల్పోయేవారికి కొచ్చిన్‌ మెట్రో రైలు మాదిరిగా సెంటుకు గరిష్టంగా రు.52 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. 
విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రకటన నాటి నుండి నేటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే, నియంతృత్వ రీతిలో నడుస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మెట్రో రైలు మొత్తం పట్టణ రవాణాలో ఒక భాగం. కాని విజయవాడ నగరంలో ఏర్పాటుచేసే మెట్రో రైలు గురించి విజయవాడలో ఎలాంటి చర్చ జరగలేదు. విజయవాడ నగరపాలక సంస్థలో దీనిపై చర్చ జరగలేదు. విజయవాడ నగర ప్రజలనుగానీ, నగరంలోని రాజకీయపార్టీలనుగానీ , ప్రజాసంఘాలను, అసోసియేషన్లనుగానీ కనీసం సంప్రదించలేదు, పబ్లిక్‌ హియరింగ్‌ జరపలేదు. ప్రజాభిప్రాయం కోరలేదు. ఎక్కడా చర్చ లేకుండా, ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలు తమంతటతాము చెప్పినా వినిపించుకోకుండా ముందుకు సాగటం ప్రజాస్వామ్యవిరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, పబ్లిక్‌ హియరింగ్‌ జరిపి, ప్రజాభిప్రాయం కోరాలని, దాని ఆధారంగానే మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. 


(వి.సాంబిరెడ్డి)                                                                                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                                                               కార్యదర్శి








Friday 17 February 2017

17.02.2017 విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై న జ‌రిగిన ప్రెస్‌మీట్‌

ప్రచురణార్ధం:                                                                                          తేదీ:17.02.2017
రేపు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టబోతున్న 2017-2018 వార్షిక బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ రోజు బడ్జెట్‌పై తన విశ్లేషణను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేస్నున్నది. బడ్జెట్‌ ప్రతిపాదననలో అనేక లోపాలు ఉన్నట్లుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గుర్తించింది. అనేక అంశాలకు సంబంధించి అంచనాలు రూపొందించటంలో తార్కికత లేకపోవటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గమనించింది.కొన్ని చోట్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపారు. ఉదాహరణకు 2015-16 లో రోడ్డు గ్రాంటు ఆదాయం సున్న. అంటే రోడ్డు గ్రాంటు ఏమీ రాలేదు. అయినా రు.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2016-17లో రోడ్డు గ్రాంట్‌ సవరించిన ఆదాయం రు. 3 కోట్లుగా చూపి, ఖర్చు రు.7 కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆదాయం అంచనా రు. 10 కోట్లుగా చూపి. ఖర్చు అంచనా రు. 20 కోట్లుగా చూపారు. ఒకే పద్దు క్రింద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేయటం ఎలా సాధ్యమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. అదేవిధంగా బుడమేరు అభివృధ్ధి పనుల నిధులు 2015-16లో ఆదాయంలో లేదు. కాని ఖర్చులో రు. 16 కోట్లు చూపారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం అంచనాలలో సున్న చూపి, ఖర్చులో రు.28,55,29,055లు గా చూపారు. రాని, లేని నిధులను ఎలా ఖర్చు చేస్తారు? గత అనుభవాలను కూడా పట్టించుకోకుండా కొన్ని చోట్లు ఆదాయాలలో అతిగా చూపారు. ఉదాహరణకు సివరేజి చార్జీలు 2013-14నుండి 2016-17 సవరించిన అంచనాలవరకు ఏ సంవత్సరమూ 17 కోట్లకు చేరలేదు. అనుభవం ఇలా ఉండగా 2017-18లో మరల రు. 49.5 కోట్లు గా చూపించారు. అదేవిధంగా రోడ్‌ కటింగ్‌ చార్జీలు 2013-14లో రు.10.24లక్షలు 2014-15లో సున్న, 2015-16లో రు.35 వేలు 2016-17లో రు. 52 వేలుగా ఉన్నది. వాస్తవం ఇలా ఉండగా 2017-18 అంచనాలలో ఏకంగా రు.50లక్షలు చూపారు. ఇలా తార్కికతలేని అతి అంచనాలు అనేకం ఉన్నాయి.
2016 లో కార్పొరేటర్లు స్టడీ టూర్‌ పేరుతో చేసిన యాత్ర సర్వత్ర విమర్శలకు దారితీసింది. అధికారులు, కార్పొరేటర్లు చేసిన టూర్లకు రు. 53 లక్షలకు పైగా ఖర్చయిందని బడ్జెట్‌ తెలియజేస్తున్నది. 2017లో మరో యాత్రకు కార్పొరేటర్లు సిధ్ధమవుతున్నారని ప్రస్తుత బడ్జెట్‌లో రు.60 లక్షలు కేటాయించటం ద్వారా అర్ధమవుతున్నది. కాని మందుల కొనుగోళ్ళకు, ఆసుపత్రుల నిర్వహణకు సగానికి సగం కేటాయింపులు తగ్గించడం ద్వారా కార్పొరేటర్ల యాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజారోగ్యానికి కార్పొరేషన్‌ పాలకులు ఇవ్వటం లేదని అర్ధమవుతున్నది. ఆట స్ధలములు, స్టేడియంల నిర్వహణ మరియు యువజనోత్సవాలకు 2012-13, 2013-14, 2015-16లో ఏమీ ఖర్చు చేయకపోవటం, 2016-17లో బడ్జెట్‌లో రు.15 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో సున్న చూపటం, క్రీడల పట్ల, యువజనుల పట్ల కార్పొరేషన్‌ పాలకుల నిర్లక్ష్యధోరణి స్పష్టంగా కనుపిస్తున్నది. 2017-18 అంచనాలలో మరల రు. 15 లక్షలు కేటాయించినా అనుభవాన్ని బట్టి చూస్తే ఖర్చు చేయటం సందేహాస్పదమే.
కార్పొరేషన్‌ నూతన భవనాలకు 26.75 కోట్లు కేటాయించారు. కాని వన్‌ టౌన్‌ ప్రాంతంలో జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి (షేక్‌ రాజా ఆసుపత్రి)గాని, కుట్టు శిక్షణా కేంద్రాలకుగాని, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ అభివృధ్ధికిగానీ, మోడల్‌ చేపల మార్కెట్ల నిర్మాణాలకుగానీ, శానిటేషన్‌ పరికరాలకుగాని, ఒక్కరూపాయికూడా కూడా కేటాయించలేదు. వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కొరకు అన్న పద్దు క్రింద ఏమీ కేటాయింపులు లేవని సున్న చూపారు. న్యూ రాజరేశ్వరీపేటలో నూతన హైస్కూల్‌ భవనానికి ప్రహరీ కట్టిస్తే, కోట్ల రూపాయల విలువైన భవనం వినియోగంలోకి వస్తుంది. దానికి కేటాయింపులు లేవు.
మధ్య నియోజక వర్గంలో నీటి సరఫరా సౌకర్యముల అభివృధ్ధి మరియు తూర్పు నియోజక వర్గంలో తాగునీటి సౌకర్యముల అభివృధ్ధి అనే రెండు పద్దుల క్రింద రాష్ట్ర ప్రభుత్వంనుండి వస్తాయని గతమూడు సంవత్సరాలుగా బడ్జెట్‌ అంచనాలలో కొంత మొత్తాలను చూపుతున్నారు. కానిఆదాయం మాత్రం రావటంలేదు. అయినా సరే 2017-18 బడ్జెట్‌ అంచనాలలోకూడా ఈ పద్దుల క్రింద రు.52 లక్షలు, రు.43లక్షలు చూపెట్టారు. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనుకోవటానికి ఆధారం ఏమిటో కార్పొరేషన్‌ పాలకులు వివరించాలి. పశ్ఛిమ నియోజకవర్గాన్ని గురించి బడ్జెట్‌లలో ఎందుకు ప్రతినాదనలు ఉండటంలేదో పాలకులు చెప్పాలి.
ఆస్తిపన్నుపై ఆదాయం 2014 మార్చినాటికి రు.70 కోట్లుగా ఉంటే అది నేటికి రు.143 కోట్లు అయింది. 2014 మార్చినాటికి రు.17.91 కోట్లుగా ఉండే నీటి చార్జీల ఆదాయం 2017-18 నాటికి రు.36.5 కోట్లు గా ఉండబోతున్నది. అంటే ఈ కౌన్సిల్‌ కాలంలో ఈ రెండూ రెట్టింపయ్యాయి. నగరంలో మరల ఆస్తిపన్ను పెంచబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆస్తిపన్ను పెరిగితే దానితోపాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి. ఇదే జరిగితే ఇవి ప్రజలకు శాపంగా మారతాయటంలో సందేహంలేదు.
ఇలాంటి అవకతవకలు ఈ బబ్జెట్‌లో అనేకం ఉన్నాయి. నగరపాలక సంస్థ బడ్జెట్‌ వాస్తవికతకు దగ్గరగా ఉండాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటం, స్థానిక సంస్థల పాలకులకు ప్రజల పాట్లపట్ల శ్రధ్ధలేక పోవటం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. అందువలన ఈ విషయాలన్నింటినీ కౌన్సిల్లో చర్చించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది.






Thursday 16 February 2017

2017-2018 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలపై టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ విశ్లేషణ


2017-2018 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన 
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలపై 
టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ విశ్లేషణ 

I-రెవెన్యూ ఆదాయం 
-ఆస్తిపన్ను పెంపుదల 

ప్రస్తుత పాలకులు అధికారంలోకి వచ్చేనాటికి(2013-2014) ఆస్తిపన్ను రు. 70,175,85,000 
ప్రస్తుతం 2017-18 నాటికి రు. 143,25,89,900 
అంటే పెరుగుదల రు. 73, 08,04,900 
సంవత్సరాల వారీ పెరుగుదల 
2014-2015 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 4,91,63,001 
2015-2016 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 10,25,30,335 
2016-2017లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 31,61,46,664 
2017-2018 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 26,29,64,900 
మొత్తం.................రు. 73,08,04,900 

-Service Charges in lieu of Property Tax from Railways  అని ఇంగ్లీషులో వ్రాశారు. దాని అర్ధం ''రైల్వేలనుండి ఆస్తి పన్నుకు స్థానంలో సర్వీసు చార్జీలు'' అని అర్ధం. కాని తెలుగులో ''రైల్వే మరియు ఇతర ప్రభుత్వ శాఖలు -సర్వీస్‌ చార్జీలు'' అని వ్రాశారు. కాని ఇంగ్లీషులో '' ఇతర ప్రభుత్వ శాఖలు'' అన్నది లేదు. ఇందులో రెండు అనుమానాలు ఉన్నాయి. 
1. రైల్వేలు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు ఏనాటి నుండో ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆస్తి పన్ను స్థానంలో సర్వీసు చార్జీలు చెల్లిస్తున్నాయా? లేక ఆస్తి పన్ను బకాయీలు అలాగే ఉంచి అదనంగా సర్వీసు చార్జీలు చెల్లిస్తున్నాయా? ఆస్తి పన్నుకు బదులు సర్వీసు చార్జీలు చెల్లిస్తుంటే ఏ చట్టప్రకారం లేదా ఏ కౌన్సిల్‌ తీర్మానం ప్రకారం ఆస్తి పన్ను స్థానంలో సర్వీసు చార్జీలు చెల్లిస్తున్నారు? 
2. ఇది రైల్వేలకే పరిమితమా? లేక ఇతర ప్రభుత్వ శాఖలుకూడా అలాగే చెల్లిస్తున్నాయా? 

-వినోదపు పన్ను 2015-16లో రు.18,32,77,041 వచ్చినప్పుడు 2016-17లో కేవలం రు. 8 కోట్లకే ఎందుకు పరిమితం కావలసి వచ్చింది? అదేవిధంగా 2017-18 అంచనాలలో కూడా రు. 8 కోట్లకే ఎందుకు పరిమితం చేశారు? 

- మోటారు వాహనముల వలన నష్ట పరిహారం 2015-16లో ఎందుకు రాలేదు? 

