నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చండి
స్థానిక సంస్థలకు ప్రపంచ బ్యాంకు హుకుం
కేంద్రప్రభుత్వందేశంలో63నగరాలు,పట్టణాల్లోచేపట్టినజవహర్‌లాల్‌నెహ్రూపట్టణపునర్నిర్మాణపథకం(జె.ఎన్.ఎన్. యు.ఆర్.ఎం) కు ప్రపంచబ్యాంకు నుంచి 60వేల కోట్ల రుణం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ-2 ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచబ్యాంకు మొదటి విడతగా వందకోట్ల డాలర్ల రుణం ఇస్తుంది.
ప్రస్తుతం అమలులో ఉన్నజెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కాలపరిమితి మరో రెండేళ్ళలో ముగియనుంది.2005డిసెంబర్ నుండి ఇప్పటి వరకు దీని కింద దేశంలో 63నగరాల్లో రు.1.20లక్షల విలువగల ప్రాజెక్టులను ఆమోదించారు. జెఎన్‌యుఆర్‌ఎంకు కేటాయించిన నిధులు అయిపోయాయి కాబట్టి ప్రపంచబ్యాంకు రుణం అవసర మయిందని కేంద్రం చెబుతోంది.
ప్రపంచబ్యాంకు రుణంతో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం 'ప్లస్'అనే పేరుతో ఈ పథకాన్ని ఇకనుండి నడపబోతున్నారు. ఇది రెండోదశ. రుణం ఇచ్చే ముందు ఇప్పటివరకు పథకం అమలు తీరు, సంస్కరణలు, బడ్జెట్‌లు, అకౌంట్సు, ఆడిట్స్, ఇ-గవర్నెన్స్, పన్నుల వసూళ్ళు,ప్రైవేటీకరణ అమలు వివిధరంగాల్లో ఎలా ఉన్నది తదితర అంశాలను ప్రపంచబ్యాంకు బృందం సమీక్షిస్తోంది.దేశంలో పూర్తి స్థాయిలో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ప్రాజెక్టులు, సంస్కరణలు చేపట్టిన 23 నగరాలను అది పరిశీలిస్తున్నది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలోని విశాఖ, హైదరాబాద్ నగరాల్లో ఈ బృందం ఇటీవలే పర్యటించింది.ఇప్పటికే చేపట్టిన పనులు,సంస్కరణల అమలు తీరు గురించి అడిగి తెలుసుకుంది.వివిధ శాఖల పనితీరు,వాటిల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎలా ఉందో కూడా పరిశీలించింది. షరతులతో కూడిన రుణాలను తరువాత మంజూరు చేస్తుంది.
రాష్ట్రంలో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం పథకం కింద ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలు ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించాయి. విశాఖ నగరపాలక సంస్థ6,700కోట్లు,విజయవాడ నగరపాలక సంస్థ 3,300 కోట్లు, హైదరాబాద్ నగరపాలక సంస్థ 9వేల కోట్లతో ఇందుకు సంబంధించిన సవివరమైన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి.
జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం అమలు తీరును ఒకసారి పరిశీలిద్దాం.వీటి నిధులతో పట్టణాలు,నగరాల్లో మౌలిక సదుపాయాలను బ్రహ్మాండంగా మెరుగుపరచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.మురికివాడల అభివృద్ధి,మాలిక వసతుల కల్పన, ఇల్లులేని పేదలకు ఇల్లు కల్పిస్తున్నట్లు ఊదరగొడుతున్నది.ఆఖరికి ప్రధానమంత్రి కూడా జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం నిధులతో దేశంలోని ఉన్న నగరాలు వరల్డ్‌క్లాస్ సిటీలుగా మారబోతున్నాయని చెబుతు న్నారు.ఇక స్థానిక అధికార పార్టీ నాయకులు ఈ పథకం ద్వారా నిధులు వరదలా వచ్చేస్తున్నాయని చెప్పని రోజంటూ లేదు.గడచిన 5ఏళ్ళలో ఈ పథకం ద్వారా మంజూరైన వివిధ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తే ఈ ప్రచారానికి, క్షేత్రస్థాయిలో భౌతిక వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు.
2005 నుండి 2010 జూన్ నాటికి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం పథకంలో మౌలికసదుపాయాల మిషన్ కింద 58,029 కోట్లు విలువగలిగిన 515ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అలాగే పట్టణపేదల ప్రాథమిక సేవలు (బి.ఎస్.యు.పి), సమీకృత మురికి వాడల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ పథకం (ఐ.హెచ్.ఎస్.బి.పి) రెండింటి కింద 35,088 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ఆమోదించారు.వీటిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కిింద (పిపిపి)15శాతం నిధులతో 68 ప్రాజెక్టులు చేపట్టారు.
ఈ అయిదేళ్ళలో బి.ఎస్.యు.పి.,ఐ.హెచ్.ఎస్.డి.పి కింద కింద 15లక్షల 25వేల ఇళ్ళు మంజూరు చేయగా వీటిలో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించినది 7లక్షల85వేల ఇళ్లు మాత్రమే.ఇప్పటివరకు వాటిలో సగం కూడా పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలు కూడా నగరాలకు సూదూర ప్రాంతాల్లో చేపట్టడం వల్ల పేదలకు అంతగా ఉపయోగం లేకుండా పోతున్నాయి.విశాఖపట్నంలో లక్షా35వేలు, విజయవాడలో లక్షా 20వేలు,హైదరాబాద్‌లో 3.5లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. నిర్మిస్తున్న ఇళ్లను సర్వే ద్వారా గుర్తించిన వారికి ఇవ్వడానికి బదులు ఇప్పటికే రైల్వే, ఇతరప్రభుత్వ స్థలాల్లోనూ, కొండలమీద, కాలువగట్ల పక్కన, గెడ్డల పక్కన ఉన్న ఇళ్ళను కూల్చి వారికి కేటాయిస్తున్నారు. బి.ఆర్.టి.యస్ రోడ్ల వెడల్పు వల్ల ఇళ్లు, షాపులు, స్థలాలు కోల్పోయిన వారికి కూడా వీటినే కట్టబెడుతున్నారు. ఇల్లులేని పట్టణ పేదలకు జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం లో స్థానమే లేకుండాపోయింది.
ఈ పథకం ఎవరి ప్రయోజనాల కోసమో తెలుసుకునేందుకు ఒక చిన్న ఉదాహరణ. ఆర్థ్ధిక సంక్షోభం వల్ల దేశంలోని ఆటో, మోటారు కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం వాటికి ప్రత్యేక ఆర్థ్ధిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకుగాను జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం 15 వేల బస్సులు కొనుగోలు చేస్తామని అశోక్, టాటా, స్వరాజ్,ఇచ్చార్, మహేంద్ర అండ్ మహేంద్ర, హిందుస్థాన్ మోటార్ సంస్థలకి హామీ ఇచ్చింది.ఇందుకోసం సుమారు రు.25వేలకోట్లు ఖర్చు చేస్తున్నది.ఇప్పటికే దేశంలో ప్రధాన నగారాల్లో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం సింబల్‌తో బస్సులు వచ్చాయి.ఈ అయిదేళ్లలో 63నగరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు విడుదల చేసింది ఎంతో తెలుసా?జూన్ నాటికి 20,121కోట్లు మాత్రమే.దీనిని బట్టి ఈ పథకం అసలు ఉద్దేశమేమిటో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.ఈ పథకం ద్వారా ఇచ్చే నిధులు సంస్కరణలతో ముడిపడినవి.గడచిన అయిదేళ్ళల్లో రాష్ట్ర,నగర స్థాయిల్లో కొన్ని సంస్కరణలు చేపట్టారు.1978లో రూపొందించిన పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని రద్దుచేశారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో భూ కేంద్రీకరణ పెరిగిపోయింది.దీనికి అనుబంధంగానే స్టాంప్‌డ్యూటీని 12శాతం నుండి 8శాతానికి తగ్గించారు. వాస్తవంగా 5శాతానికి తగ్గించాలని షరతు. కొన్ని రాష్ట్రాలు 5 శాతానికి తగ్గించాయి. దీనివల్ల నగరపాలక సంస్థలకు స్టాంపుడ్యూటీ ద్వారా వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడింది.ఆస్తిపన్ను మదింపు పద్ధ్దతి విస్తీర్ణాన్ని బట్టి కాక ''యూనిట్ విలువ''ఆధారంగా విధించే పద్ధ్దతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నది.దీని అమలు నివేదికకై ఇప్పటికే హైదరాబద్‌లోని ఆర్థ్ధిక -సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్)కి బాధ్యత అప్పజెప్పింది.
ప్రపంచబ్యాంకు షరతుల అమల్లో భాగంగానే ఇంటిపన్ను,నీటిచార్జీలను పెంచారు.అనేక నగరాల్లో కొళాయిలకు మీటర్లు బిగించారు. వీధి కొళాయిలు తొలగిస్తున్నారు. ''డస్ట్‌బిన్ ఫ్రీ సిటీ'' పేర డస్ట్‌బిన్‌లను తొలగిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకెళ్ళినందుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. పారిశుధ్య రంగాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారు. భూగర్భ డ్రైనేజీకి యూజర్ చార్జీల వసూలు ప్రారంభించారు. నగరాలను పార్కింగ్ ఫీజులమయం చేశారు. బి.ఆర్.టి.యస్ రోడ్లు పూర్తయితే యూజర్ చార్జీలు ప్రవేశపెడతామని ప్రకటించారు.ఇంకా అనేక పన్నులు, యూజర్ చార్జీల విధింపుకు ఉద్యుక్తులౌతున్నారు.మూడవ,నాలుగో విడత నిధుల కోసం ప్రపంచబ్యాంకు షరతుల్ని మరింత జోరుగా అమలు చేయనున్నది.
జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం పథకంవల్ల నగరాల అభివృద్ధి కన్నా అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. పాలక పార్టీలు, అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమ సంపాదనకు రాజమార్గంగా మారింది. ప్రాజెక్టుల వ్యయాన్ని అధికంగా చూపించటం, తమకిష్టమొచ్చిన వారికి ప్రాజెక్టులు అప్పజెప్పటం ఇందులో ప్రత్యేకత.ప్రతిదానికి సర్వేలపేర ప్రైవేట్ సంస్థలకి కాసులవర్షం కురిపిస్తున్నది.ప్రజల అవసరాలకన్నా లాభాలు అధికంగా వచ్చే పనులకే అధిక ప్రాధాన్యత లభిస్తున్నది.
రెండోదశ జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ప్లస్ పథకం కఠినమైన షరతులతో కూడినది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టే పనులన్నీ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)తో చేపట్టాల్సి ఉంటుంది.నీటి సరఫరా,భూగర్భడ్రైనేజీ, బిఆర్‌టిఎస్, ఏదైనప్పటికీ అన్నీ పిపిపి కిందే చేపట్టాలి.రాబోయే ప్రాజెక్టులే కాదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా పిపిపి కిందకి మార్చాలని ప్రపంచబ్యాంకు వత్తిడితెస్తుంది.ప్రస్తుతం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో మంజూరయ్యే ప్రాజెక్టులకు కేంద్రం 50శాతం,రాష్ట్రం 20శాతం మిగిలిన 30శాతం స్థానిక సంస్థలు భరించాలి.ప్రపంచబ్యాంకు స్థానిక సంస్థలు భరించాల్సిన 30శాతం మ్యాచింగ్ గ్రాంటును ప్రైవేట్ సంస్థ్ధల నుండి అంటే పిపిపి ద్వారా భర్తీచేసుకోవాలని సూచిస్తున్నది.ఇది ఒక నిబంధనగా ఇప్పుడు ముందుకు రాబోతున్నది.
ఇప్పుడే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథóకంలో చేపట్టిన ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్స్ సమకూర్చుకోలేక అనేక నగరాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి.విద్యా,ఆరోగ్య,మురికివాడల అభివృద్ధి,పేదల సంక్షేమం వంటి వాటికి నిధులు కేటాయించలేక పోతున్నాయి.విశాఖపట్నం నగరపాలక సంస్థ మ్యాచింగ్ గ్రాంట్ కోసం 100కోట్లు మున్సిపల్ బాండ్లు సేకరించింది.ఇవి ఏ మూలకు రాలేదు.ప్రస్తుతం బ్యాంకుల నుండి 200కోట్ల రుణం తీసుకో వటానికి ఒప్పందాలు చేసుకుంది.విజయవాడ నగరపాలక సంస్థ కూడా 100కోట్ల హడ్కో రుణం కోసం ఆస్తులను తాకట్టుపెట్టింది.హైదరాబాద్ నగరపాలక సంస్థ్ధ కూడా ఇదే దారిలో ఉంది.మొత్తంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం నగరాలను అప్పుల ఊబిలోకి దించింది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టబోయే పనులకు మరిన్ని అప్పులు చేయాల్సివస్తుంది.ప్రపంచబ్యాంకు లక్ష్యమే ఇది.అందుకే ప్రతిప్రాజెక్ట్ వ్యయంలో కనీసంగా 15శాతం అప్పు చెయ్యొచ్చని సలహా ఇచ్చింది.ఈ విధంగా నగరపాలక వ్యవహారాల్లో ప్రపంచబ్యాంకు ప్రత్యక్ష జోక్యం చేసుకో బోతున్నది.ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.పౌర సౌకర్యాలు,సంక్షేమం కుదింపు,సేవలకు వెలకట్టడం, పన్నుల వడ్డింపు,యూజర్‌చార్జీలు,ఫీజుల పెంపు వంటి చర్యలతో ప్రజలపై ఎనలేని భారాన్ని మోపుతాయి.రెండోదశలో ప్రపంచబ్యాంకు రుణంతో అమలు చేయబోతున్న ఈ జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ప్లస్ పథకం నగర, పట్టణ పరిపాలన,తదితర విభాగాలపై ప్రభుత్వ,స్థానిక సంస్థల అజమాయిషీకి బదులు ప్రైవేటు సంస్థల పెత్తనం పెరుగుతుంది.నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశంలో ఆంతర్యమిదే!
No comments:
Post a Comment