Monday 30 August 2010

Full Text of GO. Rt. No 973 issued by Government of Andhrapradesh to levy user charges for Garbage Collection in Vijayawada City

                    GOVERNMENT OF ANDHRA PRADESH


                                         ABSTRACT

Municipal Administration and Urban Development Department - Vijayawada Municipal Corporation, Vijayawada – Cancellation of Council Resolution No.134, dated 6.8.2009 –Orders – Issued.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

MUNICIPAL ADMINISTRATION  and URBAN DEVELOPMENT (H1) DEPARTMENT

G.O.Rt.No. 973 ,                                              Dated:21.08.2010.

                                                                       Read the following

1) From the Commissioner, Municipal Corporation,
Vijayawada, Letter No.F1-163019/2008, dated 17.09.2009.

2) Government Memo No.15787/K2/2009-1, Municipal Administration
and  Urban Development Department, dated 23.01.2010.

3) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
Letter No.17/2010, dated 15.02.2010.

4) Government Memo.No.15787/K2/2009-2, Municipal Administration
and Urban Development Department, dated 6.5.2010.

5) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
Letter No.48/2010, dated 15.05.2010.

6) Government Memo.No.15787/K2/2009-3, Municipal Administration
 and Urban Development Department, dated 14.6.2010.

7) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
 Letter No.48/2010, dated 25.06.2010.

****

O R D E R:-

Whereas, in the letter 1st read above, the Commissioner,
Vijayawada Municipal Corporation, Vijayawada has
reported that Vijayawada Municipal Corporation is spending
huge amounts for Solid Waste Management in the City. The
recovery of the Operation &Maintenance charges is
very low at one third of the total expenditure. The Vijayawada
Municipal Corporation is already facing many financial constraints
in meeting various requirements and also committed to reforms
under JNNURM for 100% recovery of O&M expenditure
for various services provided by the Vijayawada Municipal
Corporation. The Municipal Council had also earlier accepted
for JNNURM project including reforms;
2. And whereas, the Commissioner, Vijayawada Municipal
Corporation, Vijayawada has further reported that an office
proposal was placed before the Municipal Council, with
estimated service / user charges of Rs.8.12 Cr per Annum.
The Vijayawada Municipal Council vide CR.No.134,
dated 06.08.2009 had rejected the proposal resolving that
the Vijayawada Municipal Corporation is already collecting
various taxes from the citizens. Such action of the council
rejecting the office proposals involving financial matter will
not only worsen the financial situation but also leave a message
 that no service charges will be levied for any service of
Vijayawada Municipal Corporation and is contrary to the
spirit of reforms undertaken by the Vijayawada Municipal
Corporation;
3. And whereas, the Commissioner, Vijayawada Municipal
Corporation, Vijayawada has finally requested the Government
to cancel the Council Resolution No.134, dated 06.08.2009
by invoking provisions under section 679-A of HMC Act 1955
so that user charges can be levied for Municipal Solid Waste
Management in the best interest of Vijayawada Municipal
Corporation;
4. And whereas, Government consider that it is appropriate
to cancel the Council Resolution No.134, dated 06.08.2009
of Vijayawada Municipal Corporation under sub-section
(1) of Section 679-A (1) of Greater Hyderabad Municipal
Corporation Act, 1955 (AP Act II of 1956), read with 
 section 7 of the Vijayawada Municipal Corporation Act,
1981 (AP Act 23/1981) as it is contrary to the spirit of reforms
undertaken by the Vijayawada Municipal Corporation and also
causes financial loss to the Corporation;
5. And whereas, in the letters 2nd, 4th and 6th cited, show
cause notices have been issued to the Mayor, Vijayawada
Municipal Corporation to explain within 15 days from the date
of receipt of this notice as to why its Council Resolution No.134,
dated 06.08.2009 should not be cancelled, as it is contrary
to the spirit of reforms undertaken by the Vijayawada Municipal
Corporation and also causes financial loss to the Corporation;

