విలువైన భూములను బడా వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్న
విజయవాడ నగరపాలక సంస్థ
లక్షల సంఖ్యలో ప్రజలు నివసించే ప్రాంతాన్ని నగరం అంటారని మనకు తెలుసు. లక్షల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నప్పుడు వారు స్వేచ్ఛగా మసలటానికి తగిన ఖాళీ స్థలాలు కావాలి. పిల్లలు ఆడుకోవడానికి, ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రజలు సభలు, సమావేశాలు జరుపుకోవడానికి ఖాళీ స్థలాలు అవసరం. 01 . పిల్లలు సాయం సమయాలలో , ఖాళీ సమయాలాలో ఖచ్చితంగా ఆటలు ఆడుకోవాలి. ఆడటం ద్వారా వారికి శారీరక మానసిక ఎదుగుదల బాగా ఉంటుందని మానసిక శాస్త్ర వేత్తలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆచరణలో కూడా అది రుజువైంది. విద్య ప్రైవేటీకరణ జరిగిన నేపధ్యంలో పాటశాలలలో క్రీడా స్థలాలు లేవు. గతంలో పాటశాలను ఏర్పాటు చేసేటప్పుడు విధిగా క్రీడా స్థలం ఉండే విధంగా చూసే వారు.ఇప్పుడు అది పోయింది.ఏవిధమైన క్రీడా స్థలాలు లేకుండానే పాటశాలలకు అనుమతులిస్తున్నారు.అపార్టుమెంట్లలో అనేక క్లాసులు నడిపేస్తున్నారు.పిల్లకు క్లాసు రూములు జైలు గదులులాగా తయారయ్యాయి.అందువలన వారు ఆడుకోవడానికి వారి నివాస ప్రాంతాలలో క్రీడా స్థలాలు కావాలి.వారికి క్రీడా స్థలాలను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉన్నది. కాని మన విజయవాడ నగరపాలక సంస్థ ఉన్న ఖాళీ స్థలాలను కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది తప్ప పిల్లల మానసిక వికాసాన్ని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. విజయవాడ నగరంలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సామాన్యుల పిల్లలకు అందుబాటులో లేదు.ఫీజులు చెల్లించ గలవారి పిల్లలే ఇందులో ఆడుకోగలరు. స్వరాజ్య మైదానం (పీ.డబ్ల్యు గ్రౌండ్) లో ఎప్పుడూ ఏదో కార్యక్రమాలతో నిండి ఉంటుంది. సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం కొంత మేరకు పిల్లలకు అందుబాటులో ఉన్నది.అదికూడా వామపక్షాలు క్ద్దుకోవడం వలననే ఆమేరకైన పిల్లలకు అందుబాటులో ఉన్నది. 52చ.కి.మీ.కు విస్తరించి ఉన్న నగరంలో ఎక్కడో కొన్ని స్థలాలున్నంత మాత్రాన ప్రతి రోజు పిల్లలు అక్కడకు వెళ్లి ఆడుకోవడం సాధ్యమా? అందుకే క్రీడా స్థలాలు వారి నివాసాలకు దగ్గరలో ఉండాలి. ఇది నగరపాలక సంస్థ బాధ్యత.
No comments:
Post a Comment