తేదీ:29.03.2011
రాష్ట్రంలోని మున్సిపల్ పట్టణాలలో అస్థిపన్నును నిర్ణయించడానికి రాష్ట్రస్థాయి బోర్డును ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీ.వో 107 ను తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. స్థానిక స్వపరిపాలనను నిర్వీర్యం చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్ధానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా పూర్తిగా ఎగగొట్ట్డడం లక్ష్యాలుగా రాష్ట్ర స్థాయి ఆస్థిపన్ను బోర్డును ఏర్పాటు చేస్తున్నారని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
ఈ బోర్డు ఏర్పడితే, విజయవాడ నగరంలో ఆస్థిపన్నును నిర్ణయించే అధికారాన్ని విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ కోల్పోతుంది. విజయవాడ నగరంలో ఎంత ఆస్థి పన్ను వసూలు చేయాలో రాష్ట్ర స్థాయి బోర్డు నిర్ణయిస్తుంది. ఆస్థిపన్ను కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం. స్థానిక సంస్థలకు సంబంధించిన
విషయాన్ని రాష్ట్రస్థాయి బోర్డుకు అప్పగించడమంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమే అవుతుంది. ఇలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం అసెంబ్లీలో చర్చకుకూడా పెట్టలేదు. నేరుగా జీ.వో విడుదల చేసింది. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం 1955 లో ఉన్న 679-ఎ క్లాజును దుర్వినియోగం చేస్తూ జీ.వోలద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల మీద పెత్తనం సాగిస్తున్నది. ఇప్పుడు నేరుగా స్థానిక సంస్థలను ప్రక్కనబెట్టేవిధంగా ఈ ఆస్థిపన్ను బోర్డును ఏర్పాటు చేస్తున్నది. స్థానిక విషయాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి బోర్డులు నిర్ణయిస్తే, ఇక స్థానిక స్వపరిపాలకు అర్ధం ఏమిటని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. మనది ఫెడరల్ వ్యవస్థ. కేంద్రీకృత వ్యవస్థ కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన ఫెడరల్ స్పూర్తికి విరుధ్ధమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
13 వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి రావలసిన రు.664.23 కోట్లు రాష్ట్రానికి రావటం కోసం జీ.వో 88ని. జీ.వో.107లను ఇస్తున్నామని ఆ జీ.వోలలోనే పేర్కొన్నారు. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రు.664.23 కోట్లు తీసుకురావటం కోసం రాష్ట్రంలోని పట్టణ ప్రజలమీద రు. 1000 కోట్లకు పైగా భారాన్ని మోపతలపెట్టారు. రు.664 కోట్లు కోసం ప్రజలపై రు. 1000కోట్ల భారం మోపటం అవసరమాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి నిధులు తెచ్చుకోవటానికి ఏపని చేయటానికైనా వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు ఇవ్వలసిన నిధులను ఎందుకు ఇవ్వదని రాష్ట్ర ప్రభుత్వాన్ని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థిపన్ను బోర్డు ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలని, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం మున్సిపాలిటీలకు ఇవ్వవలసిన నిధులను తక్షణమే ఇవ్వాలని, ఫెడరల్ వ్యవస్థను కాపాడాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
వి. సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

1996 ఆగస్టులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపోందించిన విధాన పత్రంలో మున్సిపాలిటీలకు రాష్ట్ర బడ్జెట్‌లనుండి ఇస్తున్న నిధులను నిలిపివేయాలని, పటణాభివృధ్ధి పథకాలన్నింటినీ వ్యాపారాత్మకంగా మార్చాలని పేర్కొంది. దీనిని అమలు చేయటంలో భాగంగా ముందుగా స్థానిక సంస్థలకు నిధులను ఇవ్వటం బాగా తగ్గించివేశారు. స్థానిక సంస్థలు నిధులు లేక సౌకర్యాలు కల్పించలేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకాన్ని ఎరగా వేశారు. ఆస్థిపన్నును మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రధానమైన ఆదాయ వనరుగా చేయాలని, కార్పొరేషన్ చేసే ప్రతిపనికీ యూజర్ చార్జీలను వసూలు చేయాలనీ జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకంలో షరతులు విధించారు. ఆస్థిపన్ను పెంపుదల మీద ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ ఈనెల 5 వతేదీన జీ.వో 88 ని విడుదల చేశారు. ఇప్పుడు ఆస్థిపన్ను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర స్థాయి బోర్డుకు దఖలు పరచారు.ఆస్థిపన్ను పెంపుదలమీద పరిమితులు లేకుండా చేశారు. ఆస్థిపన్ను నిర్ణయించే అధికారం ప్రజలు ఎన్నుకున్న మున్సిపల్ కౌన్సిళ్ళనుండి తప్పించారు. ఇకమీదట మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి యివ్వదు. మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎంత ఖర్చువుతుందో లెక్కగట్టి, ఆ ఖర్చులకనుగుణంగా ఆస్థిపన్నును రాష్ట్ర స్థాయి బోర్డు పెంచుకుంటూ పోతుంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌కు నిధులివ్వటం నిలిపి వేసిన ఫలితంగా విజయవాడనగరపాలక సంస్థ ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. విజయవాడనగరపాలక సంస్థకున్న ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వటానికి బదులుగా ఆస్థిపన్నులు పెంచటడానికి సిధ్ధపడింది. ఈ అందువలన ఇది ప్రజలను నిలువు దోపిడీ చేయడానికి ఏర్పాటు చేస్తున్న సంస్థ అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
13 వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి రావలసిన రు.664.23 కోట్లు రాష్ట్రానికి రావటం కోసం జీ.వో 88ని. జీ.వో.107లను ఇస్తున్నామని ఆ జీ.వోలలోనే పేర్కొన్నారు. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రు.664.23 కోట్లు తీసుకురావటం కోసం రాష్ట్రంలోని పట్టణ ప్రజలమీద రు. 1000 కోట్లకు పైగా భారాన్ని మోపతలపెట్టారు. రు.664 కోట్లు కోసం ప్రజలపై రు. 1000కోట్ల భారం మోపటం అవసరమాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి నిధులు తెచ్చుకోవటానికి ఏపని చేయటానికైనా వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు ఇవ్వలసిన నిధులను ఎందుకు ఇవ్వదని రాష్ట్ర ప్రభుత్వాన్ని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థిపన్ను బోర్డు ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలని, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం మున్సిపాలిటీలకు ఇవ్వవలసిన నిధులను తక్షణమే ఇవ్వాలని, ఫెడరల్ వ్యవస్థను కాపాడాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
వి. సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment