Sunday, 21 September 2014

21.09.2014 న విజయవాడ కళాకారులు కళా సంస్థలతో జరిగిన కళా సమ్మేళన్‌లో ఆమోదించిన తీర్మానం


విజయవాడ నగరం ఎన్నో కళారూపాలకు నెలవుగా ఉంది. ఎందరో కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు ఈ నగరంలో ఉన్నారు. కాని నేడు విజయవాడ నగరంలో ఔత్సాహికులైన కళాకారులు, కళారూపాలను నేర్చుకోవాలన్నా, ప్రదర్శించాలన్నా హాళ్ళకు వేలాది రూపాయలు చెల్లించవలసివస్తున్నది. మున్సిపల్‌ కళ్యాణ మంటపాలు కూడా ప్రైవేటు వారికి ఇవ్వటంతో అవి కూడా డబ్బు ఉంటే తప్ప అందు బాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా అనేక కళారూపాలు మరుగున పడి పోతున్నాయి. ఏదైనా ఒక కళారూపం నేర్చుకోవాలన్నా, ప్రదర్శించాలన్నా హాలుకు వేలాది రూపాయలు చెల్లించాలి. దీనితో డబ్బు ఉన్న వారే వీటిని ప్రదర్శించగలుగుతున్నారు. కోలాటం, చెక్క భజన, తప్పెట గుళ్లు, తోలు బమ్మలాట, రుంజ వాయిద్యం తదితర జనపద కళారూపాలు మరుగున పడి పోతున్నాయి. వాటిని నేర్పేవారూ కరువవుతున్నారు. నేర్చుకోవాలంటే తగిన అవకాశాలూ లేవు. సంప్రదాయ నృత్యరీతులను ఆధునిక ఇతివృత్తాలతో మేళవించి సుసంపన్నంచేయాలన్నా వాటిని నేర్చుకోవటానికి తగిన అవకాశాలు లేవు. ఆధునిక ఇతివృత్తాలను రూపొందించాలంటే తగిన సాహిత్యవేదికలు నిర్వహించాలి. సాహితీవేత్తల సమ్మేళనాలు జరగాలి. దానికి తగిన సదుపాయాలు అవసరమున్నది. కళా రూపాలు జాతి సంపద. జాతి సృష్టించుకున్నవి. కళారూపాలు నానాటికి అభివృధ్ధి చెందాలే తప్ప నశించకూడదు. కళారూపాలు నశించటం అంటే జాతిలో జీవ కళ నశించడమే అవుతుంది. అందువలన కళాకారులు కళను నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి నగరంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కావాలని ఈ సభ భావిస్తున్నది.

విజయవాడ నగర పరిసర ప్రాంతాలలోనే నూతన రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ నగరం పాలనారాజధానిగా మాత్రమే కాకుండా సాంస్కృతిక రాజధానిగా కూడా ఎదగాలని ఈ సభ కోరుకుంటున్పది. సాంస్కృతిక రాజధానిగా ఎదగాలంటే సాధారణంగా రోజువారీ తమ వృత్తులు చేసుకుంటూనే కళలు నేర్చుకోవటానికి వీలుగా తగిన సౌకర్యాలు ఉండాలి. గతంలో రాజులు, జమీందారులు కళా పోషకులుగా ఉండేవారు.అంటే ఆనాటి పరిపాలకులే కళా పోషకులుగా ఉండేవారు. నేటి ప్రజాతంత్ర దేశంలో ప్రభుత్వాలే కళా పోషకులుగా ఉండాలి. విజయవాడ నగరంలో కళా పోషణ బాధ్యతను మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వీకరించాలని ఈ సభ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కోరుతున్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత నివ్వాలని ఈసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది . కళా పోషణ అనేది ఒక రోజు వ్యవహారం కాదు. అది నిరంతరం జరగాలి. నగరంలో కళను నేర్చుకోవటం పట్ల మక్కువ ఉన్న ప్రతి వ్యక్తికి, నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి అనువైన వాతావరణం కల్పించాలి. కార్పోరేషన్‌ స్థలాలు, కళ్యాణ మంటపాలు ఉచితంగా అందుబాటులో ఉంచాలి. నగరంలోని వివిధ డివిజన్‌లలో ఉన్న కమ్యూనిటీ హాళ్లను ఆయాడివిజన్లలో ఉన్న ఔత్సాహికులైన కళాకారులు కళారూపాలు నేర్చుకోవటానికి ఉచింతంగా అందుబాటులో ఉంచాలని, క్రీడలకు కోచ్‌లను నియమించిన విధంగానే కళలలోని వివిధ విభాగాలను నేర్పే గురువులను ఏర్పాటు చేయాలని ఈ సభ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కోరుతున్నది.

Wednesday, 3 September 2014

విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ శ్రీ కోనేరు శ్రీధర్ గారికి 02.09.2014 తేదీన అంద‌జేసిన మెమొరాండం

గౌరవనీయులైన విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ శ్రీ కోనేరు శ్రీధర్‌ గారికి తేదీ: 02.09.2014
ఆర్యా,
విషయం:- 1. జప్తు నోటీసులు జారీ చేయుటగురించి ...............
2. పెంచిన నీటి చార్జీలను, డ్రేనేజి చార్జీలను తగ్గించాలని కోరుతూ....
01. జప్తు నోటీసులు జారీ చేయుటగురించి
విజయవాడ నగర పాలక సంస్థ 2014 ఏప్రిల్‌నుండి సెప్టెంబరువరకుగల అర్ధసంవత్సరానికి ఇటీవలే ఆస్తిపన్ను నోటీసులను జారీ చేసింది. ఆవెనువెంటనే జప్తు నోటీసులుకూడా జారీ చేస్తున్నది. 1988 నుండి ఆస్తి పన్ను బకాయిలున్న సంస్థలను, వ్యక్తులను వదలిపెట్టి , క్రమంతప్పకుండా ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి జప్తు నోటీసులు జారీ చేయటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము.
చట్టాన్ని ఎవరికైనా ఒకేవిధంగా అమలు జరపాలి. (ుష్ట్రవ జూతీఱఅషఱజూశ్రీవ ఁజునబaశ్రీఱ్‌వ పవటశీతీవ కూaషఁ ఎబర్‌ పవ వఅరబతీవస). అందుకు భిన్నంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వ్యవహరిస్తున్నది. 1988 నుండి అంటే గత 26 ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలున్న సంస్థలను, వ్యక్తులను వదలిపెట్టి , క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి జప్తు నోటీసులు జారీ చేయటం ఁజునబaశ్రీఱ్‌వ పవటశీతీవ కూaషఁ అన్న సూత్రానికి విరుధ్ధమన్న విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము. ఒక వైపు అత్యధికమంది క్రమంతప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు 135 ఎసెస్‌మెంట్లకు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు 14 ఎసెస్‌మెంట్లకు,, రైల్వే సంస్థ 384 ఎసెస్‌మెంట్లకు,, రు|| 10,000లు ఆపైన బకాయి ఉన్న వివిధ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు 902 ఎసెస్‌మెంట్లకు, ఏళ్ళతరబడి ఆస్తిపున్ను చెల్లించకుండా మున్సిపల్‌ కార్సొరేషన్‌కు నష్టాన్ని కలుగ జేస్తున్నారు. కార్పొరేషన్‌కు నష్టాన్ని కలుగ జేస్తున్న వారిని వదలివేసి క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లించేవారికి నోటీసులు జారీ చేయటం అన్యాయం. మీ సత్వర పరిశీలన కోసం 1988 నుండి అంటే గత 26 ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలున్న సంస్థలు, వ్యక్తుల వివరాలను ఇస్తున్నాము.

ముందుగా 1988 నుండి సంవత్సరాలవారీగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిల వివరాలను ఈ దిగువ నిస్తున్నాము.
      సం||      అసెస్‌ మెంట్ల    బకాయి (రు||)
       నుండి     సంఖ్య






1988 26 37855499
1989 3 3495696
1990 1 1047625
1991 2 552520
1992 4 1329289
1993 4 483105
1994 6 1286362
1995 5 2391851
1996 1 567847
1997 2 8722217
1998 4 987356
1999 1 903255
2001 18 76295120
2004 2 436328
2005 3 901803
2006 1 322515
2007 5 3765266
2008 4 1206021
2009 7 9596599
2010 16 11347437
2011 7 668854
2012 12 3554962
2013 15 986605
Total 149 168704132
రైల్వే బకాయి
  సం||    అసెస్‌ మెంట్ల     బకాయి (రు||)
నుండి      సంఖ్య
1988 324 75943141
2009   60 2292124
Total 384 78235265








కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మొత్తం 533 ఎసెస్‌మెంట్ల బకాయి రు|| 24,69,39,397/-.

డిపార్టు మెంట్ల వారీగా చూచినప్పుడు బకాయిలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.

Sicial Welfare Department 8
5210345
Educational Institutions 4
51951517
RTC 1
55386
Govt Offices 20
22160250
R&B 7
1388145
PWD 32
5651208
Police Dept 17
33817163
Irrigation Dept 21
7245794
Health Dept 13
22701470
Fire Dept 2
55963
Electricity Dept 4
1047779
Courts 6
4049367
Total 135
155334387
                                               

                       
Central Govt Offices Property Tax 


defaults to VMC 14
13369745
Railways Property Tax Defaults to VMC 384
78235265

398
91605010
Total






State Govt offices defaults 135
155334387
Central Govt offices 398
91605010
Grand Total 533
246939397

ప్రైవేటు వ్యక్తులుగా, సంస్థలుగా చూచినప్పుడు 1988 నుండి ఉన్న బకాయిలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి
(రు|| 10,000/-లకు పైన ఉన్నబకాయీలు)
సం||      అసెస్‌ మెంట్ల    బకాయి (రు||)
నుండి    సంఖ్య
1988       11                2388104
1989         2                  204423
1990         4                4340000
1991         6                3753704
1992         3                    71064
1993       13                2740932
1994         9                4567933
1995       10                4277585
1996       14                  805609
1997       33                4643141
1998       19                2848204
1999       24                5318338
2000       23                3950270
2001     122              48887076
2002       45                3334921
2003       44                3426966
2004       28                3422817
2005       51                4458571
2006       70              13944572
2007       65                3726598
2008       54                6090948
2009       35                2200912
2010       36                3672023
2011      132             12892763
2012        49               1444991
  Total     902          147412465

సంస్థల వారీగా చూచినప్పుడు ప్రైవేటుసంస్థలబకాయిలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.
(రు|| 10,000/-లకు పైన ఉన్నబకాయిలు)


No of      Amount 

Assets     defaulted
Trusts 29 3970239
Educational Institutions 21 35518564
Muslim Religious Properties 6 3050359
Hindu Religious  Properties 5 538667
Christian Religious  Properties 16 9007162
Businss firms 27 13552403
Associations 5 1582084
Others 6 1127924

115 68347402



Indidual Persons( Upto 2012) 787 79065063
Total  902 147412465









మొత్తం బకాయిలు  As on 04.06.2014                            




No of  Amount 




Assesments  Defaulted





Rs
Sate Govt Departments 
135 155334387
Central Govt Depts including railways 398 91605010
Private Firms and individuals
902 147412465

Total

1435 39,43,51,862

రైల్వేలతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు సంస్థల బకాయిలు, ఎసెస్‌మెంట్‌ నంబర్లు తదితర వివరాలతో కూడిన జాబితాను ఈ మెమొరాండానికి జత చేస్తున్నాము.
ముందుగా మున్సిపల్‌ కార్సొరేషన్‌కు నష్టాన్ని కలుగ జేస్తున్న ఈ సంస్థలకు జప్తునోటీసులు ఇవ్వాలని, అప్పటికీ పన్ను చెల్లించక పోతే ఈ సంస్థల ఆస్తులను జప్తు చేయాలని కోరుతున్నాము. అంతవరకు ఇప్పటివరకు క్రమంతప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్న గృహయజమానులకు ఇచ్చిన జప్తు నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. 

02. పెంచిన నీటి చార్జీలను, డ్రేనేజి చార్జీలను తగ్గించుట గురించి
06.08.2014 న జరిగిన కార్పొరేషన్‌ సర్వసభ్యసమావేశంలో స్పెషలాఫీసర్‌పాలనలో పెంచిన నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను తగ్గించాలని వచ్చిన ప్రతిపాదనలను వచ్చే సమావేశానికి వాయిదా వేశారు. స్పెషలాఫీసర్‌పాలనలో పెంచిన నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను పునఃసమీక్షించాలని గౌరవనీయులైన డిప్యూటీ మేయర్‌గారు చేసిన ప్రతిపాదనను పరిశీలించిన కౌన్సిల్‌, ఈ సంవత్సరం పెంచిన 7శాతాన్ని తగ్గించేవిధంగా కమీషనర్‌ను కోరుతూ తీర్మానించింది. కాని ఏమాత్రం నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను తగ్గించకుండానే వసూలు చేస్తున్నారు. వచ్చే కౌన్సిల్‌ సమావేశం వరకు ఆగకుండా, కనీసం ఈ ఏడాది పెంచిన 7 శాతాన్ని కూడా తగ్గించకుండానే వసూలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించటమే అవుతుంది. కనీసం వచ్చే కౌన్సిల్‌ సమావేశం వరకైనా పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల వసూలును నిలిపి వేయవలసిందిగా కోరుతున్నాము.

అభివందనాలతో

(యంవి ఆంజనేయులు)           (వి.శ్రీనివాస్‌)
కార్యదర్శి                              సహాయ కార్యదర్శి

జతపరచినవి
01. బకాయిలున్న ఎసెస్‌మెంట్‌ వివరాలతో కూడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల జాబితా
02. బకాయిలున్న ఎసెస్‌మెంట్‌ వివరాలతో కూడిన రైల్వే ఆస్తుల జాబితా
03.బకాయిలున్న ఎసెస్‌మెంట్‌ వివరాలతో కూడిన ప్రైవేటు సంస్థల ఆస్తుల జాబితా






















































విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ శ్రీ కోనేరు శ్రీధర్ గారికి 15.07.2014 తేదీన అంద‌జేసిన మెమొరాండం

గౌరవనీయులైన విజయవాడ నగర పాలక సంస్థ  మేయర్‌ శ్రీ కోనేరు శ్రీధర్ గారికి తేదీ: 15.07.2014
ఆర్యా,
విషయం:- నగర ప్రజలపై కార్పొరేషన్‌ స్పెషల్‌ అధికారుల పాలనలో విధించిన భారాలను తొలగించాలని కోరుతూ
మరియు నగరాభివృధ్ది కొరకు సూచనలు చేస్తూ టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్యసమావేశం చేసిన తీర్మానాలు

విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరుగా ఎన్నికైన మీకు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ హయంలో నగరం మరింతగా అభివృధ్ధి చెందాలని ఆశిస్తున్నాము.

విజయవాడనగర ప్రజలు స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. కార్పొరేషన్‌లో జవాబుదారీతనం లేకుండా పోయింది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపారు. ముందుగా యూజర్‌ చార్జీల పేరుతో చెత్తపన్ను వేశారు. నీటి చార్జీలను విపరీతంగా పెంచారు. నీటి చార్జీలను ఇంటి పన్నుతో ముడిపెడుతూ విధానపరమైన మార్పు చేశారు. ఇంటి ఆవరణలో ఒకచిన్నగదిలో చిన్నషాపు ఉన్నా నీటి వినియోగంతో సంబంధంలేకుండా నీటిమీటర్లు పెట్టారు. ఇది ఇలా ఉంటే నగరంలో ఇప్పటికీ నీటి సరఫరా 23 శాతం లోటు ఉన్నది. కార్పొరేషన్‌ సరఫరా చేస్తున్ననీటిలో కూడా 22 శాతం బోర్ల ద్వారానే ఇస్తున్నారు. మొత్తంగా చూచినపుడు కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉన్నస్సటికీ నగర అవసరరాలలో కేవలం 60 శాతం మాత్రమే నది ఉపరితల జలాలను
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25.05.2014 న జరిగిన
సర్వసభ్యసమావేశం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలు

                                           తీర్మానం నెంబరు-1

2014 మార్చి 30 వతేదీన జరిగిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో
ఎన్నికైన కార్పొరేటర్లందరికీ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్యసమావేశం అభినందనలు
 తెలియ జేస్తున్నది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ ఛైర్మెన్‌లకు ఈ సభ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నది.

2010 సెప్టెంబర్‌ 7 వతేదీనుండి ఇటీవలి ఎన్నికలు జరిగేవరకు కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన సాగింది. ఈ పాలనలో ప్రజలపై అనేక భారాలు పడినాయి. నిరంకుశ పాలన సాగింది. నగరప్రజలు ప్రజాతంత్రపాలన కోసం ఎదురు చూశారు. కోర్టు జోక్యంతో విధిలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను జరపింది. ప్రజలు ఇకనైనా భారాలు తగ్గుతాయని తమ భాధలు తీరతాయని, తమనగరం అభివృధ్ధి చెందుతుందని భావించారు. తాము ఎన్నుకున్న కౌన్సిల్‌ పైన, కార్పొరేషన్‌ పాలక వర్గంపైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలను నెరవేర్చవలసిన భాధ్యత నూతన కౌన్సిల్‌పై ఉన్నదని ఈ సభ భావిస్తున్నది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, నగరప్రజలపై భారాలను తగ్గించటం కోసం అలాగే నగరాభివృధ్ధికోసం నూతన కౌన్సిల్‌ తక్షణం మరియు దీర్ఘకాలికంగా