- ఆస్తిపన్నువలన నష్టపరిహారం ద్వారా ఆదాయం 2015-16లో రు.35,20,000 వచ్చింది. 2016-17 బడ్జెట్‌ అంచనాలలో రు. 50,00,000లుగా చూపి దానిని సవరించిన అంచనాలలో రు. కేవలం రు.1,22,250కు కుదించారు. 
సవరించిన అంచనాలలో ఎందుకు రు.48 లక్షలకు పైగా తగ్గించి చూపారు? ఇప్పుడు మరల 2017-18 బడ్జెట్‌లో రు. 50,00,000లుగా చూపారు? 
-స్లాటర్‌ హౌస్‌ లీజులపై ఆదాయం సవరించిన అంచనాలలో సున్న చూపించవలసి వచ్చింది? 
- పి. హెచ్‌. ఇతరములు/ పబ్లిక్‌ టాయిలెట్స్‌ అనే పద్దుక్రింద 2014-15లో ఆదాయం సున్న. 2015-2016లో కూడా ఆదాయం సున్న. కాని 2016-17లో బడ్జెట్‌లో ఆదాయం రు. 15 లక్షలుగా చూపి సవరించిన అంచనాలలో దానిని రెట్టింపు చేసి రు.32,60,200 గా చూపారు. 2017-18 అంచనాలలో మరింత పెంచి రు. 36,22,000లు గా చూపారు. ఈ పెంపుదలలకు ఆధారం ఏమిటి? 2014-15 మరియు 2015-16లో ఎందుకు వసూలు చేయలేక పోయినారు? 
- 2016-17 వరకు 10 శాతం గా ఉన్న ఓపెన్‌ స్పేస్‌ కాస్ట్‌ 2017-18లో 14 శాతానికి పెంచారు. ఇది భారం మోపటమే. 
- సివరేజి చార్జీలు 2013-14లో రు.5,13,76,270, 2014-15లో రు. 13,27,80,00లు, 2015-16లో రు.8,13,44,558 వసూలు అయ్యాయి. 2016-17 అంచనాలలో రు.52,05,00,000గా చూపించి సవరించిన అంచనాలలో రు.16,95,29,000లకు కుదించారు. దీనిబట్టి ఏనాడూ 17 కోట్లకు చేరలేదు. అనుభవం ఇలా ఉండగా 
2017-18లో మరల రు. 49,05,00,000గా చూపించారు. ఇంత పెంపుదలకు ఆధారం ఏమిటి? 
- రోడ్‌ కటింగ్‌ చార్జీలు 2013-14లో రు.10,24,598లు వసూలయ్యాయి. 2014-15లో అసలేమీ వసూలు కాలేదు. 2015-16లో కేవలం రు.35,000 వసూలు అయ్యాయి. 2016-17లో రు.6ల క్షలు అంచనావేసి సవరించిన బడ్జెట్‌లో రు. 52,500లకు కుదించారు. వాస్తవం ఇలా ఉండగా 2017-18 అంచనాలలో ఏకంగా రు.50లక్షలకు ఏఆధారంగా పెంచారు? 
-స్విమ్మింగ్‌ పూల్‌ ఫీజు మరియు జిమ్‌ ఫీజు 2013-14లో రు.30,75,750లు వసూలయ్యాయి. 2014-15లో రు.30,00,000లు, 2015-16లో కేవలం రు.21,50,000లు వసూలు అయ్యాయి. అయితే 2017-18లో రు.49,50,000లు గా అంచనా వేశారు. అంటే ఫీజులు పెంచబోతున్నారా? లేకుంటే అమాంతం రు. 20 లక్షలకు పైగా ఎలా పెరుగుతాయి? 
- వి.యం.సి ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా ఆదాయం 2013-14లో రు.59,90,940లు. 2014-15లో ఆదాయం సున్న. 2015-16లో కూడా ఆదాయం సున్న. కాని 2016-17 బడ్జెట్‌లో రు.3 కోట్లుగా చూపి. సవరించిన అంచనాలలో దానిని రు. 10 లక్షలకు కుదించారు.2017-18 అంచనాలలో మరల రు.5 కోట్లుగా చూపారు. దీనికి ఆధారం ఏమిటి? 
- వాహనాల అమ్మకం ద్వారా 2013-14లో రు.7,00,000లు, 2014-15లో రు.15,00,000లు ఆదాయం వచ్చింది. 2015-16లో కేవలం రు.5,00,000లు మాత్రమే ఆదాయం వచ్చింది. 2016-17లో సవరించిన బడ్జెట్‌లో ఆదాయాన్ని సున్నగా చూపారు. కాని 2017-18 అంచనాలలో రు.1,86,00,000లుగా చూపారు. ఎన్ని వాహనాలను అమ్మబోతున్నారు? వాటికి ప్రత్యామ్నాయమేమిటి? 
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి రావలసిన అద్దె బకాయీలు 2012-13 లో రు. 7,08,000లు, 2013-14లో రు.1,50,690, 2014-15లో రు.24,25,916లు, 2015-16లో రు. 30,12,000లు వచ్చాయి. 2016-17 బడ్జెట్‌లో అత్యధికంగా రు. 2,55,00,000లు అంచనాగా చూపి, సవరించిన అంచనాలలో కేవలం రు, 12,50,000లుగా చూపారు. బడ్జెట్‌లలో అతి అంచనాలు చూపుతున్నారు అనేదానికి ఇది ఉదాహరణ. 
-వాటర్‌ వలన ఆదాయం ( టారీఫ్‌ ) 2012-13లో రు. 21,10,00,000లు, 2013-14లో 17,91,14,125లు, రు. 2014-15లో రు. 22,92,85,000లు, 2015-16లో రు. 34,32,88,024లు గా ఉన్నది. 2016-17లో రు. 34,92,57,000 అంచనాలలో చూపి, సవరించిన అంచనాలలో రు. 29,52,39,197గా చూపారు. అంటే రు.5 కోట్ల 40 లక్షలు తక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2017-18 బడ్జెట్‌లో సుమారు 6.98 కోట్లు పెంచి రు.36.5 కోట్లుగా అంచనావేశారు. 2013-14 నాటికి ( ఈ పాలకులు అధికారంలోకి వచే నాటికి ) ఉన్న ఆదాయంతో 2017-18 బడ్జెట్‌ అంచనాలను పోల్చితే నీటి చార్జీలు సగటున రెట్టింపు అయ్యాయి. 
-పనులపై అపరాధ రుసుం క్రింద 2012-13లో రు.50 లక్షలు వచ్చాయి. ఇక 2013-14, 2014-15, 2015-16లో ఆదాయం సున్న. 2016-17 సవరించిన అంచనాలలో కూడా సున్న చూపించారు. 2017-18లో రు.5లక్షలు గా అంచనా వేస్తున్నారు. ఇది కేవలం బడ్జెట్‌లలో అతి అంచనాలు చూపటం కాదా? తప్పు చేస్తేనే అపరాధ రుసుం వస్తుంది. తప్పనిసరిగా తప్పు చేయాలని భావిస్తున్నారా? 
-ఇంపాక్టు ఫీజు 2012-13 లో లేదు. 2013-14, 2014-15 బడ్జెట్‌లలో చూపలేదు. కాని 2013-14లో రు.65,68,465 లు ఆదాయం చూపారు. 2014-15 లో 34లక్షల ఆదాయం చూపారు. 2015-16లో 63,56,422 ఆదాయం చూపారు. 2016-17 బడ్జెట్‌లో రు. కోట్లు చూపి, సవరించిన డబ్జెట్‌లో రు.3,76,75,544గా చూపారు. 2017-18 అంచనాలు రు. 4 కోట్లుగా చూపుతున్నారు. ఈ ఇంపాక్టు ఫీజు ఏ ప్రాంతాలనుండి వసూలు చేస్తున్నారు? ఎవరినుండి వసూలు చేస్తున్నారు? 
- ఎలిమెంటరీ, హైస్కూల్‌ ఉపాధ్యాయులకు వేతనాలు 010 పద్దు క్రింద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇస్తున్నది. అంతేతప్ప కార్పొరేషన్‌కు ఇవ్వటంలేదు. అలాంటప్పుడు అది కార్పొరేషన్‌కు ఆదాయం ఎలా అవుతుంది? ఇది కేవలం బడ్జెట్‌లో అంచనాలు పెంచటంకోసం చేసిందికాదా? 
II-రెవెన్యూ ఖర్చులు 
-కార్పొరేటర్లు స్టడీ టూర్‌ పేరుతో 2016 మే మొదటి వారంలో విహారయాతక్రు వెళ్ళారు. 2016-17 బడ్జెట్‌లో స్టడీ టూర్లకు సవరించిన అంచనాలలో రు.53,23,610 గా ఖర్చు చూపారు. 2017-18 అంచనాలలో ఖర్చు మరికొంత పెంచి రు.60లక్షలుగా చూపారు. 2016లో కార్పొరేటర్లటూరు సర్వత్ర విమర్శలకు దారితీసింది. ఆ టూరువలన ఎటువంటి మేలు కార్పొరేషన్‌కు చేకూరిందో ఈ నాటికీ స్ఫష్టం చేయలేదు. అయినా 2017-18లో మరల టూర్లు ప్రతిపాదించటం దారుణం. ఇది ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేయటమే. 
-1/3 వంతు సర్వేయర్‌ సిబ్బంది జీతాలు 2012-13లో రు.8,37,000లు. 2013-14లో రు. 24,00,000లు 2014-15లో రు.32,00,000లు 2015-16లో రు.35,00,000లు ఖర్చు చూపారు. 2016-17లో రు 40లక్షలు బడ్జెట్‌లో కేటాయించి సవరించిన అంచనాలలో సున్న చూపారు. మరల 2017-18 అంచనాలలో రు.2,50,000లుగా చూపారు. కారణం ఏమిటి? సిబ్బందిని తొలగించారా? సిబ్బంది ఉంటే జీతాలు ఎందుకు తగ్గుతాయి? 
-మందుల కొనుగోలు నిమిత్తం 2012-13లో రు.54,00,000లు, 2013-14లో రు.54,00,000లు 2014-15లో రు. 33,75,250లు 2015-16లో రు. 52,86,482లు ఖర్చు చేశారు. 2016-17లో బడ్జెట్‌లో రు.83 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో రు.25,71,869 గా చూపారు. 2017-18 అంచనాలలో రు. 27 లక్షలు ఖర్చుమాత్రమే చూపారు. ప్రజారోగ్యానికి కావలసిన మందుల కొనుగోళ్ల ఖర్చు సగానికిసగం ఎందుకు తగ్గించారు? 
-అదేవిధంగా ఆసుపత్రుల నిర్వహణకు 2012-13లో రు. 7లక్షలు, 2013-14లో రు.7లక్షలు, 2014-15,2015-16లలో లో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో అంచనాలలో రు.10 లక్షలు ఖర్చు చూపి సవరించిన అంచనాలలో తగ్గించి రు.5 లక్షలు ఖర్చు చూపారు. 2017-18 అంచనాలలో కూడా కేవలం రు.5 లక్షలు ఖర్చు మాత్రమే చూపుతున్నారు. 
పైరెండూ ప్రజారోగ్యం పట్ల కార్పొరేషన్‌ పాలకుల నిర్లక్ష్యధోరణికి నిదర్శనం. 
-డపింగ్‌ యార్డు నిర్వహణ ఖర్చు 2016-17 సవరించిన అంచనాలలో రు. 3 కోట్లుగా చూపి 2017-18 బడ్జెట్‌లో కేవలం 1 కోటి 50లక్షలుగా చూపటంలో అర్ధం ఏమిటి? 
- జంతువుల నియంత్రణకు 2012-13లో రు. 5 లక్షలు, 2013-14లో రు.5 లక్షలు, 2014-15, 2015-16లలో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో అంచనాలలో రు.15 లక్షలు ఖర్చు చూపి సవరించిన అంచనాలలో రు.40 లక్షలు ఖర్చు చూపారు. 2017-18 అంచనాలలో ఏకంగా రు.90లక్షలుగా ఖర్చు చూపారు. 2017-18లో అంత అతిగా ఖర్చు పెరగటానికి కారణ మేమిటి? 
- ఆట స్ధలములు, స్టేడియంల నిర్వహణ మరియు యువజనోత్సవాలకు 2012-13, 2013-14లో ఏమీ ఖర్చు చేయలేదు. 2014-15లో కేవలం రు.1 లక్ష మాత్రమే ఖర్చు చేశారు. 2015-16లో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో బడ్జెట్‌లో రు.15 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2017-18 అంచనాలలో మరల రు. 15 లక్షలు ఖర్చు చూపుతున్నారు. ఇది క్రీడల పట్ల, యువజనుల పట్ల కార్పొరేషన్‌ పాలకుల నిర్లక్ష్యధోరణికి నిదర్శనం. 

- విద్యుత్‌ చార్జీలు 2012-13లో రు.22 కోట్లు, 2013-14లో రు.12.94 కోట్లు 2014-15లో రు.31,99,42,703కోట్లు 2015-16లో రు.29.50 కోట్లు, 2016-17 (రివైజ్డ్‌) లో రు.30.60 కోట్లు 2017-18 అంచనాలలో రు.32 కోట్లు గా ఉన్నది. ఇంత అనూహ్యంగా పెరగటానికి గల కారణం నీటి సరఫరాకు విద్యుత్‌ సంస్థలు కమర్షియల్‌ రేటు చొప్పున విద్యుత్‌ చార్జీలు వసూలు చేయటమే. కనక మంచినీటి సరఫరాకు విద్యుత్‌ చార్జీలు గృహ యజమానులనుండి వసూలుచేసే కనీస చార్జీ రేటు చొప్పున వసూలు చేయాలని కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి. 
- వృత్తిపన్ను కన్సల్టెంట్లకు గౌరవ వేతనం క్రింద రు.3 లక్షలు కేటాయించారు. వృత్తిపన్ను చట్టప్రకారం వసూలు చేసేది. దానికి కన్సల్టెంట్ల అవసరం ఏమిటీ? 

III-కాపిటల్‌ ఆదాయాలు 
- జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు సున్న చూపారు. అంటే పూర్తిగా వచ్చాయా? అదేవిధంగా వి.యం.సి ఫేరుకూడా సున్న చూపారు. అంటే పూర్తిగా జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం నిధులు సున్న చూపారు. అంటూ పనులన్నీ పూర్తయినాయా? 
-మధ్య నియోజక వర్గంలో నీటి సరఫరా సౌకర్యముల అభివృధ్ధి మరియు తూర్పు నియోజక వర్గంలో తాగునీటి సౌకర్యముల అభివృధ్ధి అనే రెండు పద్దుల క్రింద ఆదాయాలు 2013-14 లో సున్న , 2014-15లో సున్న , 2015-16లో సున్న. కాని గత 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం బడ్జెట్‌ అంచనాలలో , సవరించిన అంచనాలలో ఆదాయం చూపెడుతున్నారు. ఆదాయం మాత్రం రావటంలేదు. 2017-18 బడ్జెట్‌ అంచనాలలోకూడా ఈ పద్దుల క్రింద రు.52 లక్షలు, రు.43లక్షలు చూపెట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినది. ఇవ్వటంలేదు. ఇవ్వనప్పుడు బడ్జెట్‌ లో చూపినందువలన ప్రయూజనం ఏమిటి? 
- రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు 2013-14లో ఏమీ రాలేదు. 2014-15లో రు.8,07,20,000 వచ్చాయి. 2015-16లో రు. 21,36,05,000 వచ్చాయి. కాని 2016-17 అంచనాలలో రు.19.90 కోట్లు చూపి , సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2017-18 బడ్జెట్‌లో రు.5 కోట్లు చూపారు. 2016-17 సవరించిన అంచనాలలో ఎందుకు సున్న చూపారు? 2017-18 బడ్జెట్‌ అంచనాలలో బాగా తగ్గించి కేవలం రు.5 కోట్లే ఎందుకు చూపారు? ఇవి ఎన్నవ ఆర్ధిక సంఘం నిధులు? ఏ ప్రాతిపదికన వస్తున్నాయి? 
-అమృత్‌ పథకం ఆదాయం 2015-16 సవరించిన అంచనాలలో రు.33.69 కోట్లు చూపగా కేవలం వాస్తవంగా వచ్చినవి 7.87 కోట్లు. 2016-17 అంచనాలలో మరల రు.33.69 కోట్లు చూపి, సవరించిన అంచనాలలో రు.7.50 కోట్లుగా చూపారు. అంచనాలలో కేవలం 4 వవవంతు మాత్రమే వస్తుండగా 2017-18 అంచనాలలో అత్యధికంగా రు.47 కోట్లు చూపటంలో ఆంతర్యం ఏమిటి? 
-ఇంతవరకు ఏమీ లేని మెట్రోరైలు విద్యుదీకరణకు రు. 10 కోట్లు , మెట్రోరైలు మౌలిక సదుపాయాలకు 10 కోట్లు ఆదాయాలలో చూపారు. అలాగే ఖర్చులలో కూడా చూపారు. ఇంతవలరు అనుమతులే లేకుండా ఆదాయ వ్యయాలలో చూపటంలో అర్శం ఏమిటి? 
- స్పెషల్‌ డెవలప్‌ మెంట్‌ ఫండ్‌ ( సర్కిల్‌-1,2,3 ఏరియా) 2014-15లో ఆదాయం సున్న. 2015-16లో సున్న. 2016-17 అంచనాలలో రు. 3 కోట్లు చూపి, సవరించిన అంచనాలలో బాగాపెంచి రు.39 కోట్లు గా చూపారు. 2017-18 అంచనాలలో రు. 30 కోట్లుగా చూపారు. ఇంత అతిగా అంచనాలు వేయటానికి కారణం ఏమిటి? 
Iహ-కాపిటల్‌ ఖర్చులు 
- బ్రిడ్జీలు, సబ్‌ వేలకు 2016-17లో రు.1 కోటి లు అంచనావేసి సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2017-18 అంచనాలలో ఏకంగా దానిని 291 కోట్లకు పెంచారు. 2016-17లో ఎందుకు నిర్మించలేక పోయారు? ఇప్పుడు ఎక్కడెక్కడ నిర్మించతలపెట్టారు? వివరించగలరు. 
-మేయర్‌ భవనానికి 26.75 కోట్లు కేటాయించారు. కాని వన్‌ టౌన్‌ ప్రాంతంలో జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి (షేక్‌ రాజా ఆసుపత్రి)గాని, కుట్టు శిక్షణా కేంద్రాలకుగాని, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ అభివృధ్ధికిగానీ, మోడల్‌ చేపల మార్కెట్ల నిర్మాణాలకుగానీ, శానిటేషన్‌ పరికరాలకుగాని, ఒక్కరూపాయికూడా కూడా కేటాయించలేదు. 
- ఎం.ఎల్‌.ఏ., ఎం.ఎల్‌.సి గ్రాంటు 2016-17 బడె&.ట్‌ అంచనాలలో ఆదాయం రు.1 కోటిగా చూపారు. ఖర్చు రు.1 కోటిగా చూపారు. కాని సవరించిన అంచనాలలో ఆదాయం తగ్గించి రు. 46,87,148 గా చూపి ఖర్చు సున్న చూపారు. సవరించిన అంచనాల ప్రకారం ఆదాయం రు. 46,87,148లు వస్తుందనుకున్నప్పుడు, ఆఆదాయాన్ని ఖర్చు చేయకుండా వదలి వేయాలనుకోవాలసిన అవసరమేమిటి? ఇక 2017-18 అంచనాలలో ఆదాయం రు. 49,21,505గా చూపి, ఖర్చులో రు 50లక్షలు చూపారు. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చూపారు. అది ఎలా సాధ్యం? 
- కాపిటల్‌ ఖర్చు(04) లో ఫర్నిచర్‌ కోసం అన్న పద్దు క్రింద రు. 25 లక్షలు కేటాయించారు. వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కొరకు అన్న పద్దు క్రింద ఏమీ కేటాయింపులు లేవని సున్న చూపారు. కాపిటల్‌ ఖర్చును వివరిస్తూ ఇచ్చే 04ఎ లో వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కొరకు అన్న పద్దు క్రింద కేటాయింపులు రు.25లక్షలుగా చూపారు. ఇంతకు కేటాయించిన ఆ 25 లక్షలు వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కోసమా? లేక జనరల్‌గా ఆఫీసు ఫర్నిచర్‌ కోసమా? 
- రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు కాపిటల్‌ ఆదాయంలో 2016-17 సవరించిన అంచనాలలో సున్న చూపి , సవరించిన కాపిటల్‌ ఖర్చు(4ఎ) లో రు. 5,91,21,000గా చూపారు. రాని డబ్బును ఖర్చు చేయటమేమిటి? 
-2015-16 లో రోడ్డు గ్రాంటు ఆదాయం సున్న. అంటే రోడ్డు గ్రాంటు ఏమీ రాలేదు. అయినా రు.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2016-17లో రోడ్డు గ్రాంట్‌ సవరించిన ఆదాయం రు. 3 కోట్లుగా చూపి, సవరించిన ఖర్చు రు.7 కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆదాయం అంచనా రు. 10 కోట్లుగా చూపి. ఖర్చు అంచనా రు. 20 కోట్లుగా చూపారు. ఒకే పద్దు క్రింద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేయటం ఎలా సాధ్యం? 
-బుడమేరు అభివృధ్ధి పనుల నిధులు 2015-16లో ఆదాయంలో లేదు. కాని ఖర్చులో రు. 16 కోట్లు చూపారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం అంచనాలలో సున్న చూపి , ఖర్చులో సవరించిన అంచనాలలో రు.28,55,29,055లు గా చూపారు. రాని నిధులను ఎలా ఖర్చు చేస్తారు? 



వి.సాంబిరెడ్డి                                                                                     యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                                               కార్యదర్శి 







Wednesday 15 February 2017

సింగ్ న‌గ‌ర్ డంపింగ్‌ యార్డు లో చెత్త తగులబెట్టడంపై పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఛైర్మెన్‌కు ఫిర్యాదు


                                                                                                                            తేదీః 13.02.2017
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఛైర్మెన్‌ గారికి, 
33-12-14E, కడియాలవారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ-2

ఆర్యా, 
విషయం:- విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌ మున్సిపల్‌ వ్యర్ధాల డంపింగ్‌ యార్డు - మరియు చెత్త తగులబెట్టడాన్ని గురించి మెమొరాండం. 
రిఫరెన్స్‌:- మా ఫిర్యాదు తేదీ 12.10.2016 (Sent by Registered Post vide RL No  A RN 634379782IN dated 13.10.2016 to APPCB Hyderabd Address)

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పడే మున్సిపల్‌ ఘన వ్యర్ధాలనుండి ఎరువులు తయారీకి, విద్యుత్‌ తయారీకి దశాబ్దాల క్రింతం రెండు ప్లాంట్లను అజిత్‌ సింగ్‌ నగర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ల వద్ద చట్ట విరుధ్ధంగా ఒక డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేశారు. ఈ ప్లాంట్లు కొంతకాలం పని చేసి మూతపడ్డాయి. ప్లాంట్లు మూతపడినప్పటికీ, నగరంలోని ఘన వ్యర్ధాలను ఆప్లాంట్ల ఆవరణలో పడవేయటం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మానలేదు. ఫలితంగా చెత్త అక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదల్లుతున్నది. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాతే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ డంపింగ్‌ యార్డు ఆవరణ చుట్టూ ప్రభుత్వం వాంబేకాలనీ, ఆతర్వాత జె.ఎన్‌.ఎన్‌.యు. ఆర్‌. ఎం. పథకం క్రింద పేదలకు గృహసముదాయాలు నిర్మించి ఇచ్చింది. పేదలకోసం కొన్నిగృహాలను ఆడంపింగ్‌ యార్డు ఆవరణలోనే నిర్మిస్తున్నది. ప్రస్తుతం డంపింగ్‌ యార్డు ప్రభావిత ప్రాంతంలో చుట్టూ సుమారు లక్ష మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు చెత్త వెలువరిస్తున్న దుర్వాసనకు కనీసం భోజనంకూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. పదార్ధాల మీద దుమ్ము, ధూళీ పేరుకు పోతున్నది. తినుబండారాలు అనారోగ్యకరంగా మారుతున్నాయి. బాగా దుర్వాసన వచ్చినప్పుడు వాంతులు, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. చర్మవ్యాధులు సోకుతున్నాయి. ఈ డంపింగ్‌యార్డు సమీపంలోనే మున్సిల్‌ కార్పొరేషన్‌ మంచి నీటిఫరా రిజర్వాయర్‌ ఉన్నది. ఆ రిజర్వాయర్‌లో నీటినే ఆ ప్రాంత ప్రజలు త్రాగుతున్నారు. ఈ ఘనవ్యర్ధాలలో అప్పుడప్పుడు చనిపోచిన జంతుకళేబరాలు కూడా వస్తున్నాయి. వీటిని కుక్కలు పిక్కుతింటూ వాటి భాగాలను చుట్టుప్రక్కల ఇళ్ళ ముందు పడవేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ డంపింగ్‌ యార్డు పరిసర ప్రాంతాలలోని ఇళ్ళకు బంధువులు కూడా రావటానికి భయపడుతున్నారు.

ఈ డంపింగ్‌యార్డు బాధలు భరించలేక స్థానిక ప్రజలు అనేక రూపాలలో ఆంధోళన చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు విజయవాడ ప్రాంతీయ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము కూడా మున్సిపల్‌ కమీషనర్‌కు, మీ కార్యాలయానికీ ఫిర్యాదులు చేసాము. అయినా ఫలితం లేక పోయింది.

ఇది చాలదన్నట్లుగా గత 15 రోజులుగా ఆ డంపింగ్‌యార్డులోని చెత్త తగలబడుతున్నది. దీనితో ఆ ప్రాంతమంతా పొగతో నిండి పోతున్నది. దీనివలన ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతున్నది. కళ్ళు మంటలతో, ఊపిరాడని పరిస్థితిలో కొంతమంది ఇళ్ళు వదలి వెళ్ళిపోతున్నారు. వెళ్ళలేని వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌లో పోలిధియాన్‌ కవర్లు, ప్లాస్లిక్‌ పధార్ధాలు ఉంటాయి. ఇవి తగుల బడితే వెలువరించే పొగలో డయాక్సిన్‌లు, ఫ్యూరాన్‌లు, ఆర్సెనిక్‌, మెర్క్యురీ, లెడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు, హైడ్రో క్లోరిక్‌ ఆసిడ్‌లు ఉంటాయని,వీటివలన ఉబ్బసం, ఊపిరిపీల్చటం కష్టంగా మారటం, చర్మసంబంధ వ్యాధులు, కాన్సర్‌ లాంటి భయంకర వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ప్రాంత ప్రజలను కనీసం మనుషులుగా చూడటంలేదన్న విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము. ఇంత భయంకరమైన పొల్యూషన్‌ బారీన పడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆచరణ శూన్యం.

ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారూ భారతీయ పౌరులే. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 21 ప్రకారం వీరికి జీవించే హక్కు ఉందన్న విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము.

మా ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, మంటలను పూర్తిగా ఆర్పివేసేవిధంగానూ, ఘన వ్యర్ధాలను ఆ ప్రాంతంలో వేయటం తక్షణమే నిలుపుదల చేసేవిధంగానూ , ఇప్పటికే అక్కడ నిల్వయున్న ఘన వ్యర్ధాలను తక్షణమే అక్కనుండి తొలగించే విధంగానూ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము. 

రిఫరెన్స్‌లో చూపిన ఫిర్యాదు కాపీని కూడా దీనితో జత చేస్తున్నాము.

అభివందనాలతో 

యంవి ఆంజనేయులు                                                                                    వి.శ్రీనివాస్‌  
కార్యదర్శి                                                                                                  సహాయ కార్యదర్శి 

Thursday 9 February 2017

విజ‌య‌వాడ మెట్రో రైలు మ‌రియు ప‌ట్ట‌ణ ర‌వాణా పై అమ‌రావ‌తి మెట్రో రైల్ కార్పొరేష‌న్‌ ఛైర్మెన్ మ‌రియు ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ,మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌కు వ్రాశిన లేఖ‌

To Date: 31.01.2017
The Principle Secretary , MA&UD,Govt of AP
and Chairman of Amaravathi Metro Rail Corporation
MA& UD dept, AP Secretariate
Velagapudi
Guntur District.
PIN : 522 503
Dear Sir,

Sub:- Our objections to Vijayawada Metro Rail project and submission of alternative proposals.

As Tax Payers Association, we submit our opinions ( including objections and alternative proposals) on Metro Rail  to be erected in Vijayawada City in two lines along with MG road and Karl Marx Road.

01. Aim of the Metro Rail :

The aim of the Metro Rail , as given in DPR published through your website, is envisaged to ease the traffic in Vijayawada City and to create unhindered mobility.  It is true in case of big cities like Kolkata, Delhi, Bangalore, Chennai, Hyderabad etc.., because they have more or less 100 km in length from one end to another end of the City.  It may take to a passenger more than one hour time in ordinary traffic and may take several hours in heavy traffic times to reach the destination.  So the aim of Metro Rail  to ease the traffic Problem is relevant to such huge cities.  But Vijayawada is relatively small city which has the length of around 10 km from Pandit Nehru Bus Station (PNBS) in any direction in Municipal Corporation Limits.

Though it appears that the traffic congestion is more in Vijayawada City, it is less when compared to other cities mentioned above. If the construction of outer ring road is completed and the traffic from NH 16 and NH 65 is diverted to outer ring road, the traffic will ease itself in Vijayawada City.  If the flyover at Benz circle and the flyover at Indra Keeladri hill are completed, the traffic will be some more eased. If flyovers or elevated high ways are constructed at Ramesh Hospital junction  and at NTR Health University junction across the highway,  the traffic will be some more eased. In addition to the flyover at Indra Keeladri hill, if another flyover is constructed from Chittinagar center to fruit market along Erra Katta or to Raghavendra Theater across the railway track and Budameru the traffic from one town area to two town areas will have a free flow.  In addition to the roads from Pipula road to Chanumolu Venkatarao Bridge & from NSC bose Nagar Centre to Ramavarappadu,  if one more fly over  from Government Press to Singh Nagar in addition to the existing one is costructed , the traffic will be eased towards Singh Nagar Area.  So, the traffic problem will be solved by the construction of flyovers in Vijayawada City as detailed,  that too with less cost.

Other reasons for Traffic Problem in Vijayawada City are 01) absence of sufficient foot paths for pedestrians and separate line for two wheelers; 02) absence of Foot over bridges or road under bridges to cross the roads wherever it is necessary; 03)  lack of understanding about Traffic Rules to drivers 04) improper signaling and 05) in sufficient training to Traffic Personnel etc. If these 5 are rectified traffic Problems will be solved in efficient manner.

The points explained above are the solutions to solve the traffic problems in Vijayawada City.  So, that the aim of Metro Rail  to ease the traffic is not applicable to Vijayawada City and if implemented boldly, it will become a white elephant to Vijayawada Citizens and may create another traffic problem.

What we wish to propose here is that the Metro Rail  would be fruitful and useful if the aim of laying Metro Rail  is changed in the scenario of Vijayawada. Our proposal in this connection is that the aim of the Metro Rail  should be changed from “easing traffic in the city” to “expansion of the City”. We explain hereunder.                                                                                      
Now the Government of Andhra Pradesh is endeavoring to annex the villages to Vijayawada City to declare it as Metropolitan area to get the sanction of Metro Rail .  Previously, there was a proposal to annex the villages to Vijayawada City in order to make Vijayawada Municipal Corporation as Greater Vijayawada Municipal Corporation.  Both previous and present moves of GOAP are preferring to drag the Villages in to Urban Fold rather than taking the actions to expand the urban area naturally towards those Villages.  If those Villages are dragged in to urban fold, as there existed much of Agricultural Land between the Vijayawada and the Villages intended to be included, it gives no use to the people of those Villages. Instead, if they are dragged in to urban area by force  there is every possibility of inflicting financial burdens on them on par with urbanites.
Instead of endeavoring to annex the villages to Vijayawada City to declare it as Metropolitan area to get the sanction of Metro Rail , if the aim of the Metro Rail  is changed to the expansion of the city, the Metro Rail  can be laid through the Villages.

We suggest some routes connecting the villages to Vijayawada by Metro Rail .

1. From Vijayawada to Agiripally/ Nuzivid
2. Vijayawada to Peda Outapally
3. Vijayawada to G.Kondur/Mylavaram
4. Vijayawada to kankipadu
5. Vijayawada to Nadigama
6. Vijayawad to Amaravathi.
If the Metro Rail  is laid to those villages as destinations, the people from the villages existing in between Metro Rail  destinations will travel to Vijayawada in very less travel time to meet their works.  So the people will naturally prefer to live in the villages along the Metro Rail  route and new colonies will develop all along the Metro Rail  lines. This development will yield two results. 1. As the people will tend to live in far off places, the congestion in Vijayawada City in all respects  will automatically decrease.  2. As the people will tend to live in far off places, new markets, new roads, new work spots will develop there. So the expansion of Vijayawada City will takes place naturally.  Urban area will naturally expand towards Villages whereby the villages gets urban environment and will become natural part of Vijayawada urban area. Then the Idea of GOAP to declare Vijayawada City as Greater Vijayawada will naturally be fulfilled.

Hence we are opposing the ongoing Metro Rail  project in Vijayawada City and demanding to lay the Metro Rail  to peripheral Villages as stated above.

02. Ownership:

We are demanding the Metro Rail  project should be in Government owner ship.  It should be laid as a joint venture of GOI and GOAP only as has been done in the Cases of Delhi, Kolkata, Chennai and Kochi Metro Rail  Projects.

03. Compensation to Land Owners.

Acquiring of Land is essential for Metro Rail  Project.  Definitely there would be the Private land to be acquired. The compensation being given to the Land owners is very meager. Here It is pertinent to place before you, as an example, that the District level Purchasing Committee of Ernakulum district fixed the maximum price at Rs 5.2 million ( Rs 52 Lakhs) per Cent to be given as compensation to Land owners in case of Kochi Metro Rail Project. In Ernakulum it was also decided to take the possession of acquired land from the Land owners only after payment of 80% of the amount.  We are demanding that the compensation should be given to the land owners at Vijayawada Metro Rail area on par with the prices given to land owners in Ernakulum in case of Kochi Metro Rail.

04. Burdens on People of State

In DPR for Vijayawada Metro Rail, it is proposed to levy the following burdens on the people of AP State.
A) A metro cess on the sale of Petrol and Diesel in the state
B) Levy of Additional Charges on the Registration of Vehicles
C) Levy of Additional cess on Property Tax.
D) A onetime green Cess on Existing Vehicles.


As Tax Payers Association, we are opposing the above 4 financial burdens being imposed on People of Andhra Pradesh. Reasons for our opposition are given below.

01.Metro Rail  is the part of urban Mobility. It is the duty of the Government to see the Mobility not only within urban area but also in outside the urban area. Metro Rail  is one among the modes of Mobility. When there is no addition Cess imposed on the introduction of other modes for Mobility, particularly Buses, in the state in general and Urban Area in particular, there is no justification in levying additional Cess/charges on People in the name of Metro rail.

02. No one outside the Vijayawada asked for Metro Rail  in Vijayawada. Even in Vijayawada City also, majority of the people are not in favour of Metro Rail .  Majority of people in Vijayawada City are demanding for flyovers at different places and expansion of City.  But Government is languishing for the construction of Metro Rail  in Vijayawada City , setting aside all other options for easing Traffic Problem.  The GOAP has not taken into consideration the basic ideas of NATIONAL URBAN TRASPORT POLICY 2014 . At this situation, there is no justification, as it is not the demand of people, in levying additional Cess/charges on People in the name of Metro rail.

03.GOAP intended to lay Metro Rail  at Vijayawada. It is mainly used by the people of Vijayawada and by the people who come to Vijayawada for their works.  It is of no use for all the people in the State.  When its use is limited to Vijayawada Citizens and very few from outside Vijayawada, there is no justification in levying additional Cess/charges on People of entire state.

04.Delhi, Chennai and Kochi metro Projects were completed with the partnership of State and Central Government. Moreover necessities in those Cities led the Governments there to lay the Metro Rail .  But here in Vijayawada, GOAP is trying to pass the burdens on the people.  It is not acceptable.

For the above 4 reasons, we are opposing the above said financial burdens proposed in DPR to inflict on the People of AP state.

05. Priority for expending Huge Amounts.

GOAP is endeavouring to expend Rs 6769 Cr for erecting Metro Rail along with just two roads i.e., MG Road and Karl Marx Road. If the Metro Rail is constructed in those two lines, only the travellers in those two lines will get benefited, even if it really serves as expected in DPR. There is no justification in expending such a huge amount only to ease the traffic in those two lines when the entire city is severely suffering from the Traffic Congestions in almost all places.   It can be emphatically said that such a huge amount is enough to create the sufficient infrastructure in the entire City of Vijayawada for free flow of traffic as outlined in paragraph No 1. If such huge amount is expended to the entire City of Vijayawada in stead of expending only in two lines, the people travelling in all routes in the city will get benefited and the entire city will be relieved of Traffic Congestions.

Keeping in view of the above, we, as Tax Payers Association, request you to look in to the matter and take necessary actions to alter the proposed Amaravati Metro Rail Project in accordance with alternative proposals narrated above which will be more useful for the expansion of the City and take the necessary Action  to construct the flyovers, foot over/ road under bridges, foot paths, proper signalling, creating awareness about traffic rules .. etc, in order to ensure the free flow of traffic.

Of these two also, we demand the authorities to give top priority for the construction of infrastructure within the city and construction of outer ring road to ensure free flow of traffic in Vijayawada city rather than giving priority to Metro Rail.
.
                                              Thanking you
                                            Yours sincerely
                                                 
  V. Sambi Reddy M.V.Anjaneyulu
       President                                                  Secretary


CC to    Sri N.P. Rama Krishna Reddy
Managing Director
Amaravathi Metro Rail Corporation Ltd. Vijayawada