6. And whereas, in the letter 7th read above, the Mayor, Vijayawada
 Municipal Corporation has reported that at present Under Ground
Drainage works taken up under Jawaharlal Nehru National Urban
Renewal Mission are in rapid progress covering more than 70% of
the Vijayawada Municipal Corporation area. Due to the same, the
citizens of Vijayawada are facing inconvenience in Transportation
and attending other daily routine affairs. All Under Ground Drainage
works will be finished by December, 2010 as revealed during review
meetings conducted with Vijayawada Municipal Corporation officers.
Most of the Corporators are of the opinion that the proposed levy of
user charges under Solid Waste Management may be taken up
only after total completion of the Under Ground Drainage works.
The citizens of Vijayawada City are also expressing the same opinion
 that it will be apt only to levy such user charges after completion
of the Under Ground Drainage and providing other amenities. Further,
 it is felt that the tariff proposed by the Commissioner, also needs a
re-look into the suggested slabs so as to provide relief to the poorer 
 and unaffordable sections of the population of Vijayawada city.
Therefore, they have decided to levy and collect the user charges
of Solid Waste Management from December, 2010 onwards before
the next council meeting and requested the Government to
re-examine the issue and cancel the said showcause notice to
enable the Council of Vijayawada Municipal Corporation to consider
and approval of user charges on its own;

7. And whereas, Government after careful consideration of the
matter decided to cancel  the above council resolution;

8. Now, therefore, in exercise of the powers conferred under
sub-section (1) of Section 679-A(1) of Greater Hyderabad
Municipal Corporations Act, 1955 (AP Act II of 1956), read
with section 7 of the Vijayawada Municipal Corporation Act,
1981 (AP Act 23/1981), the Government hereby cancel the
Council Resolution No.134, dated 06.08.2009 of Vijayawada
Municipal Corporation;

9. The Commissioner, Vijayawada Municipal Corporation shall
take further necessary action to collect the proposed amount as
additional fee on account of Solid Waste Management.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

                                                    T.S.APPA RAO,

                    PRINCIPAL SECRETARY TO GOVERNMENT (UD).

To

The Mayor,

Vijayawada Municipal Corporation,

Vijayawada.

The Commissioner, Vijayawada Municipal Corporation, Vijayawada.

Copy to:

The Special Secretary to CM.

The Private Secretary to M(MA&UD).

The Private Secretary to Principal Secretary to Govt., (UD), MA&UD Department.

The Private Secretary to Principal Secretary to Govt., (MA), MA&UD Department.

Law (A) Department.

Sc/Sf.

                                                           //FORWARDED::BY ORDER//

                                                              SECTION OFFICER

Friday 27 August 2010

Press Note on G.O.Rt No 973 dt 21.08.2010

ప్రచురణార్ధం                                              తేదీ:25.08.2010

    చెత్త తొలగింపుపై చార్జీల ప్రతిపాదనను తిరస్కరిస్తూ నగరపాలక సంస్థ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో  ఇవ్వడం ప్రజాస్వామ్య విరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఈ మేరకు నగర మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక మెమొరాండాన్ని సమర్పించింది.  డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని,అనేక మంది కార్పొరేటర్లు, విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని నగర మేయర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ తప్పు పడుతున్నది. నగర పాలక సంస్థ చేసిన తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం  సంజాయిషీ  కోరినప్పుడు సంజాయిషీ ఇవ్వవలసింది నగర కౌన్సిల్‌ తప్ప నగరమేయర్‌ వ్యక్తిగతంగా కాదు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ లేఖను నగర కౌన్సిల్‌ లోపెట్టి చర్చించి కౌన్సిల్‌ నిర్ణయాన్ని సమాధానంగా పంపాలి. అందుకు భిన్నంగా మేయర్‌ గారు లేఖ వ్రాయటం, అందులో   డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని,విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని  వ్రాయటం దారుణం. నిజానికి  నగరపాలక సంస్థ ఏనాడు ఈ విషయంపై ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. నగరంలో అపార్టుమెంట్‌ అసోసియేషన్లు, కాలనీల అసోసియేషన్లు, ఉద్యోగ కార్మిక సంఘాలు, వర్తక వాణిజ్యవర్గాల సంఘాలు అనేకం ఉన్నాయి. వీరెవరినీ సమావేశ పరిచి సంప్రదించలేదు.  పైగా  ఈ ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. 70 వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ  ఓటుచేశారు.  ఎవరితోనూ సమావేశాలు  నిర్వహించకుండా, ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా, యు.జి.డి. పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మేయరుగారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం  ప్రజాస్వామ్య విరుధ్ధం. ఈవిషయంపై  మేయరుగారు 25.06.2010 న రాష్ట్ర్నపభుత్వానికి సంజాయిషీ ఇస్తూ  వ్రాసిన  లేఖను పూర్తిగా ప్రజల ముందుంచాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

     చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్‌ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కొనటంపట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటమే సంస్కరణల స్పూర్తి అయితే, ఆ సంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్లున్నది.  ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటమే రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం.దీనిని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ తిరస్కరిస్తున్నది. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం, ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

     ఆర్ధిక విషయాలతో ముడిపడి ఉన్న ప్రతిపాదనలను కౌన్సిల్‌ తిరస్కరించటం మూలంగా కార్పొరేషన్‌ ఆర్ధిక స్థితి దిగజారటమేకాకుండా,  కార్పొరేషన్‌ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.  నిజానికి స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్నారు. కనుక నగర ప్రజలు కార్పొరేషన్‌ చేసే ఏపనికి మరల చార్జీలు చెల్లించనవసరంలేదు.  స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి విజయవాడ నగర అభివృద్ధికి, స్ధానిక సంస్థలకు ఎందుకు నిధులివ్వరని, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.

    ఇప్పటికైనా కౌన్సిల్‌ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను రద్దు చేయాలని  టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది. రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా మేయరు గారిని, నగర కార్పోరేటర్లను, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

                         

           (వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)

             అధ్యక్షులు                                      కార్యదర్శి        

Wednesday 25 August 2010

చెత్త సేకరణకు పన్ను విధించాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన జీ. వో.నెం.973 ను రద్దు చేయాలని డిమాందు చేస్తూ నగర మేయర్ కు సమర్పించిన మెమొరాండం.

                                                                    తేదీ: 24.08.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్  గారికి,
ఆర్యా!

విషయం:- నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ జీ.వో. ఆర్‌.టి. నెం.973 కు సంబంధించి.........

      విజయవాడ నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ విజయవాడ నగర కౌన్సిల్‌ 6.8.2009 న ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 21.8.2010 న జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను విడుదల చేసింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని 17.9.2009 న కమీషనర్‌ లెటరు వ్రాశారని, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీ సంజాయిషీ కోరగా మీరు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, అనేక మంది కార్పొరేటర్లు,అదేవిధంగా విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా మీరు సమాధానం పంపారని ఆ జీ.వో లో పేర్కొన్నారు.దానిని ఆధారం చేసుకొని నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను వినియోగించి రద్దు చేసింది. మీరు పంపిన ఈ లెటర్‌ పూర్తిగా అప్రజాస్వామికమని, నగర ప్రజల అభిప్రాయానికి విరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మీదృష్టికి తీసుకు వస్తున్నాము.

జీ.వో. ఆర్‌.టి. నెం.973 లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

" And Where as, in the letter 7th read above, the Mayor, Vijayawada Municipal Corporation has reported that .....................All Under Ground Drainage works will be finished by December 2010 as revealed during reveiw meetings conducted with Vijayawada Municipal Corporation Officers. Most of the Corporators are of the opinion that the proposed levey of user charges under Solid Waste Management may be taken up only after total completion of Under Ground Drainage Works. The Citizens of Vijayawada City are also expressing the same opinion that it will be apt only to levy such user charges after completion of the Under Ground Drainage and providing other amenities."

        నగరపాలక సంస్థలో నిర్ణయాలు చేయటానికి కౌన్సిల్‌ ప్రజాస్వామ్య వేదిక. ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయం తీర్మానమవుతుంది. నగరంలో ఇప్పటికే అనేక పన్నులు విధిస్తున్నందున చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.మాదృష్టికి వచ్చినంతవరకు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, ఏ తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలోనూ తీర్మానించలేదు. కౌన్సిల్‌లో తీర్మానం చేయకుండా డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వ్రాశారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేమేనాడు ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం మీరు నగరంలోని అపార్టుమెంట్‌ అసోసియేషన్ల సమావేశాలుగాని,కాలనీల అసోసియేషన్ల సమావేశాలుగాని,ఉద్యోగ కార్మిక సంఘాల సమావేశాలుగాని,వర్తక వాణిజ్యవర్గాల సమావేశాలుగాని నిర్వహించలేదు. పైగా ఈ ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు.70వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓటుచేశారు.ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకుండా,ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా,యు.జి.డి.పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం ఆశ్ఛర్యంగా ఉంది.ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని మీదృష్టికి తెస్తున్నాము.

దీనితో బాటుగా జీ.వోలో ఉన్న మరోక విషయాన్ని కూడా మీదృష్టికి తెస్తున్నాము. జీ.వోలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పేర్కొంది.

" Such action of the Council rejecting the office proposals involving financial matters will not only worsen the financial situation but also leave a massage that no service charges will be leveid for any service of Vijayawada Municipal Corporation and is contrary to the spirit of reforms undertaken by the Vijayawada Municipal Corporation"

         ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే భావిస్తున్నాము. నగర పాలక సంస్థ కౌన్సిల్‌లో ఉన్న వాళు నగరపాలక సంస్థ ఆర్ధిక పరిస్థితి గమనించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ జీ.వోను ఇచ్చినట్లుగా ఉన్నది. అంతే కాకుండా కార్పొరేషన్‌ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్‌ చేసే ఏపనికి మరల చార్జీలు విధించరాదనే కోరుకుంటున్నారు. ఇది తప్పు కాదు. ఇది నగర ప్రజల సమంజసమైన కోరిక. ఒకవైపు పన్నులు వసూలు చేస్తూనే మరొకవైపు ప్రతిపనికి మరల యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు, ఫీజుల పేరుతో వసూలు చేస్తామని అటు కార్పొరేషన్‌, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఆచరణకూడా ప్రారంభించాయి. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం తాము చెల్లిస్తున్న పన్నులనుండి మా నగర అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరని,మామీద మరలా ఎందుకు భారాలు మోపుతున్నారని నగర ప్రజలు ప్రశ్నిస్తే నగర ప్రజలకు సపమాధానం చెప్పవలసిన బాధ్యత కార్పొరేషన్‌ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, ప్రజల మీద చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదు.

         ఇక చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్‌ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కోన్నారు. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటవేు సంస్కరణల స్పూర్తి అయితే, ఆసంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని స్పష్టం చేస్తున్నాము. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం,ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటవేు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం. దీనిని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా వేుము తిరస్కరిస్తున్నాము.

          ఇప్పటికైనా కౌన్సిల్‌ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా కోరుతున్నాము.

                                                                           అభివందనాతో
                                                                    యం.వి.ఆంజనేయులు
                                                                             కార్యదర్శి



        

Sunday 15 August 2010

Worl Bank Loan to Andhra Pradesh- Its Impact

ఆంధ్రప్రదేశ్‌ పై ప్రపంచబ్యాంకుకు అంత ప్రేమెందుకో?


2010-2011 ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం= రు9841.5 కోట్లు.
దీనిలో
01.ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.
పురపాలక సంస్థలలో సంస్కరణల అమలుకు ఇచ్చిన ఋణం = రు 1350 కోట్లు
రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన ఋణం                                 = రు1440 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు ఇచ్చిన ఋణం                              = రు  675 కోట్లు
నాగార్జున సాగర్‌ ఆధునికీకరణకు ఇస్తున్న ఋణం                = రు 2025 కోట్లు
                                                     మొత్తం ఋణం        = రు 5490 కోట్లు
ఇతర రాష్ట్రాలకు కేటాయించినది.

02. ముంబయి అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు కోసం కేటాయించింది             = రు 1935.0 కోట్లు
03. తమిళనాడు రోడ్‌ సెక్టారుకు, ఆరోగ్య రంగానికి కేటాయించింది = రు 755.5 కోట్లు
04. కర్ణాటక ఆర్‌.డబ్ల్యు.యస్‌ పథ కానికి కేటాయించింది             = రు 675.0 కోట్లు
05. రాజస్థాన్‌ వాటర్‌ సెక్టార్‌కు కేటాయించింది                           = రు   86.0 కోట్లు
06. బెంగాల్‌ పంచాయతీ రాజ్‌ సంస్థల కోసం కేటాయించింది      = రు  900.0 కోట్లు
                        ఇతర రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇస్తున్నఋణం       =రు4351.5 కోట్లు

