Friday, 8 April 2011

2011-2012 రాష్ట్ర బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం కేటాయింపులు జరపాలని కోరుతూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖ

                                                                           తేదీ:18.01.2011

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి,

ఆర్యా!
విషయం:- 2011-2012 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సులప్రకారం కేటాయింపులు జరపాలని కోరుతూ......

    వచ్చే ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 2011-2012 ఆర్ధిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టబోతున్నది. ఈ సందర్భంగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా ఈ క్రింది విషయాలను మీదృష్టికి తెస్తున్నాము.

    కేంద్ర గ్రాంటులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో (అనగా పన్ను మరియు పన్నేతర ఆదాయాల మొత్తంలో) 39.24% స్థానిక సంస్థలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సు చేసింది.మొదటి ఫైనాన్స్‌

2011-2012 విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌ కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ చేసిన సూచనలు

                                                                    తేదీ : 14.02.2011
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫీసర్‌ గారికి


విషయం : 2011-2012 ఆర్ధిక సంవత్సరానికి విజయవాడ నగరపాలక సంస్థ
బడ్జెట్‌ రూప కల్పన సందర్భంగా టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న సూచనలు

ఆర్యా

    2011-2012 ఆర్ధిక సంవత్సరానికి విజయవాడ నగరపాలక సంస్థ రూపొందిస్తున్న బడ్జెట్‌పై సూచనలు తెలియజేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు.

    బడ్జెట్‌ అనేది కేవలం ఆదాయవ్యయపట్టిక మాత్రమేకాదు. అది సంస్థ అనుసరించే విధానాలనుకూడా తెలియజేస్తుంది. గత 5 సంవత్సరాల బడ్జెట్‌ను విశ్లేషించినప్పుడు మేముకొన్ని విషయాలనుగమనించాము. అవి ఈసారిబడ్జెట్‌లో సరిదిద్దబడాలన్న ఉద్దేశంతో మీముందుంచుతున్నాము.

01.మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థకు గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వటం లేదు. ఆ నిధులు వస్తే నగరపాక సంస్థ ఆర్ధిక ఇబ్బందులలో పడేదికాదు. ఆ నిధులు రాబట్టడానికి బదులుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలపై యూజర్‌ చార్జీలపేరుతో లేదా పన్నుల పెంపులపేరుతో నగర పౌరులనుండి వసూలుచేయటం మార్గంగా ఎంచుకుంటున్నది. ఇది సరైందికాదు.

    రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నుల నుండి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఆ నిధులే స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు. స్థానిక సంస్థలకు ఎంత కేటాయించాలో నిర్ణయించడానికి రాజ్యాంగం

Tuesday, 8 February 2011

PEOPLES DECLARATION AGAINST WATER PRIVATIZATION

PEOPLES DECLARATION AGAINST WATER PRIVATIZATION

We the people representing all the Regions of lndia solemnly declare that:

• Water is life, it is a gift of nature. The access and right to water is a natural basic right of all living beings.

• Water cannot to be treated as a commodity and traded for profit. People shall have the right to freedom from thirst and shall have adequate access to water for all of their sustainable living needs. Water is the sacred common heritage of the people to be nurtured, conserved, used sustainably and shared equitably.

• Experiences all over the world reveal quite convincingly that water, which is "life", is being commodified

Wednesday, 5 January 2011

Memorandum Submitted to Muncipal Commissioner demanding Conservation of Public Places

                                                                                 తేదీ:05.01.2011
గౌరవనీయులైన కమీషనర్‌ గారికి,
మున్సిపల్‌ కార్పొరేషన్‌, విజయవాడ

ఆర్యా!

విషయం:- విజయవాడ నగరంలో పబ్లిక్‌ స్థలాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ.......
నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మున్సిపల్‌ ఖాళీ స్థలాలలోనూ,కొండల పైభాగాలలోనూ ప్రైవేటు సంస్ధల ఆధ్వర్యంలో రెస్టారెంట్లు, జిమ్‌లు, కార్‌ పార్కింగ్‌లు, వినోద వ్యాపార భవనాలు నిర్మించడానికి ఆసక్తి గలవారినుండి ప్రతిపాదనలు కోరుతూ మీ కార్యాలయం 06.12.2010తేదీన విడుదలన చేసిన No.AC(P)-162611/2010  నంబరు  గల లేఖకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము.మేము అభ్యంతరం వ్యక్తం చేయటానికిగల కారణాలను ఈ దిగువ నిస్తున్నాము.
1. నగర ప్రజల ప్రజాతంత్ర అవసరాలు

విజయవాడ నగర ప్రజలకు ఖాళీ స్థలాల అవసరాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఏమాత్రం గుర్తించటం లేదు. సుమారు 10లక్షలమంది ప్రజానీకం ఈ నగరంలో నివసిస్తున్నారు.ఈ దేశంలో నివశించే ప్రతి పౌరునికీ భారత రాజ్యాంగం ప్రజాతంత్ర హక్కులను ప్రసాదించింది.అందులో సభలు సమావేశాలూ నిర్వహించుకోవటం భారత

Sunday, 12 December 2010

Tax Payers' Association gives a call not to pay user charges for Solid waste management

చెత్త పన్ను కట్టవద్దు- ఆస్థి పన్ను మాత్రమే చెల్లించండి.

విజయవాడ నగర ప్రజలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు
మితృలారా!


ఈ అక్టోబరునుండి అర్ధ సంవత్సరానికి మీరు చెల్లించవలసిన ఆస్థి పన్ను నోటీసులు మీకు ఈ పాటికి వచ్చే ఉంటాయి. వాటిని వెంటనే చెల్లించకండి. చెల్లించబోయే ముందు ఒక్క సారి పరిశీలించండి. ఆనోటీసులో యూజర్‌ చార్జీల పేరుతో కొంత మొత్తం కలిపి ఉంటుంది. అదే చెత్త పన్ను. ఏదైనా పన్ను లేదా చార్జీలు విధించే ముందు

Thursday, 2 December 2010

పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు - సంపన్నులకు సదుపాయాలు- ఇవే పట్టణ సంస్కరణలు

 కేంద్రం జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ (జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం) పథకంలో తొలుత హైదరాబాద్‌,విశాఖపట్టణం,విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది.ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది. పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది.కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది.నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది.పట్టణ ప్రజల జీవితాలను అతలాకుతలం .పట్టణాల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు,కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయని ఊదర