Sunday, 15 August 2010

Worl Bank Loan to Andhra Pradesh- Its Impact

ఆంధ్రప్రదేశ్‌ పై ప్రపంచబ్యాంకుకు అంత ప్రేమెందుకో?


2010-2011 ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం= రు9841.5 కోట్లు.
దీనిలో
01.ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.
పురపాలక సంస్థలలో సంస్కరణల అమలుకు ఇచ్చిన ఋణం = రు 1350 కోట్లు
రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన ఋణం                                 = రు1440 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు ఇచ్చిన ఋణం                              = రు  675 కోట్లు
నాగార్జున సాగర్‌ ఆధునికీకరణకు ఇస్తున్న ఋణం                = రు 2025 కోట్లు
                                                     మొత్తం ఋణం        = రు 5490 కోట్లు
ఇతర రాష్ట్రాలకు కేటాయించినది.

02. ముంబయి అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు కోసం కేటాయించింది             = రు 1935.0 కోట్లు
03. తమిళనాడు రోడ్‌ సెక్టారుకు, ఆరోగ్య రంగానికి కేటాయించింది = రు 755.5 కోట్లు
04. కర్ణాటక ఆర్‌.డబ్ల్యు.యస్‌ పథ కానికి కేటాయించింది             = రు 675.0 కోట్లు
05. రాజస్థాన్‌ వాటర్‌ సెక్టార్‌కు కేటాయించింది                           = రు   86.0 కోట్లు
06. బెంగాల్‌ పంచాయతీ రాజ్‌ సంస్థల కోసం కేటాయించింది      = రు  900.0 కోట్లు
                        ఇతర రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇస్తున్నఋణం       =రు4351.5 కోట్లు

పై కేటాయింపులను పరిశీలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో 56శాతం ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌కే కేటాయించింది. అది కూడా విషమ షరతులతో.మున్సిపాలిటీలు చేసే ప్రతిపనికీ రేటుకట్టి వసూలు చేయాలని,నాగార్జున సాగర్‌ కాలువకు నీటి మీటర్లు పెట్టి రైతులకు ఇచ్చే ప్రతి నీటిచుక్కకు రేటుకట్టి వసూలు చేయాలని ప్రపంచబ్యాంకు విధించిన షరతులకు మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఈ ఋణం తెచ్చింది.పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు షరతులు లేని ప్రాజెక్టు లోను తెచ్చుకుంటే,మనరాష్ట్రం మాత్రం ప్రజావ్యతిరేక షరతులతో కూడిన ఋణం తెచ్చింది.దీని దుష్ప్రభావాలు మనరాష్ట్రంలోని పట్టణ ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు.పట్టణాలలో నీటి మీటర్లుపెట్టడం,చెత్త ఎత్తివేయటానికి పన్ను వసూలు చేయటం,పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఎత్తివేయటం,రిజిష్ట్రేషన్‌విలువను తగ్గించి ,భూములవిలువలు పెంచటం లాంటివన్ని ఈ ఫరతులలో భాగమే. ఈ దుష్ప్రభావాలను ఇప్పుడు పట్టణ ప్రజలతో బాటుగా రైతులు కూడా అనుభవించబోతున్నారు. షరతులను ఎదుర్కొనకపోతే మనరాష్ట్ర ప్రజలకు విముక్తి లేదు.

ఇది కాక మన కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు వద్ద మరో 31855.5కోట్లు ఋణం తీసుకున్నది.దీనితో కలిపి 2010-2011లో మన దేశం తీసుకున్న మొత్తం ఋణం రు41,697కోట్లు అయింది.ప్రజావ్యతిరేక షరతులకు అంగీకరించి అసలీ ఋణంతీసుకోవలసిన అవసరం ఉందా అంటే లేదు.ఈ సంవత్సరంతో కూడా కలుపుకొని గత 4సంవత్సరాలలో స్వదేశీ,విదేశీ గుత్తసంస్థలకు ఇచ్చిన రాయితీల మూలంగా క్రేంద్ర ఖజానాకు 17 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాలే దీనికి ఆధారం. ఒకవైపు ఈ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలిస్తూ, మరోవైపు ప్రజలమీద భారాలు మోపే విషమ షరతులకు అంగీకరించి అప్పుల మీద అప్పులు తెస్తున్నారు.ఈ అప్పులను మళీ మనవేు తీర్చాలి.ఈ అప్పులతో,ప్రైవేటీకరణలతో భారత ప్రజల బ్రతుకులు పరాధీనమౌతున్నాయి.ఈ విధానాలు మారితేనే ఈ దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది.ఈ విధానాల మార్పుకోసం పోరాడటమే   మన కర్తవ్యం.


No comments:

Post a Comment