Thursday 29 July 2010

" Convert the Urban Development in to Bussiness" World Bank

నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్‌ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చండి 
స్థానిక సంస్థలకు ప్రపంచ బ్యాంకు హుకుం

కేంద్రప్రభుత్వందేశంలో63నగరాలు,పట్టణాల్లోచేపట్టినజవహర్‌లాల్‌నెహ్రూపట్టణపునర్నిర్మాణపథకం(జె.ఎన్‌.ఎన్‌. యు.ఆర్‌.ఎం) కు ప్రపంచబ్యాంకు నుంచి 60వేల కోట్ల రుణం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.పి.ఎ-2 ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచబ్యాంకు మొదటి విడతగా వందకోట్ల డాలర్ల రుణం ఇస్తుంది.

ప్రస్తుతం అమలులో ఉన్నజెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కాలపరిమితి మరో రెండేళ్ళలో ముగియనుంది.2005డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు దీని కింద దేశంలో 63నగరాల్లో రు.1.20లక్షల విలువగల ప్రాజెక్టులను ఆమోదించారు. జెఎన్‌యుఆర్‌ఎంకు కేటాయించిన నిధులు అయిపోయాయి  కాబట్టి ప్రపంచబ్యాంకు రుణం అవసర మయిందని కేంద్రం చెబుతోంది.

ప్రపంచబ్యాంకు రుణంతో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం 'ప్లస్‌'అనే పేరుతో ఈ పథకాన్ని ఇకనుండి నడపబోతున్నారు. ఇది రెండోదశ. రుణం ఇచ్చే ముందు ఇప్పటివరకు పథకం అమలు తీరు, సంస్కరణలు, బడ్జెట్‌లు, అకౌంట్సు, ఆడిట్స్‌, ఇ-గవర్నెన్స్‌, పన్నుల వసూళ్ళు,ప్రైవేటీకరణ అమలు వివిధరంగాల్లో ఎలా ఉన్నది తదితర అంశాలను ప్రపంచబ్యాంకు బృందం సమీక్షిస్తోంది.దేశంలో పూర్తి స్థాయిలో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్రాజెక్టులు, సంస్కరణలు చేపట్టిన 23 నగరాలను అది పరిశీలిస్తున్నది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలోని విశాఖ, హైదరాబాద్‌ నగరాల్లో ఈ బృందం ఇటీవలే పర్యటించింది.ఇప్పటికే చేపట్టిన పనులు,సంస్కరణల అమలు తీరు గురించి అడిగి తెలుసుకుంది.వివిధ శాఖల పనితీరు,వాటిల్లో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం ఎలా ఉందో కూడా పరిశీలించింది. షరతులతో కూడిన రుణాలను తరువాత మంజూరు చేస్తుంది.

రాష్ట్రంలో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకం కింద ఉన్న హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలు ప్రపంచ బ్యాంకు  రుణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించాయి. విశాఖ నగరపాలక సంస్థ6,700కోట్లు,విజయవాడ నగరపాలక సంస్థ 3,300 కోట్లు, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ 9వేల కోట్లతో ఇందుకు సంబంధించిన సవివరమైన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి.

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం అమలు తీరును ఒకసారి పరిశీలిద్దాం.వీటి నిధులతో పట్టణాలు,నగరాల్లో మౌలిక సదుపాయాలను బ్రహ్మాండంగా మెరుగుపరచినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.మురికివాడల అభివృద్ధి,మాలిక వసతుల కల్పన, ఇల్లులేని పేదలకు ఇల్లు కల్పిస్తున్నట్లు ఊదరగొడుతున్నది.ఆఖరికి ప్రధానమంత్రి కూడా జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం నిధులతో దేశంలోని ఉన్న నగరాలు వరల్డ్‌క్లాస్‌ సిటీలుగా మారబోతున్నాయని చెబుతు న్నారు.ఇక స్థానిక అధికార పార్టీ నాయకులు ఈ పథకం ద్వారా నిధులు వరదలా వచ్చేస్తున్నాయని చెప్పని రోజంటూ లేదు.గడచిన 5ఏళ్ళలో ఈ పథకం ద్వారా మంజూరైన వివిధ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తే ఈ ప్రచారానికి, క్షేత్రస్థాయిలో భౌతిక వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు.

2005 నుండి 2010 జూన్‌ నాటికి జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకంలో మౌలికసదుపాయాల మిషన్‌ కింద 58,029 కోట్లు విలువగలిగిన 515ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అలాగే పట్టణపేదల ప్రాథమిక సేవలు (బి.ఎస్‌.యు.పి), సమీకృత  మురికి వాడల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ పథకం (ఐ.హెచ్‌.ఎస్‌.బి.పి) రెండింటి కింద 35,088 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ఆమోదించారు.వీటిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కిింద (పిపిపి)15శాతం నిధులతో 68 ప్రాజెక్టులు చేపట్టారు.
ఈ అయిదేళ్ళలో బి.ఎస్‌.యు.పి.,ఐ.హెచ్‌.ఎస్‌.డి.పి కింద కింద 15లక్షల 25వేల ఇళ్ళు మంజూరు చేయగా వీటిలో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించినది 7లక్షల85వేల ఇళ్లు మాత్రమే.ఇప్పటివరకు వాటిలో సగం కూడా పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలు కూడా నగరాలకు సూదూర ప్రాంతాల్లో చేపట్టడం వల్ల పేదలకు అంతగా ఉపయోగం లేకుండా పోతున్నాయి.విశాఖపట్నంలో లక్షా35వేలు, విజయవాడలో లక్షా 20వేలు,హైదరాబాద్‌లో 3.5లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. నిర్మిస్తున్న ఇళ్లను సర్వే ద్వారా గుర్తించిన వారికి ఇవ్వడానికి బదులు ఇప్పటికే రైల్వే, ఇతరప్రభుత్వ స్థలాల్లోనూ, కొండలమీద, కాలువగట్ల పక్కన, గెడ్డల పక్కన ఉన్న ఇళ్ళను కూల్చి వారికి కేటాయిస్తున్నారు. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్ల వెడల్పు వల్ల ఇళ్లు, షాపులు, స్థలాలు కోల్పోయిన వారికి కూడా వీటినే కట్టబెడుతున్నారు. ఇల్లులేని పట్టణ పేదలకు జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం లో స్థానమే లేకుండాపోయింది.

ఈ పథకం ఎవరి ప్రయోజనాల కోసమో తెలుసుకునేందుకు ఒక చిన్న ఉదాహరణ. ఆర్థ్ధిక సంక్షోభం వల్ల దేశంలోని ఆటో, మోటారు కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం వాటికి ప్రత్యేక ఆర్థ్ధిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకుగాను జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం 15 వేల బస్సులు కొనుగోలు చేస్తామని అశోక్‌, టాటా, స్వరాజ్‌,ఇచ్చార్‌, మహేంద్ర అండ్‌ మహేంద్ర, హిందుస్థాన్‌ మోటార్‌ సంస్థలకి హామీ ఇచ్చింది.ఇందుకోసం సుమారు రు.25వేలకోట్లు ఖర్చు చేస్తున్నది.ఇప్పటికే దేశంలో ప్రధాన నగారాల్లో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం సింబల్‌తో  బస్సులు వచ్చాయి.ఈ అయిదేళ్లలో 63నగరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు విడుదల చేసింది ఎంతో తెలుసా?జూన్‌ నాటికి 20,121కోట్లు మాత్రమే.దీనిని బట్టి ఈ పథకం అసలు ఉద్దేశమేమిటో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.ఈ పథకం ద్వారా ఇచ్చే నిధులు సంస్కరణలతో ముడిపడినవి.గడచిన అయిదేళ్ళల్లో రాష్ట్ర,నగర స్థాయిల్లో కొన్ని సంస్కరణలు చేపట్టారు.1978లో రూపొందించిన పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని రద్దుచేశారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో భూ కేంద్రీకరణ పెరిగిపోయింది.దీనికి అనుబంధంగానే స్టాంప్‌డ్యూటీని 12శాతం నుండి 8శాతానికి తగ్గించారు. వాస్తవంగా 5శాతానికి తగ్గించాలని షరతు. కొన్ని రాష్ట్రాలు 5 శాతానికి తగ్గించాయి. దీనివల్ల నగరపాలక సంస్థలకు స్టాంపుడ్యూటీ ద్వారా వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడింది.ఆస్తిపన్ను మదింపు పద్ధ్దతి విస్తీర్ణాన్ని బట్టి కాక ''యూనిట్‌ విలువ''ఆధారంగా విధించే పద్ధ్దతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నది.దీని అమలు నివేదికకై ఇప్పటికే హైదరాబద్‌లోని ఆర్థ్ధిక -సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్‌)కి బాధ్యత అప్పజెప్పింది.

ప్రపంచబ్యాంకు షరతుల అమల్లో భాగంగానే ఇంటిపన్ను,నీటిచార్జీలను పెంచారు.అనేక నగరాల్లో కొళాయిలకు మీటర్లు బిగించారు. వీధి కొళాయిలు తొలగిస్తున్నారు. ''డస్ట్‌బిన్‌ ఫ్రీ సిటీ'' పేర డస్ట్‌బిన్‌లను తొలగిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకెళ్ళినందుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. పారిశుధ్య రంగాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారు. భూగర్భ డ్రైనేజీకి యూజర్‌ చార్జీల వసూలు ప్రారంభించారు. నగరాలను పార్కింగ్‌ ఫీజులమయం చేశారు. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్లు పూర్తయితే యూజర్‌ చార్జీలు ప్రవేశపెడతామని ప్రకటించారు.ఇంకా అనేక పన్నులు, యూజర్‌ చార్జీల విధింపుకు ఉద్యుక్తులౌతున్నారు.మూడవ,నాలుగో విడత నిధుల కోసం ప్రపంచబ్యాంకు షరతుల్ని  మరింత జోరుగా అమలు చేయనున్నది.

జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకంవల్ల నగరాల అభివృద్ధి కన్నా అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. పాలక పార్టీలు, అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమ సంపాదనకు రాజమార్గంగా మారింది. ప్రాజెక్టుల వ్యయాన్ని అధికంగా చూపించటం, తమకిష్టమొచ్చిన వారికి ప్రాజెక్టులు అప్పజెప్పటం ఇందులో ప్రత్యేకత.ప్రతిదానికి సర్వేలపేర ప్రైవేట్‌ సంస్థలకి కాసులవర్షం కురిపిస్తున్నది.ప్రజల అవసరాలకన్నా లాభాలు అధికంగా వచ్చే పనులకే అధిక ప్రాధాన్యత లభిస్తున్నది.

రెండోదశ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్లస్‌ పథకం కఠినమైన షరతులతో కూడినది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టే పనులన్నీ ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి)తో చేపట్టాల్సి ఉంటుంది.నీటి సరఫరా,భూగర్భడ్రైనేజీ, బిఆర్‌టిఎస్‌, ఏదైనప్పటికీ అన్నీ పిపిపి కిందే చేపట్టాలి.రాబోయే ప్రాజెక్టులే కాదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా పిపిపి కిందకి మార్చాలని ప్రపంచబ్యాంకు వత్తిడితెస్తుంది.ప్రస్తుతం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో మంజూరయ్యే ప్రాజెక్టులకు కేంద్రం 50శాతం,రాష్ట్రం 20శాతం మిగిలిన 30శాతం స్థానిక సంస్థలు భరించాలి.ప్రపంచబ్యాంకు స్థానిక సంస్థలు భరించాల్సిన 30శాతం మ్యాచింగ్‌ గ్రాంటును ప్రైవేట్‌ సంస్థ్ధల నుండి అంటే పిపిపి ద్వారా భర్తీచేసుకోవాలని సూచిస్తున్నది.ఇది ఒక నిబంధనగా ఇప్పుడు ముందుకు రాబోతున్నది.

ఇప్పుడే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథóకంలో చేపట్టిన ప్రాజెక్టులకు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ సమకూర్చుకోలేక అనేక నగరాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి.విద్యా,ఆరోగ్య,మురికివాడల అభివృద్ధి,పేదల సంక్షేమం వంటి వాటికి నిధులు కేటాయించలేక పోతున్నాయి.విశాఖపట్నం నగరపాలక సంస్థ మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోసం 100కోట్లు మున్సిపల్‌ బాండ్లు సేకరించింది.ఇవి ఏ మూలకు  రాలేదు.ప్రస్తుతం బ్యాంకుల నుండి 200కోట్ల రుణం తీసుకో వటానికి ఒప్పందాలు చేసుకుంది.విజయవాడ నగరపాలక సంస్థ కూడా 100కోట్ల హడ్కో రుణం కోసం ఆస్తులను తాకట్టుపెట్టింది.హైదరాబాద్‌ నగరపాలక సంస్థ్ధ కూడా ఇదే దారిలో ఉంది.మొత్తంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం నగరాలను అప్పుల ఊబిలోకి దించింది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టబోయే పనులకు మరిన్ని అప్పులు చేయాల్సివస్తుంది.ప్రపంచబ్యాంకు లక్ష్యమే ఇది.అందుకే ప్రతిప్రాజెక్ట్‌ వ్యయంలో కనీసంగా 15శాతం అప్పు చెయ్యొచ్చని సలహా ఇచ్చింది.ఈ విధంగా నగరపాలక వ్యవహారాల్లో ప్రపంచబ్యాంకు ప్రత్యక్ష జోక్యం చేసుకో బోతున్నది.ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.పౌర సౌకర్యాలు,సంక్షేమం కుదింపు,సేవలకు వెలకట్టడం, పన్నుల వడ్డింపు,యూజర్‌చార్జీలు,ఫీజుల పెంపు వంటి చర్యలతో ప్రజలపై ఎనలేని భారాన్ని మోపుతాయి.రెండోదశలో ప్రపంచబ్యాంకు రుణంతో అమలు చేయబోతున్న ఈ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్లస్‌ పథకం నగర, పట్టణ పరిపాలన,తదితర విభాగాలపై ప్రభుత్వ,స్థానిక సంస్థల అజమాయిషీకి బదులు ప్రైవేటు సంస్థల పెత్తనం పెరుగుతుంది.నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్‌ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశంలో ఆంతర్యమిదే!

Thursday 22 July 2010

Necessity of Public Lands for Democratic process

ప్రభుత్వ ఖాళీ స్థలాలు హరించడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే 
       మనిషి సంఘ జీవి.మనిషి జీవించాలంటే అనివార్యంగా ఇతరులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.ఇతర మానవులతో సంబంధాలు లేకుండా ఏ మనిషి జీవించలేడు.ఇతర మానవులతో సంబంధాలు కలిగి ఉండాలంటే వారిమధ్య సమచారం ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరి. ఈ సమాజం ఎలా నడవాలి అన్న విషయం మీద, అలాగే సమాజంలోని వివిధ విషయాల మీద చర్చ జరుగుతుంది. విషయాలను అధ్యయనం చేసిన వారు, తాము అధ్యనం చేసిన విషయాలను పది మందికీ చెప్పాలనుకుంటారు. అలాగే విషయాలపై పది మందితో చర్చించాలనుకుంటారు. అలా చెప్పుకోవడం లేదా చర్చించు కోవడం కోసం పది మంది ఒకచోట కలవడాన్నే సభ లేక సమావేశం అంటాము. అందువలన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మానవ హక్కు.మానవ సమాజ హక్కు.
       సభలు, సమావేశాలు జరగాలంటే స్థలం కావాలి. స్థలం లేకుండా సభలు, సమావేశాలు జరగవు. కనుక సభలు, సమావేశాలకోసం స్థలం ఏర్పాటు చేసుకోవడం సమాజ అవసరం.సభలు,సమావేశాల ద్వారా పరస్పర అవగాహన కల్పించు కోవడాన్ని, చర్చించి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజాతంత్ర పద్ధతి అంటాము.కనుక సభలు,సమావేశాలు నిర్వహించడం, వాటికి కావలసిన స్థలాన్ని పొందటం ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కు.ఈ ప్రజాతంత్ర హక్కును  మన విజయవాడ నగర పాలక సంస్థ కాలరాస్తున్నది.అదెలాగో చూద్దాం.
       ఎన్నోబహిరంగసభలకు,ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన స్వరాజ్యమైదానం కాల గర్భంలో కుంచించుక పోయింది.కొంత భాగాన్ని రైతు బజారు ఆక్రమించింది.మరి కొంత భాగాన్ని ఫైర్ స్టేషన్ ఆక్రమించింది.ఇలా సగభాగం ఆక్రమణలకు గురైంది.ఇక మిగిలిన సగభాగంలోమాత్రమేసభలు,సమావేశాలుజరుపుకునేఅవకాశముంది.పైకి  అవకాశమున్నట్లుకనుపిస్తున్నా,వాస్తవానికి  ఆ అవకాశం అందరికీ అందుబాటులో లేదు.కారణమేమంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతిసేవకూ,ప్రతిదానికి పూర్తి ధరను వశూలు చేయాలని ప్రపంచ బ్యాంకు మన ప్రభుత్వాలనాదేశించింది.ఫ్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టి,మనప్రభుత్వాలు ఆ ఆదేశాలకు తలొగ్గాయి.దాని ఫలితంగానే స్వరాజ్య మైదానానికి కూడా రేటు నిర్ణయించారు.పూర్తి ధరను వశూలు చేయాలన్న ఆదేశానుసారం స్వరాజ్య మైదానానికిఅద్దెను రోజుకు రు.50,000లుగా నిర్ణయించారు.అంటే ఒకరోజు బహిరంగసభ నిర్వహించాలంటే రు.50,౦౦౦ లను మనం ఇరిగేషన్ డిపార్టుమెంటుకు చెల్లించాలన్నమాట. మా నగరంలో ఉన్న ఈ స్థలం మానగర ప్రజల ప్రజాతంత్ర అవసరాలకు అందుబాటులో ఉండాలని,దీనికి ఎటువంటి చార్జీలు వశూలు చేయరాదని,మన విజయవాడ నగర పాలక సంస్థ కనీసం ఒక తీర్మానం కూడా చేయలేకపోయింది.
       ఇక జింఖానా గ్రౌండ్స్ విషయం.ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉన్నది. అయినప్పటికీ దీని అద్దె కూడా ఎక్కువే. ఇందులో సభలు,సమావేశాలు జరపాలన్నా వేల రూపాయలు చెల్లించవలశిందే.
       పాత బస్ స్టాండ్ స్థలాన్ని ఒక మంచి పార్కుగా ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలు ఒకచోట చేరి ముచ్చటించుకునే కూడలిగా ఏర్పాటు చేయవచ్చు.బహిరంగ కార్యక్రమాలకు సభాస్థలిగా తయారు చేయవచ్చు.కాని దానిని ఆర్.టీ.సీ. వారు అంబికా గ్రూపుకు అప్పగించేశారు.వారు షాపింగ్ మాల్ కడతారట.దీనివలన అంబికా గ్రూపు వారికి లాభం తప్ప,మన నగర ప్రజలకేమి ఒరుగుతుంది?నగరప్రజలప్రజాతంత్ర హక్కును కాపాడటం కన్న అంబికా గ్రూపు వారి లాభాలే మన పాలకులకు ముఖ్యమైనాయి. మన విజయవాడ నగర పాలక సంస్థ,మా నగర ప్రజల ప్రజతంత్ర అవసరాలకు ఇది అవసరమని ఒక్క మాటకూడా మాట్లాడలేక పోయింది.
     స్వరాజ్య మైదానినికి ఎదురుగా, ఇరిగేషన్ డిపార్ట్ మెంటుకు చెందిన కెనాల్ గెస్ట్ హౌస్ ఊండేది. ఇప్పుడాస్థలాన్ని లైలా గ్రూపు సంస్థలకు ఇచ్చారు. వారు అక్కడ ఒక మల్టీప్లెక్స్ ధియేటర్ నిర్మిస్తున్నారు. ధియేటర్ నిర్మించేది లాభాలు సంపాదించుకోవడానికి. లాభాలు పొందాలనుకునేవారు స్థలం కొని కట్టుకుంటారు.నగర ప్రజల ప్రయోజనాలను గాలికి వదలి,ప్రభుత్వ స్థలాలను ప్రైవేటువారి లాభాలకోసం ఇవ్వ వలసిన అవసరమేముంది? దీనిని చిన్నపాటి సభాస్థలిగా ఎందుకు మార్చకూడదు?
        ఇలాంటి స్థలాలు నగరంలో చిన్నవి పెద్దవి అనేకమున్నాయి. బృందావన కాలనీలో, ఏ.పి.ఐ.ఐ.సి. కాలనీలో ఉన్న స్థలాలను వివిధ పేర్లతో ప్రైవేటు వారికి అప్పగిస్తూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానాలు చేశారు.
       గతంలో పాఠశాలలకున్న ఖళీ స్థలాలలో చిన్నచిన్న సభలు, సమావేశాలు  జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వాటి అద్దెలుకూడా రు.1000నుండి రు.1500లు చేశారు.కళాక్షేత్రం అద్దె రు 15,000లు.ఇతర మున్సిపల్ కల్యాణ మంటపాల అద్దె రు.10,000లకు పైమాటే.
       ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడం, ఉన్న స్థలాలు, కళ్యాణ మంటపాల అద్దెలను భారీగా పెంచడం మూలంగా,ధనవంతులు తప్ప సామాన్యులు సభలు,సమావేశాలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ప్రజస్వామ్యానికి విఘాతం. సభలు, సమావేశాలు ఎంత ఎక్కువగా జరిగితే ఆ సమాజం అంత సజీవంగా ఉంటుంది. సభలు, సమావేశాలు జరగని సమాజం నిస్తేజమౌతుంది. అందువలన సభలు, సమావేశాలు జరగడానికి తగినన్ని స్థలాలు నగరంలో ఉందాలి. ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడానికి, అద్దెల పెంపుదలకు వ్యతి రేకంగా పోరాడాలి.




Monday 19 July 2010

Necessity of Public Lands for Childrens' welfare

విలువైన భూములను  బడా వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్న 
విజయవాడ నగరపాలక సంస్థ
లక్షల సంఖ్యలో ప్రజలు నివసించే ప్రాంతాన్ని నగరం అంటారని మనకు తెలుసు.  లక్షల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నప్పుడు వారు స్వేచ్ఛగా మసలటానికి తగిన ఖాళీ స్థలాలు కావాలి. పిల్లలు ఆడుకోవడానికి, ప్రజలు విశ్రాంతి  తీసుకోవడానికి, ప్రజలు సభలు, సమావేశాలు జరుపుకోవడానికి  ఖాళీ స్థలాలు అవసరం. 
 01 .   పిల్లలు సాయం సమయాలలో , ఖాళీ సమయాలాలో ఖచ్చితంగా ఆటలు  ఆడుకోవాలి.  ఆడటం ద్వారా వారికి శారీరక మానసిక ఎదుగుదల బాగా ఉంటుందని మానసిక శాస్త్ర వేత్తలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆచరణలో కూడా అది రుజువైంది.  విద్య ప్రైవేటీకరణ  జరిగిన నేపధ్యంలో పాటశాలలలో క్రీడా స్థలాలు లేవు. గతంలో పాటశాలను ఏర్పాటు చేసేటప్పుడు విధిగా క్రీడా స్థలం ఉండే విధంగా చూసే వారు.ఇప్పుడు అది పోయింది.ఏవిధమైన క్రీడా స్థలాలు లేకుండానే పాటశాలలకు అనుమతులిస్తున్నారు.అపార్టుమెంట్లలో అనేక క్లాసులు నడిపేస్తున్నారు.పిల్లకు క్లాసు రూములు జైలు గదులులాగా తయారయ్యాయి.అందువలన వారు ఆడుకోవడానికి వారి నివాస ప్రాంతాలలో క్రీడా స్థలాలు కావాలి.వారికి క్రీడా స్థలాలను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉన్నది. కాని మన విజయవాడ నగరపాలక సంస్థ ఉన్న ఖాళీ స్థలాలను కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది తప్ప పిల్లల మానసిక వికాసాన్ని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. విజయవాడ నగరంలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సామాన్యుల పిల్లలకు అందుబాటులో లేదు.ఫీజులు చెల్లించ గలవారి పిల్లలే ఇందులో ఆడుకోగలరు. స్వరాజ్య మైదానం (పీ.డబ్ల్యు గ్రౌండ్) లో ఎప్పుడూ ఏదో  కార్యక్రమాలతో నిండి ఉంటుంది. సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం కొంత మేరకు పిల్లలకు అందుబాటులో ఉన్నది.అదికూడా వామపక్షాలు క్ద్దుకోవడం వలననే ఆమేరకైన పిల్లలకు అందుబాటులో ఉన్నది. 52చ.కి.మీ.కు విస్తరించి ఉన్న నగరంలో ఎక్కడో కొన్ని స్థలాలున్నంత మాత్రాన ప్రతి రోజు పిల్లలు అక్కడకు వెళ్లి ఆడుకోవడం సాధ్యమా? అందుకే క్రీడా స్థలాలు వారి నివాసాలకు దగ్గరలో ఉండాలి. ఇది నగరపాలక సంస్థ బాధ్యత.




Wednesday 14 July 2010

అవసరాలకు మించి భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.

అవసరాలకు మించి కంపెనీలకు భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.ఈ రివాజుకు ప్రజల ప్రతిఘటన రూపమే సోంపేట కాల్పుల ఉదంతం.  శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొల్లగండి వద్ధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించిన స్థానిక ప్రజానీకంపై పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు చనిపోయారు .ఇంకా అనేక మంది గాయ పడ్డారు.బుధవారం నాటి (14.07 .2010) ఈ అమానుష సంఘటనతో రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు,వాటికి భూములను కట్టబెట్టే ప్రభుత్వ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సోంపేట మండలం గొల్లగండి వద్ద 2,640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల వున్న పలాసపురం,లక్కవరం తదితర గ్రామాల్లో 920ఎకరాల ప్రభుత్వ భూమితో సహా 1540 ఎకరాల భూములను సేకరించింది. దీంట్లో ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజుకు కంపెనీ తీసుకుంది. గ్రామస్థుల నుంచి లక్షల విలువ చేసే రెండు పంటలు పండే భూములను ఉద్యోగాలు ఎరగా చూపి చౌకగా తీసుకునేందుకు వారి నుంచి అంగీకారం పొందింది. ఉద్యోగాలు, పరిహారం, పునరావాసం, కాలుష్యం తదితర అంశాల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకోవాలని స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే,ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు అభ్యంతరాలు తెలిపినా ఖాతరుచేయ లేదు.ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ గత 230 రోజులుగా స్థానికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే నేడు సోంపేటలో పరిస్థితి కాల్పుల దాకా వెళ్లింది. దీనికంతటికీ కీలకం భూమి. కాబట్టి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఎంత భూమి అవసరమో అంతే సేకరించాలి. స్థల ఎంపికలో కూడా జాగ్రత్తవహించాలి. అధికారులచే తప్పుడు నివేదికలు ఇప్పించి రైతులను కానీ,మత్స్యకారులను కానీ రోడ్డున పడేసే పద్ధతి సరికాదు.ఈ భూముల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సమగ్ర విధానం అవసరం.ఒంగోలు సమీపంలో నాలుగువేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి 4000ఎకరాల భూమి (ప్రభుత్వ భూమితో సహా) సేకరించుకునేందుకు ఎలా అనుమతించింది?
           సమీపంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి గానీ అంత స్థలం అవసరమా? ఇటీవల తమిళనాడులో తూత్తుకుడి జిల్లా ఉదంగూడిలో 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 2 యూనిట్లు అంటే 1600 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని తమిళనాడు విద్యుత్‌బోర్డు,భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నెలకొల్పాయి. అందుకోసం వారు సేకరించిన భూమి 939ఎకరాలు (యాజమాన్య నివేదిక పేజీ 1)అంటే ఒక మెగావాట్‌ విద్యుత్తుకు 0.6ఎకరం కంటే తక్కువ చాలని వారు నిర్ధారించారు.ఆ లెక్కన ఒంగోలు సమీపంలోని విద్యుత్తు ప్రాజెక్టుకు 2,400 ఎకరాలు చాలు. కాని ఇన్నిన్ని ఎకరాల సేకరణకు ఎలా అనుమతించారు? అంటే ఈ విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో ఈ అదనపు  భూమిని పెద్ద పెద్ద కంపనీలకు  కట్టబెట్టడానికేనన్నది స్పష్టం.
             పరిశ్రమలు స్తాపించాలంటే భూమి అవసరం. అది  ప్రభుత్వరంగమైన, ప్రైవేటు రంగమైన ఒకటే. పరిశ్రమంటూ పెట్టాలంటే భూమి కావలసిందే.అందులో యే సందేహమూ లేదు.కాని భూమిని సేకరించాలంటే  దానికీ ఒక పద్ధతి ఉంది.  అలాంటప్పుడు దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే దానిని ఎలా తప్పు పట్టగలం?థర్మల్‌స్టేషన్‌ స్థాపన వల్ల లాభనష్టాలేమిటన్న చర్చ కూడా జరుగుతోంది.ఏ రాష్ట్రమైనా, దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే విద్యుత్తు చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహమూలేదు. మెట్ట ప్రాంతాలలో ధాన్యం పండించడానికి బోరు బావులు, మోటార్లే శరణ్యం. వాటికి కూడా అధిక విద్యుత్తు కావాలి. ఇక గృహావసరాలకు, వాణిజ్యావసరాలకు, ఒకటేమిటి? నిత్య జీవితంలో ప్రతి నిమిషం విద్యుత్తుతోనే ముడిపడి ఉంటుంది. మన దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నందున బొగ్గుతో తయారయ్యే థóర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు అనివార్యం.అయితే అభివృద్ధి అనే ఫలాన్ని చూపి,పాలకులు ప్రజల ఆర్థిక అంశాలతోనూ, ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. దీనిని మనం అంగీకరించరాదు.
                ఇక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపన వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందా? థóర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో బొగ్గు కార్బన్‌ నిరంతరం మండించడం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ (సిఓ2) వాయువు చాలా పెద్ద మొత్తంలో విడుదలవుతుంది.ఒక అణువు కార్బన్‌ మండేటప్పుడు రెండు అణువుల ఆక్సిజన్‌తో కలిసి ఒక అణువు కార్బన్‌డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రకారం ఉదంకూడిలో 1600 మెగావాట్ల విద్యుత్పత్తికి రోజుకు 18,465 టన్నుల బొగ్గు మండుతున్నదని లెక్కించారు.(యాజమాన్య నివేదిక పేజీ4)అంటే 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రోజుకు 46,162 టన్నుల బొగ్గు అవసరం. రోజుకు దానికి 4 రెట్లు, అంటే 1,84,648 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ తయారవుతుంది.థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విడుదలయ్యే సిఓ2 ప్రపంచమంతా కొద్ది గంటలలో విస్తరిస్తుంది. కొద్ది భాగం మాత్రం అక్కడే కొద్దిసేపు ఉండే అవకాశముంది. ఆ వాయువును నిర్వీర్యం చేయడానికి, విద్యుత్‌ కేంద్రం మొత్తం విస్తీర్ణంలో నాలుగో వంతు భూమిలో, ఎకరానికి 600 చెట్లను నాటితే, అవి సిఓ2ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయనీ, అంతేకాక ఆ చెట్ల కారణంగా ఆ ప్రాంతంలో వేడిమి 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పడిపోతుందనీ వాతావరణ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ రామగుండం. వేసవిలో ఉష్ణోగ్రతలు అంతకుముందు కంటే 3 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఎక్కువ పెరిగాయి. అప్పుడు విద్యుత్‌ కేంద్ర అధికారులు శాస్త్రీయంగా ఎకరానికి 600 చెట్లు చొప్పున, 25శాతం భూమిలో పెంచడంతో సిఓ2శాతం,అలాగే ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. ఒంగోలు సమీపంలోని విద్యుత్‌ కేంద్రంలో 25 శాతం భూమిని, అంటే 600 ఎకరాల భూమిని పచ్చదనానికి కేటాయించి, దానిలో ఎకరానికి 600 చెట్లు పెంచితే సిఓ2 సమస్య, అధిక ఉష్ణోగ్రత సమస్య నివారించబడుతుంది. ఇక విద్యుత్‌ ఉత్పత్తి సమయంలో చిమ్నీల నుండి వెలువడే ధూళి, సల్ఫర్‌డయాక్సైడ్‌, నెట్రస్‌ ఆక్సైడ్‌ ఆ సమస్యలను ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్లు (ఇఎస్‌పిలు) అమరిస్తే అధిóగమింవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఉదంగూడి విద్యుత్‌ కేంద్రం, పాల్వంచలోని కెటిపిస్‌, ఇబ్రహీంపట్నం (కృష్ణాజిల్లా)లోని డా!!నార్ల తాతారావు విజయవాడ ధర్మల్‌ పవర్‌ స్టేషన్లలో వున్నాయి.ఉద్గారాలు పరిమితుల్లో ఉంటే నష్టం వుండదు. పరిమితికి మించితేనే సమస్య. కాబట్టి ఆధునికమైన పరికరాలనమర్చడానికి ప్రైవేటు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి జిల్లాలో కలెక్టరు నాయకత్వంలో పౌర సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దానికై కర్మాగారాల స్థాపన సమయంలో ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. అవసరమైతే ఉద్యమించాలి. అలాంటి పౌర సంఘాలు లేకుంటే విషవాయు ఉద్గారాలు విపరీతంగా పెరిగి చర్మవ్యాధులు, శ్వాసకోస వ్యాధులు, చివరకు రకరకాల క్యాన్సర్లు కూడా పెరిగే ప్రమాదముంది.

Saturday 10 July 2010

ప్రతి మనిషికీ ఉండవలసిన లక్షణం

కం!!   వినదగు  నెవ్వరు చెప్పిన  
         వినినంతనే వేగ పడక వివరింప దగున్,
         కని, కల్ల, నిజము తెలిసిన
         మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ!

తా. ముందుగాప్రతివాడు చెప్పేది  వినాలి.చెప్పినదాని మీద ఆధారపడి తొందర పాటుగా నిర్ణయాలు చేయకూడదు. చెప్పిన విషయాన్ని వివరంగా పరిశీలించాలి. అందులో నిజమేమిటో,అబద్ధ మేమిటో తెలుసుకోవాలి.అలా తెలుసు కొని నిర్ణయాలు   చేసే మనిషే ఈ భూమిమీద నీతిపరుడవుతాడు.

      అంటే మనం వాస్తవాల మీద ఆధారపడి నిర్ణయాలకు రావాలి. ఊహల మీద ఆధార పడి, చెప్పుడు మాటల మీద ఆధారపడి  నిర్ణయాలకు రాకూడదు.విషయాల గతిని,తార్కికంగా పరిశీలించాలి.అప్పుడే నిజా నిజాలు మనకు గోచరిస్తాయి.విషయాల చలనాన్ని పరిశీలిస్తూ, వాస్తవాల మీద ఆధార పడి నిర్ణయాలకు రావడాన్నే గతి తార్కిక పధ్ధతి అంటాము.  దీనినే భౌతిక వాదం అని  కూడా  అంటారు.భౌతికవాదిగా ఉండే మనిషి ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాడు.అర్ధం చేసుకొని మసులుకుంటాడు.ఈ ప్రపంచం లోని విషయాలను మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతడే జ్ఞాని. అతడే విజ్ఞుడు.

      జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది  మొదటిది ప్రకృతికి సంబంధించిన జ్ఞానం.రెండవది సమాజానికి సంబంధించిన జ్ఞానం.ఈ రెండూ తప్ప మరో రకమైన జ్ఞానం లేదు.మనం చెప్పుకునే అన్ని రకాల జ్ఞానాలు  ఈ రెండు జ్ఞానలకే లోబడి ఉంటాయి. గతి తార్కిక పరిశీలన మీద ఆధారపడి  విశ్వ విజ్ఞానాన్ని,సమాజ విజ్ఞాన్ని పొందినవాడే విజ్ఞుడు,  ప్రాజ్ఞుడు అవుతాడు.
    


Wednesday 7 July 2010

Components of Petrol Price-Burdening Taxes

Dear Readers,
Government of India deregulated the Petrol and diesel prices by hiking the prices on 25.06.2010. Retail Petrol Price comprise of 8 components Let me analyse Petrol price at Vijayawada after hiking on 25.06.2010

Basic Price.................... ...Rs 23.00
Central Excise Duty..........Rs 14.35 (Central Govt Tax fixed in Budget)
Education cess................. Rs 00.43 (Central Govt Tax- 3% on Rs 14.35)
Crude oil Customs Duty... Rs 01.15 (Central Govt Tax- 5% on Basic Price)
Custums Duty on Petrol... Rs 01.73 (Central Govt Tax- 7.5% on Basic Price)
VAT............................  .. .. Rs 07.59 (A.P State Govt Tax- 33% on Basic Price)
Dealer Commission ....  .. ..Rs 01.05
Trasportation Charges .... ..Rs 07.03
Total...........................    ......Rs 56.33

Value Added Tax (VAT), and Transportation Charges vary from State to state So we see different prices in different places in the Country. Here what we have to observe is that the Cetral Government is collecting taxes Rs 17.66 (76.78% on Basic Price) on 1 ltr petrole while Andhra Pradesh State Government is collecting Rs 7.59 ( 33% on Basic Price) with a total of Rs 25.25 ( 109.78% on Basic Price). Actual Petrole Cost is Rs 23.00, Taxes on it are Rs 25.25. So, Petrole Prices are becoming burden to people not beacuse of increase in Crud oil Prices but because of these huge taxes only.

Subsidies - A myth
In Real terms Government is not giving subsidy to the people on petroleum products. The Central Government collected in the form of Taxes of Rs 58,789Crs in 2002-2003, Rs 62,875Crs in 2003-2004, Rs 70,051Crs in 2004-2005, Rs 76,085Crs in 2005-2006, Rs 85,839Crs in 2006-2007, Rs 96,486 Crs in 2007-2008 ,Rs 84,298 Crs in 2008-2009, Rs 71,768Crs in 2009-10(as per written statement made by Namo Narayan Meena state minister for finance in Rajyasabha on 03.08.10) and Rs 1,20,000 Crs in 2010-2011(Budget Estimates)on petroleum products only. At the same time,the Government allotted to the petroleum Sector including subsidies Rs 57,535 Crs in 2008-2009, Rs 58,120 Crs in 2009-10( out of wich only Rs 28,789 crs towards Subsidies) , and Rs 69,495 Crs in 2010-2011. Out of huge amounts collected in the form of taxes on petroleum products from people,small amounts are given as subsidies. So it is wrong that the Government is subsiding more and the oil companies are getting losses due to these subsidies. Subsidies are declared by the Government. So Government is bound to repay the amount of subsidies to the oil companies, Unfortunately the Government is collecting taxes and is not paying the subsidy amounts to oil companies. Despite all these things, Public Sector Oil companies are getting profits, For example in 2008-2009, IOC got the net profit of Rs 2,950 Crs. In 2009-10, it got Rs 10,998 Crs and the total of its reserves Rs 49,472 Crs. These are Audited figures. The other oil companies HPC, BPC are in same line of Profits. So the propaganda that the oil companies are getting losses is false.
Now the Government is talking of under recoveries. it is advocated that due to these subsidies, public sector oil companies are making under recoveries. Under recovery does not mean that they are making losses. Under recovery means the difference of income between the amount assumed profit and acutal profit. Assumed profit means the profit they could earn if all the subsidies were removed and deregulated. So it ie evident that under recovery is not loss. The Government has taken this move to abolish the subsidies to the people in the name of losses/under recoveries. So that, the Private oil companies Like Reliance, Essar can freely market their products, so to say they can freely rob the people.
Let us awake. Let us join our hands to fight till the the removal of the taxes are achieved.

M.V.Anjaneyulu
Secretary,
Tax Payers' Association
Vijayawada
email: veeranjaneyulumatcha@gmail.com