పై కేటాయింపులను పరిశీలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో 56శాతం ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌కే కేటాయించింది. అది కూడా విషమ షరతులతో.మున్సిపాలిటీలు చేసే ప్రతిపనికీ రేటుకట్టి వసూలు చేయాలని,నాగార్జున సాగర్‌ కాలువకు నీటి మీటర్లు పెట్టి రైతులకు ఇచ్చే ప్రతి నీటిచుక్కకు రేటుకట్టి వసూలు చేయాలని ప్రపంచబ్యాంకు విధించిన షరతులకు మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఈ ఋణం తెచ్చింది.పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు షరతులు లేని ప్రాజెక్టు లోను తెచ్చుకుంటే,మనరాష్ట్రం మాత్రం ప్రజావ్యతిరేక షరతులతో కూడిన ఋణం తెచ్చింది.దీని దుష్ప్రభావాలు మనరాష్ట్రంలోని పట్టణ ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు.పట్టణాలలో నీటి మీటర్లుపెట్టడం,చెత్త ఎత్తివేయటానికి పన్ను వసూలు చేయటం,పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఎత్తివేయటం,రిజిష్ట్రేషన్‌విలువను తగ్గించి ,భూములవిలువలు పెంచటం లాంటివన్ని ఈ ఫరతులలో భాగమే. ఈ దుష్ప్రభావాలను ఇప్పుడు పట్టణ ప్రజలతో బాటుగా రైతులు కూడా అనుభవించబోతున్నారు. షరతులను ఎదుర్కొనకపోతే మనరాష్ట్ర ప్రజలకు విముక్తి లేదు.

ఇది కాక మన కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు వద్ద మరో 31855.5కోట్లు ఋణం తీసుకున్నది.దీనితో కలిపి 2010-2011లో మన దేశం తీసుకున్న మొత్తం ఋణం రు41,697కోట్లు అయింది.ప్రజావ్యతిరేక షరతులకు అంగీకరించి అసలీ ఋణంతీసుకోవలసిన అవసరం ఉందా అంటే లేదు.ఈ సంవత్సరంతో కూడా కలుపుకొని గత 4సంవత్సరాలలో స్వదేశీ,విదేశీ గుత్తసంస్థలకు ఇచ్చిన రాయితీల మూలంగా క్రేంద్ర ఖజానాకు 17 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాలే దీనికి ఆధారం. ఒకవైపు ఈ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలిస్తూ, మరోవైపు ప్రజలమీద భారాలు మోపే విషమ షరతులకు అంగీకరించి అప్పుల మీద అప్పులు తెస్తున్నారు.ఈ అప్పులను మళీ మనవేు తీర్చాలి.ఈ అప్పులతో,ప్రైవేటీకరణలతో భారత ప్రజల బ్రతుకులు పరాధీనమౌతున్నాయి.ఈ విధానాలు మారితేనే ఈ దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది.ఈ విధానాల మార్పుకోసం పోరాడటమే   మన కర్తవ్యం.


ట్రాఫిక్ రద్దీ పరిష్కారంకై మున్సిపల్ కమీషనర్ కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ లేఖ

గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,


ఆర్యా!

విషయం:- నగరంలో రోడ్ల వెడల్పుకు సంబంధించి.........


విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేటందుకు రోడ్ల విస్తరణకు తగిన చర్యలు చేపట్టాలని మీరు అధికారులను ఆదేశించినట్లుగా పత్రికలలో చూచాము. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీదృష్టికి తెస్తున్నాము.

01. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి రోడ్ల విస్తరణ ఒక్కటే మార్గంగా కార్పొరేషన్‌ ఎంచుకుంటున్నది. ఇది సరికాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా వేుము అభిప్రాయపడుతున్నాము. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. వీటిని గురించి కార్పొరేషన్‌ పట్టించుకోవటం లేదు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్యాయాలను గురించి ఆలోచించాలని కోరుతున్నాము.

02.సాధారణంగా రోజువారి ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించడానికి కార్పొరేషన్‌ అధికారులు పోలీస్‌ యంత్రాంగం కూర్చొని తగిన చర్యలు చేపట్టవచ్చు. కాని ట్రాఫిక్‌ రద్దీ సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకునే చర్యలు నగరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి రోడ్లు వెడల్పు చేయడం, దానికై స్థలసేకరణ జరపడం అన్నవి విధానపరమైన నిర్ణయాలు. రోడ్ల విస్తరణకై సేకరించే స్థలం కేవలం ప్రభుత్వ భూమి మాత్రవేు కాదు. అందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. భవనాలు ఉన్నాయి. భవనాలను కూలగొట్టి పట్టాభూములను లాగేసుకోవడం అనేది విధానపరమైన చర్య. నగరం మొత్తంమీద ప్రభావంచూపే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నగరంలో చర్చ జరగాలి. అది జరగటం లేదు. కేవలం కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం అనుకున్న విషయాలను అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నారుతప్ప, నగరంలో ప్రజలకు ఎలా సౌకర్యంగా ఉంటుంది, నగర ప్రజలు తమకేం కావాలని అభిప్రాయపడుతున్నారో తెలుసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు జరగటం లేదు. ఇది అనేక సందర్భాలలో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నది. నగరపాలక సంస్థకుకూడా నష్టం వాటిల్లుతున్నది. అందువలన ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ అపార్టుమెంట్ల అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, వర్తక వాణిజ్య అసోసియేషన్లు, ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్లు, మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు, మహిాళా సంఘాలు, వివిధ ట్రేడ్‌యూనియన్‌లతో సంయుక్తంగా చర్చ జరిపి వచ్చిన అభిప్రాయానికనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

03. ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణంపై 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ హాలులో టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్‌ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, మాజీవేుయర్‌ శ్రీ జంధ్యాల శంకర్‌, ఆ పరిసర ప్రాంతాల నివాసులు, పీపుల్‌ ఫర్‌ ఇండియా ప్రతినిధులు, ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు, మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రప్రభుత్వానికి లేఖ వ్రాశాము. ఆలేఖ కాపీ తమ పరిశీలనార్ధం దీనితో జతచేసి పంపుతున్నాము.


పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్యాయాలను పరిశీలించాలని, ప్రత్యామ్నాయాలతో బాటుగా పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో చర్చలు జరిపిన అనంతరం మాత్రమే  రోడ్ల వెడల్పు లాంటి తదుపరి చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.

                                       అభివందనాతో

(వి. సాంబిరెడ్డి)                                             (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                         కార్యదర్శి

Tax Payers' Association writes to Chief Minister of A.P.on Flyover at Benz Circle

బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి  వ్రాశిన లేఖ.         
                                                                                                                
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి,
ఆర్యా!

విషయం:- బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి.........

                    విజయవాడ నగరంలోని మహాత్మా గాంధీరోడ్డును బెంజి సర్కిల్‌ వద్ద దాటుకుంటూ 5వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది. మద్రాసు నుండి కలకత్తావెళ్ళే   భారీవాహానాలు,  హైదరాబాద్   వైపునుండి  9 వ నెంబరు జాతీయ రహదారి ద్వారా కలకత్తా, మరియు మచిలీపట్టణం వెళ్ళే భారీవాహానాలు 5వనెంబరు జతీయ రహాదారి ద్వారావచ్చి బెంజి సర్కిల్‌ వద్ద చీలుతాయి. అందువలన  బెంజి సర్కిల్‌ వద్ద విపరీతంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి నిలిచి పోతున్నది. దీనితో నగరవాసులకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది.అందువలన బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ను నిర్మించాలని విజయవాడ నగరవాసులు ఎంతో కాలంగా కోరుతున్నారు.అయినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.

అయితే ఇటీవల బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నదని,నటరాజన్‌ గుల్జార్‌ రోడ్డు (టిక్కిల్‌ రోడ్డు)నుండి ప్రారంభించి,బెంజి సర్కిల్‌ మీదుగా పటమట యన్‌.టి.ఆర్‌.విగ్రహాం వరకు మహాత్మా గాంధీ రోడ్డు మీద ఈ ప్లైఓవర్‌ను నిర్మించబోతున్నారని పత్రికలలో చూచాము.

ఈ విషయంపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ హాలులో టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్‌ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, మాజీ మేయర్‌ శ్రీ జంధ్యాల శంకర్‌,ఆ పరిసర ప్రాంతాల నివాసులు,పీపుల్‌ ఫర్‌ ఇండియా ప్రతినిధులు,ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు,మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు.వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి తమ పరిశీలనార్ధం మీముందుంచుతున్నాము.
  అభిప్రాయాలు:

01. జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాల వలననే బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్నది. కారణ మేమంటే మహాత్మా గాంధీ రోడ్డు మీద బెంజి సర్కిల్‌ వద్ద ఎలాంటి వాహానాలు ఆగవు.ఆగే అవసరం కూడా లేదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే స్థానిక వాహానాల వలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తడం లేదు.ట్రాఫిక్‌ సమస్యకు కారణం జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాలే.కనుక భారీ వాహానాలను మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చేస్తే అక్కడ ట్రాఫిక్‌ సమస్య ఉండదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద కాకుండా జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మిస్తే ఈసమస్య పరిష్కారమౌతుంది.

02. మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మించి, మహాత్మా గాంధీ రోడ్డుమీద వచ్చే ట్రాఫిక్‌ను జాతీయ రహాదారిపై వచ్చే ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా చేసినా బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది.అయితే దీని ప్రయోజనం పరిమితంగా ఉండటవేు కాకుండా ట్రాఫిక్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి.ఇటీవలనే మహాత్మాగాంధీ రోడ్డును 120అడుగులుండేవిధంగా వెడల్పు చేశారు.ఆ సందర్భంగా పట్టా భూములలో నిర్మించుకున్న ఇళను సైతం తొలగించి వెడల్పు చేసారు.ఈ రోడ్డు మీద సిటీ బస్సులు,చిన్న కార్లు,మోటారు సైకిళు,ఆటోలు,సైకిల్‌ రిక్షాలు,పాల వాహానాలు, ఫైరింజన్లు, అంబులెన్స్‌లు ,స్కూల్‌బస్సులు తిరుగుతుంటాయి. నగరంలో ఇది ఒక ప్రధాన రహాదారి.నగరంలో అనేక ప్రాంతాలకు వెళే సిటీ బస్సులు ఈ రోడ్డు ద్వారానే వెళ్లాలి. నగర భౌగోళిక పరిస్థితి దృష్ట్యా,ఇతర మార్గాలలో వెళే అవకాశం కూడా లేదు.అలాంటి ఈ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ రోడ్డు మరల ఇరుకుగా తయారవుతుంది.జాతీయ రహాదారినుండి మహాత్మా గాంధీ రోడ్డులోకి ప్రవేశించే సిటీ బస్సులు,ఇతర వాహానాలకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది.ఇది మరల ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతుందే తప్ప పరిష్కారం కాదు.అదే జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే అటు జాతీయ రహాదారిపై వెళే వాహానాలకు గాని,ఇటు మహాత్మా గాంధీ రోడ్డు మీద వెళే ట్రాఫిక్‌కుగాని ఎలాంటి ఆటంకం ఉండదు.సమస్య పరిష్కార మవుతుంది.

03. అంతేకాకుండా, నటరాజన్‌ గుల్జార్‌ రోడ్డు (టిక్కిల్‌ రోడ్డు) నుండి బెంజి సర్కిల్‌ మీదుగా పటమట యన్‌.టి.ఆర్‌. విగ్రహాం వరకు మహాత్మాగాంధీ రోడ్డుపై 3 ప్రధానమైన బస్సు స్టాపులు ఉన్నాయి. వీటిని తరలించే అవకాశం కూడా లేదు.మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ బస్సు స్టాపులను రద్దు చేయవలసి ఉంటుంది.దీనివలన నగరంలోని అత్యధిక బస్సు ప్రయాణీకులకు ఇది ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.

04. మహాత్మాగాంధీ రోడ్డులో బి.ఆర్‌.టి.యస్‌ బస్సు కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపు ప్లైఓవర్‌ నిర్మించి,మరోవైపు బి.ఆర్‌.టి.యస్‌ బస్సులకు డెడికేటెడ్‌ లైన్‌ ఏర్పాటు చేస్తే,ఇక ఇతర వాహానాలకు తావుండదు. ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరుగుతుంది.

05.జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. బెంజ్‌ సర్కిల్‌తో బాటుగా నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు,ప్రభుత్వ ఐ.టి.ఐ.నుండి గురునానక్‌నగర్‌ వెళే రోడ్డు జాతీయ రహాదారిని దాటుతున్నాయి.ఈ మధ్యలో ఉన్న కాలనీలలో ఇంకా అనేక చిన్న రోడ్లు ఉన్నాయి.ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమైన విద్యాలయాలు కూడా ఉన్నాయి.జాతీయ రహాదారిమీద స్క్యూ బ్రిడ్జినుండి మొదలై హెల్త్ యూనివర్శిటీవరకు ప్లైఓవర్‌ నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. ప్రస్తుతం జాతీయ రహాదారి వలన, నగరం జాతీయ రహాదారికి తూర్పు, పడమర ప్రాంతాలుగా చీలి ఉన్నది. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ రెండు ప్రాంతాలు కలిసి పోతాయి.ఆటోనగర్‌లోకి భారీ వాహానాలు ప్రవేశించడానికి గురునానక్‌ రోడ్డు ప్రత్యామ్నాయ  రోడ్డుగా అభివృద్ధి చెంది, పడమటలో ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది. రోడ్డుకు ఇరు వైపులనున్న కాలనీల నుండి వచ్చే రోడ్లు కలిసి పోవడంతో కొన్ని రోడ్ల మీదనే ఏర్పడుతున్న ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది.అందువలన జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మించడమే  సరైనది.

06. నగరానికి ఒక ముఖ్యమైన ప్లైఓవర్‌ నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యపై సమగ్రమైన అధ్యయనం జరిపి ప్లైఓవర్‌ నిర్మిస్తే అది నగర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుంది.గతంలో వి.జి.టి.యం.ఉడా వారు ఒక అధ్యయనం జరిపి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మాస్టర్‌ ప్లానులో కూడా జాతీయ రహాదారి మీదనే ప్లైఓవర్‌ నిర్మించాలని సూచించారు.

07. నగరంలో నిర్మించే ప్లైఓవర్‌ నగర ప్రజలకు సౌకర్యయుతంగా ఉండటవేు కాకుండా, నగర అందాన్ని ఇనుమడింపజేసేదిగా కూడా ఉండాలి. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తేనే నగర ప్రజలకు సౌకర్యంతో బాటుగా, నగరానికి వన్నె తెచ్చేదిగా ఉంటుంది.

08. జాతీయ రహాదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతున్నందున గతంలో 2 లైన్లుగా ఉన్న 5వనెంబరు జాతీయ రహాదారిని 4 లైన్లుగా మార్చారు. ప్రస్తుతం 6 లైన్లుగా మార్చుతున్నారు. జాతీయ రహాదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిందనే దీనర్ధం. ట్రాఫిక్‌ విపరీతంగాపెరిగినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత జాతీయ రహాదారుల సంస్థ(నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా ) పై ఉన్నది.చెన్నై నుండి కలకత్తా మధ్యలో,విజయవాడతో పోల్చినప్పుడు చాలాతక్కువ ట్రాఫిక్‌ ఉన్న పట్టణాలకు,కొన్ని పల్లెటూళ్ళకు సైతం జాతీయ రహాదారుల సంస్థరింగ్‌ రోడ్డులను నిర్మించింది.కాని రెండు జాతీయ రహాదారుల కూడలిగా ఉండి, ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా ఉన్న విజయవాడ నగరానికి మాత్రం రిండ్‌ రోడ్డును నిర్మించలేదు.విజయవాడ నగరానికి రింగ్‌ రోడ్డును నిర్మించి ఉన్నట్లైతే ఈ సమస్య చాలావరకు పరిష్కారమయ్యేది.

09. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించవలసింది జాతీయ రహాదారుల సంస్థ . అది జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు నగరపాలక సంస్థకు ఆర్ధిక భారం తప్పుతుంది. నగర ప్రయోజనం నెరవేరుతుంది.
పైవన్నీ 19.02.2010న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏకాభిప్రాయంగా వచ్చిన అభిప్రాయాలు.గతంలో విజయవాడ నగరంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పోలీస్‌ కంట్రోల్‌ రూంనుండి వినాయకుని గుడివరకు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్లైఓవర్‌ నిర్మించారు.కాని అది ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించక పోగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ సమస్యకు అదే కారణమవుతున్నది. ఇప్పుడు నిర్మించబోయే ప్లైఓవర్‌ అంతకంటే ముఖ్యమైనది.అందువలననే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దానికోసవేు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జరిపాము.ఏవిధంగా చూచినా బెంజి సర్కిల్‌ వద్ద జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మించడవేు నగర ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారమని అందరూ అభిప్రాయపడ్డారు.

నగర ప్రజల అభిప్రాయాన్ని ,నగర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని మహాత్మా గాంధీ రోడ్డుకు బదులుగా స్క్యూ బ్రిడ్జి నుండి బెంజి సర్కిల్‌ మీదుగా హోల్త్‌ యూనివర్శిటీవరకు 5వనెంబరు జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.
                                     అభివందనాతో
(వి. సాంబిరెడ్డి)                                          (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                        కార్యదర్శి  

తేదీ: 22.02.2010