తేదీ:05.01.2011
గౌరవనీయులైన కమీషనర్ గారికి,
మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ
ఆర్యా!
విషయం:- విజయవాడ నగరంలో పబ్లిక్ స్థలాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ.......
నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలాలలోనూ,కొండల పైభాగాలలోనూ ప్రైవేటు సంస్ధల ఆధ్వర్యంలో రెస్టారెంట్లు, జిమ్‌లు, కార్ పార్కింగ్‌లు, వినోద వ్యాపార భవనాలు నిర్మించడానికి ఆసక్తి గలవారినుండి ప్రతిపాదనలు కోరుతూ మీ కార్యాలయం 06.12.2010తేదీన విడుదలన చేసిన No.AC(P)-162611/2010 నంబరు గల లేఖకు టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము.మేము అభ్యంతరం వ్యక్తం చేయటానికిగల కారణాలను ఈ దిగువ నిస్తున్నాము.
1. నగర ప్రజల ప్రజాతంత్ర అవసరాలు
విజయవాడ నగర ప్రజలకు ఖాళీ స్థలాల అవసరాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఏమాత్రం గుర్తించటం లేదు. సుమారు 10లక్షలమంది ప్రజానీకం ఈ నగరంలో నివసిస్తున్నారు.ఈ దేశంలో నివశించే ప్రతి పౌరునికీ భారత రాజ్యాంగం ప్రజాతంత్ర హక్కులను ప్రసాదించింది.అందులో సభలు సమావేశాలూ నిర్వహించుకోవటం భారత
రాజ్యాంగం ఆర్టికల్19(1)(b) ప్రకారం నగర పౌరులకున్న ప్రాధమిక హక్కు. నగరంలో 59 డివిజన్లు ఉన్నాయి. ప్రజాతంత్రయుతంగా నగరపాలన కోసం ఈ డివిజన్లను రాజ్యాంగ బధ్ధంగా ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్‌లో 15 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.ప్రజలు తాము నివశించే ప్రాంతాలలో తాము ఒకచోట చేరి తమ అవసరాలను గురించి, తాము అనుసరించ వలసిన పధ్ధతులను గురించి చర్చించుకోవాలి. అలాగే నగరంలో అనేక ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి.సభలూ సమావేశాలూ జరిగినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాతంత్రహక్కు అమలు జరుగుతుంది. ఇది జరగాలి అంటే నగరంలో పబ్లిక్ ఖాళీ స్థలాలు అవసరం. కాని విజయవాడ నగరంలో నగర ప్రజల ప్రజాతంత్రహక్కులను కాపాడవలసిన నగరపాలక సంస్థ,నగరంలో ఉన్న పబ్లిక్ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం ద్వారా నగర ప్రజల ప్రజాతంత్ర హక్కుల అమలుకు అవకాశంలేకుండా చేస్తున్నది.
రాజ్యాంగం ఆర్టికల్19(1)(b) ప్రకారం నగర పౌరులకున్న ప్రాధమిక హక్కు. నగరంలో 59 డివిజన్లు ఉన్నాయి. ప్రజాతంత్రయుతంగా నగరపాలన కోసం ఈ డివిజన్లను రాజ్యాంగ బధ్ధంగా ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్‌లో 15 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.ప్రజలు తాము నివశించే ప్రాంతాలలో తాము ఒకచోట చేరి తమ అవసరాలను గురించి, తాము అనుసరించ వలసిన పధ్ధతులను గురించి చర్చించుకోవాలి. అలాగే నగరంలో అనేక ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి.సభలూ సమావేశాలూ జరిగినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాతంత్రహక్కు అమలు జరుగుతుంది. ఇది జరగాలి అంటే నగరంలో పబ్లిక్ ఖాళీ స్థలాలు అవసరం. కాని విజయవాడ నగరంలో నగర ప్రజల ప్రజాతంత్రహక్కులను కాపాడవలసిన నగరపాలక సంస్థ,నగరంలో ఉన్న పబ్లిక్ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం ద్వారా నగర ప్రజల ప్రజాతంత్ర హక్కుల అమలుకు అవకాశంలేకుండా చేస్తున్నది.
నగరపాలక సంస్థకు సంబంధించినవీ మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించినవీ నగరంలో అనేక స్థలాలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాలను ఆయాశాఖల కార్యకలాపాలకు వాడుకుంటే అభ్యంతరంలేదు. కాని వాటితో ఆయాశాఖలకు అవసరం లేనప్పుడు అవి నగర ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు భిన్నంగా పాత బస్టాండు స్థలాన్ని,కెనాల్ గెస్ట్ హౌస్ స్థలాన్ని ప్రైవేటువారికి అప్పగించారు.ఇప్పుడు కార్పొరేషన్ స్ధలాలుగా ఉన్న బీసెంట్ రోడ్డులో 1000చ.మీ.వైశాల్యంగల అన్సారీ పార్కును బహుళ అంతస్తుల కార్ పార్కింగ్‌కూ,బృందావన్ కాలనీలో ఉన్న 1500చ.మీ.స్థలంలో ఉన్న పాత భవనాలను పడగొట్టి వ్యాపార కాంప్లెక్స్‌కు, భవానీపురంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న 6000 చ.మీ.స్థలాన్ని, అంబేద్కర్ పార్కును, గుణదల కొండమీద ఉన్న 10 ఎకరాల స్థలాన్ని, ఇంద్ర కీలాద్రి పర్వతం మీద ఉన్న 4 ఎకరాల స్ధలాన్ని వినోద వ్యాపారానికీ ఇవ్వబోతున్నారు.ఇలా ఖాళీ స్థలాలన్నీ ప్రైవేటు వారి వ్యాపారాలకు ఇచ్చుకుంటూపోతే,నగరంలో ప్రజాతంత్రయుతంగా సభలూ సమావేశాలూ జరుపుకోవడానికి మీరు ఎక్కడ స్థలాలు చూపిస్తారని ప్రశ్నిస్తున్నాము.
అదేవిధంగా నగరంలో ఉన్న స్వరాజ్యమైదానంలో సభలు జరుపుకోవాలంటే రోజుకు రు.50,000లు చెల్లించాలి.జింఖానా మైదానంలో సభలు జరుపుకోవాలన్నా వేలాది రూపాయలు చెల్లించాల్సిందే.నగర ప్రజలు తమతమ ప్రాంతాలలో ఉన్న మున్సిపల్ పాఠశాలల ఆవరణలలో సమావేశాలు జరపాలన్నా, వేలాది రూపాయలు చెల్లించాలి. నగరంలో ఉన్న అన్ని మున్సిపల్ కళ్యాణ మంటపాలను ప్రైవేటువారికి ఇచ్చారు.ఇప్పుడు అక్కడ కూడా సమావేశాలు జరుపుకోవాలంటే వేలాది రూపాయలు చెల్లించాలి.వేలాది రూపాయలు చెల్లించగలిగిన వారికే ప్రజాతంత్ర హక్కు తప్ప,వేలాది రూపాయలు చెల్లించలేని వారికి ప్రజాతంత్ర హక్కు ఈ నగరంలో నిరాకరించబడుతున్నదన్న విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము.అందువలన సభలూ సమావేశాలు జరుపుకోవటం అనే ప్రజాతంత్ర హక్కు అమలు కోసం నగర ప్రజలకు ప్రతి డివిజన్‌లోనూ పబ్లిక్ స్థలం అవసరం అని స్పష్టం చేస్తున్నాము.
2. పిల్లలకు క్రీడా స్ధలాల అవసరం
ఖాళీ స్థలాలు కేవలం సభలు, సమావేశాలు జరుపుకోవటం కోసమేకాదు. అవి నగరంలోని బాలబాలికలకు అవసరం. పిల్లలు సాయంసమయాలలో, ఖాళీ సమయాలలో ఖచ్చితంగా ఆటలు ఆడుకోవాలి. ఆటలు ఆడటం ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల బాగా ఉంటుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆచరణలో కూడా అది తరతరాలుగా ఋజువవుతున్నది. విద్య ప్రైవేటీకరణ జరిగిన నేపథ్యంలో పాఠశాలలలో క్రీడాస్థలాలు లేవు. గతంలో పాఠశాలలను ఏర్పాటు చేసేటప్పుడు విధిగా క్రీడా స్థలం ఉండే విధంగా చూసేవారు. ఇప్పుడది పోయింది. ఏవిధమైన క్రీడా స్థలాలు లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. అపార్టుమెంట్లలో క్లాసులు నడిపేస్తున్నారు,పిల్లలకు క్లాసు రూములు జైలు గదులలాగా తయారయ్యాయి.అందువలన వారు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే క్రీడలు అవసరం. దానికోసం వారివారి నివాస ప్రాంతాలలో క్రీడాస్థలాలు అవసరం. నగరంలో ఎక్కడో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, నగరంలోని పిల్లల రోజువారీ క్రీడావసరాలను తీర్చలేవు. నగరంలోని అన్ని ప్రాంతాలలోని పిల్లలు వారి నివాసానికి దూరంగా ఉన్న ఈ స్టేడియాలకు ప్రతి రోజూ వచ్చి అడుకోవడం సాధ్యపడదు. కనుక వారి నివాస ప్రాంతాలలోనే క్రీడాస్థలాలు కావాలి. దానికి నగరంలో ప్రతి డివిజన్‌లో ఖాళీ స్థలం ఉండాలి. నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను ప్రైవేటు సంస్థల వ్యాపార అవసరాలకు ఇస్తే నగరంలోని పిల్లల క్రీడావసరాలు ఎలా తీరతాయని ప్రశ్నిస్తున్నాము.
ఈవిషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను మీముందుంచుతున్నాము.
డిమాండ్లు:
01. మీ కార్యాలయం06.12.2010 తేదీన విడుదలన చేసినNo.AC(P)-162611/2010 నంబరుగల లేఖను ఉపసంహరించుకోవాలి.తద్వారా కార్పొరేషన్ స్థలాలను వ్యాపారసంస్థలకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలి.
02. ఉచితంగా సభలు, సమావేశాలు జరుపుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికీ నగరంలోని ప్రతి డివిజన్‌లో విధిగా కనీసం 2000 చ.మీ.ఖాళీ స్థలం అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేయాలి.
03. గవర్నర్ పేటలో కనీసం నగర ప్రజలు సమావేశమవటానికి కనీసవసతి లేదు. అందువలన అన్సారీ పార్కు స్థలంలో కార్ల కోసం కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న ఆలోచన విరమించుకొని అది ఒక సమావేశ స్ధలంగా ఏర్పాటు చేయాలి.
04. విజయవాడనగరంలో పెద్దపెద్ద బహిరంగ సభలు జరుపుకోవటానికి స్వరాజ్య మైదానం అవసరం. ఇది ఇరిగేషన్ శాఖకు చెందినది.ఇది విజయవాడ నగరానికి అవసరమైనందువలన నగరపాలక సంస్థకు అప్పగించేవిధంగా గాని, లేదా బహిరంగ సభలకు ఉచితంగా ఇచ్చేవిధంగానైనా ప్రభుత్వంతో మాట్లాడాలి.
05. జింఖానా గ్రౌండును బహిరంగ సభలకు ఉచితంగా ఇవ్వాలి.
అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment