Tuesday, 26 November 2019

Agitation demanding Durable Roads, Storm Water Drainage, Foot paths etc.. on 25.11.2019











ప్రచురణార్ధం:                                                                                               తేదీ:25.11.2019

ఆధునిక టెక్నాలజీతో దీర్ఘకాలం మన్నే రోడ్లు నిర్మించాలని, నడవటానికి వీలుగా ఉండే ఫుట్‌ పాత్‌లను నిర్మించాలని, ఆధునిక టెక్నాలజీతో మాన్‌¬ల్స్‌ నిర్మించాలని మూతలు రోడ్డు లెవెల్‌కు బిగించాలని. ఫుట్‌ పాత్‌ అంచున(రోడ్డువైపు) స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు నిర్మించాలని, వర్షపు నీరు డ్రైను లోకి పోవటానికి అక్కడక్కడ ఉక్కు జాలీలను బిగించి, మిగతా డ్రైన్‌ మొత్తం చెత్త పడకుండా సిమెంట్‌ బిళ్లలతో మూసి వేయాలని, ప్రస్తుతం ఉన్న స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లలో పూడికలు తీయాలని. నగరంలో విద్యుత్‌ వైర్లు అన్నీ అండర్‌ గ్రౌండ్‌కు మార్చాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌ వద్ద ఈ డిమాండ్లతో కూడిన ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. స్థానిక శాసనమండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విజయవాడ నగరం రాజధాని ప్రాంతంగా ఉన్నప్పటికీ నగరంలోని మౌలిక సదుపాయాలు అందుకు తగినట్లుగా లేవని అన్నారు. విజయవాడ నగర సమస్యలపై జరిగే ఆంధోళనలకు పి.డి.ఎఫ్‌. ఎంఎల్‌సిలుగా తాము మద్దత్తునిస్తామని, ఈ సమస్యలను శాసనమండలిలో లేవనెత్తుతామని అన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు వి. సాంబిరెడ్డి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిందని, ఫుట్‌పాత్‌లు లేక పోవటంతో ప్రజలు రోడ్డు మీద వాహనాల మధ్య నడవవలసి వస్తుందని, ఇది చాల ప్రమాదకరమని అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి యం.వి. ఆంజనేయులు మాట్లాడుతూ, నగరంలో రోడ్లు గోతుల మయంగా తయారయ్యాయని, వర్షంవస్తే జలాశయాలుగా మారుతున్నాయని అన్నారు.రోడ్డుమీద గోతులలో వాహనదారులు పడిపోయి ఆసుపత్రిపాలవుతున్నారని, వాహనాలు దెబ్బతింటున్నాయని అన్నారు మాన్‌ ¬ల్స్‌ పగిలిపోయి పొంగి డ్రైనేజి వాటర్‌ రోడ్లమీదకు వస్తున్నాయని, మాన్‌ ¬ల్స్‌ రోడ్డు లెవెల్లోలేకుండా ఎత్తుగానో పల్లంగానో ఉండి ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారయింది తగినన్ని పార్కింగ్‌ సౌకర్యాలు లేవని, రోడ్డు డిమార్కేషన్‌, సరైన సిగ్నలింగ్‌ వ్యవస్థ లేదని అన్నారు. మోతుకూరి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆధునిక పధ్ధతులలో ట్రాఫిక్‌ సౌకర్యాలు కల్పించకుండా పోలీసు యంత్రాంగం పెనాలిటీలు విధించటం సరికాదన్నారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ వి.ఎస్‌ రామరాజు, ఎ. భవానీ ప్రసాద్‌, యేసుబాబు, వి.సత్యన్నారాయణ, జె.వి.రెడ్డి, టి. వెంకటేశ్వర్లు, గుప్త, తదితరులు పాల్గొన్నారు.


(వి.సాంబిరెడ్డి)                    (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                   కార్యదర్శి


No comments:

Post a Comment