తేదీ: 24.08.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ గారికి,
ఆర్యా!
విషయం:- నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ జీ.వో. ఆర్.టి. నెం.973 కు సంబంధించి.........
విజయవాడ నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ విజయవాడ నగర కౌన్సిల్ 6.8.2009 న ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 21.8.2010 న జీ.వో. ఆర్.టి. నెం.973 ను విడుదల చేసింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని 17.9.2009 న కమీషనర్ లెటరు వ్రాశారని, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీ సంజాయిషీ కోరగా మీరు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, అనేక మంది కార్పొరేటర్లు,అదేవిధంగా విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా మీరు సమాధానం పంపారని ఆ జీ.వో లో పేర్కొన్నారు.దానిని ఆధారం చేసుకొని నగర పాలక సంస్ధ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను వినియోగించి రద్దు చేసింది. మీరు పంపిన ఈ లెటర్ పూర్తిగా అప్రజాస్వామికమని, నగర ప్రజల అభిప్రాయానికి విరుధ్ధమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా మీదృష్టికి తీసుకు వస్తున్నాము.
జీ.వో. ఆర్.టి. నెం.973 లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
" And Where as, in the letter 7th read above, the Mayor, Vijayawada Municipal Corporation has reported that .....................All Under Ground Drainage works will be finished by December 2010 as revealed during reveiw meetings conducted with Vijayawada Municipal Corporation Officers. Most of the Corporators are of the opinion that the proposed levey of user charges under Solid Waste Management may be taken up only after total completion of Under Ground Drainage Works. The Citizens of Vijayawada City are also expressing the same opinion that it will be apt only to levy such user charges after completion of the Under Ground Drainage and providing other amenities."
నగరపాలక సంస్థలో నిర్ణయాలు చేయటానికి కౌన్సిల్ ప్రజాస్వామ్య వేదిక. ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయం తీర్మానమవుతుంది. నగరంలో ఇప్పటికే అనేక పన్నులు విధిస్తున్నందున చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.మాదృష్టికి వచ్చినంతవరకు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, ఏ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ తీర్మానించలేదు. కౌన్సిల్‌లో తీర్మానం చేయకుండా డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వ్రాశారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా మేమేనాడు ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం మీరు నగరంలోని అపార్టుమెంట్ అసోసియేషన్ల సమావేశాలుగాని,కాలనీల అసోసియేషన్ల సమావేశాలుగాని,ఉద్యోగ కార్మిక సంఘాల సమావేశాలుగాని,వర్తక వాణిజ్యవర్గాల సమావేశాలుగాని నిర్వహించలేదు. పైగా ఈ ప్రతిపాదన కౌన్సిల్ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్ నిర్వహించారు.70వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓటుచేశారు.ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకుండా,ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా,యు.జి.డి.పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం ఆశ్ఛర్యంగా ఉంది.ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని మీదృష్టికి తెస్తున్నాము.
దీనితో బాటుగా జీ.వోలో ఉన్న మరోక విషయాన్ని కూడా మీదృష్టికి తెస్తున్నాము. జీ.వోలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పేర్కొంది.
" Such action of the Council rejecting the office proposals involving financial matters will not only worsen the financial situation but also leave a massage that no service charges will be leveid for any service of Vijayawada Municipal Corporation and is contrary to the spirit of reforms undertaken by the Vijayawada Municipal Corporation"
ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే భావిస్తున్నాము. నగర పాలక సంస్థ కౌన్సిల్‌లో ఉన్న వాళు నగరపాలక సంస్థ ఆర్ధిక పరిస్థితి గమనించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ జీ.వోను ఇచ్చినట్లుగా ఉన్నది. అంతే కాకుండా కార్పొరేషన్ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్ చేసే ఏపనికి మరల చార్జీలు విధించరాదనే కోరుకుంటున్నారు. ఇది తప్పు కాదు. ఇది నగర ప్రజల సమంజసమైన కోరిక. ఒకవైపు పన్నులు వసూలు చేస్తూనే మరొకవైపు ప్రతిపనికి మరల యూజర్ చార్జీలు, సర్వీస్ చార్జీలు, ఫీజుల పేరుతో వసూలు చేస్తామని అటు కార్పొరేషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఆచరణకూడా ప్రారంభించాయి. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం తాము చెల్లిస్తున్న పన్నులనుండి మా నగర అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరని,మామీద మరలా ఎందుకు భారాలు మోపుతున్నారని నగర ప్రజలు ప్రశ్నిస్తే నగర ప్రజలకు సపమాధానం చెప్పవలసిన బాధ్యత కార్పొరేషన్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, ప్రజల మీద చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదు.
ఇక చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్ కార్పొ రేషన్ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కోన్నారు. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటవేు సంస్కరణల స్పూర్తి అయితే, ఆసంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని స్పష్టం చేస్తున్నాము. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం,ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటవేు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం. దీనిని టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా వేుము తిరస్కరిస్తున్నాము.
ఇప్పటికైనా కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్.టి. నెం.973 ను రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాతో
యం.వి.ఆంజనేయులు
కార్యదర్శి
No comments:
Post a Comment