Friday, 8 April 2011

2011-2012 రాష్ట్ర బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం కేటాయింపులు జరపాలని కోరుతూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖ

                                                                           తేదీ:18.01.2011

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి,

ఆర్యా!
విషయం:- 2011-2012 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సులప్రకారం కేటాయింపులు జరపాలని కోరుతూ......

    వచ్చే ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 2011-2012 ఆర్ధిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టబోతున్నది. ఈ సందర్భంగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా ఈ క్రింది విషయాలను మీదృష్టికి తెస్తున్నాము.

    కేంద్ర గ్రాంటులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో (అనగా పన్ను మరియు పన్నేతర ఆదాయాల మొత్తంలో) 39.24% స్థానిక సంస్థలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సు చేసింది.మొదటి ఫైనాన్స్‌
కమీషన్‌ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.అయితే ఈ సిఫార్సులకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు జరపటం లేదని ఈ క్రింది గణాంకాలు పరిశీలిస్తే అర్ధమౌతుంది.

సం||             రాష్ట్ర ప్రభుత్వ    మొదటి ఫైనాన్స్‌కమీషన్‌         స్థానిక సంస్థలకు    రాష్ట్ర ప్రభుత్వ సొంత  
                     
సొంత               సిఫార్సుల ప్రకారం స్థానిక    వాస్తవంగా             ఆదాయంలో
                      ఆదాయం        సంస్థలకు కేటాయించ         కేటాయించినది      వాస్తవ  కేటాయింపుల    
                                               వలసినది(39.24%)        (గ్రామాలకు,                శాతం
                                                                                  పట్టణాలకు కలిపి
                                                             కేటాయించినది)                     
                       (కోట్ల రు||లలో)        (కోట్ల రు||లలో)          (కోట్ల రు||లలో) 


2005-2006  23898.77           9377.88         3355.94          14.04%

2006-2007  30414.05         11934.47         4545.82          14.95%   

2007-2008  35858.18         14070.75         5881.53          16.40%   

2008-2009  43041.69         16889.56         9856.64          22.90%   

2009-2010  53610.00(RE)   21036.56         8655.16          16.14%   

2010-2011  62701.80(BE)   24604.19        11069.21         17.65%   

    రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారన్న విషయం మీకు తెలియనిదికాదు. స్థానిక అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి లేదు. స్థానిక అభివృద్ధి అంటే ప్రజల నివాస ప్రాంతాలలో జరిగే అభివృధ్ధి. ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో నివశిస్తుంటారు. గ్రామాలలో, పట్టణాలలో అభివృధ్ధి జరగాలంటే స్థానిక సంస్థలకు తగినన్ని నిధులు కేటాయించాలి. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొనే స్థానిక సంస్థలకు 39.24%కేటాయించాలని, అలా కేటాయించిన మొత్తంలో 70% గ్రామాలకు, 30% పట్టణాలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సు చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14 నుండి 18 శాతం మాత్రమే కేటాయిస్తున్నది. స్థానికంగా వసూలైన వృత్తి పన్నులో 95 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలి. మోటార్‌ వెహికిల్‌ టాక్స్‌లో 10 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.వాటినీ ఇవ్వటం లేదు. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం షరతులకనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గించడం వలన స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వచ్చే వాటా లేకుండా పోయింది. దీనితో స్థానిక సంస్థలు నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో పడి పోతున్నాయి.

    ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, 2011-2012 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు 39.24 శాతం కేటాయించాలనీ, వృత్తిపన్నులో 95 శాతం, మోటార్‌ వెహికిల్‌ టాక్స్‌లో 10 శాతం స్థానిక సంస్థలకు గత బకాయిలతో సహా విడుదల చేయాలని కోరుతున్నాము.

                                   అభివందనాలతో                                       

      వి. సాంబిరెడ్డి                                   యం.వి.ఆంజనేయులు
         అధ్యక్షులు                                               కార్యదర్శి


No comments:

Post a Comment