గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గారికి,
ఆర్యా!
విషయం:- నగరంలో రోడ్ల వెడల్పుకు సంబంధించి.........
విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేటందుకు రోడ్ల విస్తరణకు తగిన చర్యలు చేపట్టాలని మీరు అధికారులను ఆదేశించినట్లుగా పత్రికలలో చూచాము. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీదృష్టికి తెస్తున్నాము.
01. ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి రోడ్ల విస్తరణ ఒక్కటే మార్గంగా కార్పొరేషన్ ఎంచుకుంటున్నది. ఇది సరికాదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా వేుము అభిప్రాయపడుతున్నాము. ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. వీటిని గురించి కార్పొరేషన్ పట్టించుకోవటం లేదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్యాయాలను గురించి ఆలోచించాలని కోరుతున్నాము.
02.సాధారణంగా రోజువారి ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి కార్పొరేషన్ అధికారులు పోలీస్ యంత్రాంగం కూర్చొని తగిన చర్యలు చేపట్టవచ్చు. కాని ట్రాఫిక్ రద్దీ సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకునే చర్యలు నగరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి రోడ్లు వెడల్పు చేయడం, దానికై స్థలసేకరణ జరపడం అన్నవి విధానపరమైన నిర్ణయాలు. రోడ్ల విస్తరణకై సేకరించే స్థలం కేవలం ప్రభుత్వ భూమి మాత్రవేు కాదు. అందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. భవనాలు ఉన్నాయి. భవనాలను కూలగొట్టి పట్టాభూములను లాగేసుకోవడం అనేది విధానపరమైన చర్య. నగరం మొత్తంమీద ప్రభావంచూపే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నగరంలో చర్చ జరగాలి. అది జరగటం లేదు. కేవలం కార్పొరేషన్ అధికార యంత్రాంగం అనుకున్న విషయాలను అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నారుతప్ప, నగరంలో ప్రజలకు ఎలా సౌకర్యంగా ఉంటుంది, నగర ప్రజలు తమకేం కావాలని అభిప్రాయపడుతున్నారో తెలుసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు జరగటం లేదు. ఇది అనేక సందర్భాలలో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నది. నగరపాలక సంస్థకుకూడా నష్టం వాటిల్లుతున్నది. అందువలన ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ అపార్టుమెంట్ల అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్, వర్తక వాణిజ్య అసోసియేషన్లు, ఛిల్డ్రన్ స్కూల్స్ అసోసియేషన్లు, మోటారు ట్రాన్స్ పోర్టు ప్రతినిధులు, మహిాళా సంఘాలు, వివిధ ట్రేడ్‌యూనియన్‌లతో సంయుక్తంగా చర్చ జరిపి వచ్చిన అభిప్రాయానికనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.
03. ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణంపై 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హాలులో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, మాజీవేుయర్ శ్రీ జంధ్యాల శంకర్, ఆ పరిసర ప్రాంతాల నివాసులు, పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు, ఛిల్డ్రన్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు, మోటారు ట్రాన్స్ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రప్రభుత్వానికి లేఖ వ్రాశాము. ఆలేఖ కాపీ తమ పరిశీలనార్ధం దీనితో జతచేసి పంపుతున్నాము.
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్యాయాలను పరిశీలించాలని, ప్రత్యామ్నాయాలతో బాటుగా పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో చర్చలు జరిపిన అనంతరం మాత్రమే రోడ్ల వెడల్పు లాంటి తదుపరి చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాతో
(వి. సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment