ప్రజలు చెల్లించిన పన్నుల నుండి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థకు ఇవ్వలసిన నిధులను ఇవ్వకుండా,విజయవాడ నగరాన్ని అధోగతి పాలు చేసింది. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నగరపాలక సంస్థకు అందిన నిధుల వివరాలను టాక్స్ పేయర్స్ అసోసియేషన్ పత్రికలకు విడుదల చేసింది. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయంలో (అంటే కేంద్ర గ్రాంటులు కాకుండా) 36.24 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలి. దీని ప్రకారం గత 5 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరానికి రావలసిన మొత్తం రు1093కోట్లు.ఇవి ఏషరతులు లేకుండా నగరపాలక సంస్థకు రావలసిన నిధులు.కాని
విజయవాడ నగరానికి విడుదల చేసింది కేవలం రు 7కోట్లుమాత్రమే. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం నిధులు నగరానికి విడుదల చేయటానికి బదులుగా జె.యన్.యన్.యు.ఆర్.యం పథకాన్ని నగరంలో అమలు జరిపారు.
ఇది ప్రజలపై భారాలు మోపే అనేక విషమ షరతులతో కూడిన పథకం.ఆ షరతులను అమలు జరుపుతున్నప్పటికీ,నగరానికి రావలసిన రు 1093కోట్లను ఈ పథకం క్రింద ఇవ్వలేదు. జె.యన్.యన్.యు.ఆర్.యం పథకం క్రింద గత 5 సంవత్సరాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి నగరానికి ఇచ్చింది రు 470 కోట్లు మాత్రమే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా రు 122 కోట్లు. అంటే సాధారణంగా నగరానికి రావలసిన నిధులలో 11శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం క్రింద నగరానికి ఇచ్చింది. దీనినిబట్టి షరతులతో నగర ప్రజలను వేధిస్తూ కూడా పూర్తిస్థాయిలో నిధులను నగరానికి ఇవ్వలేదని స్పష్టమవుతున్నది. గత 5 సంవత్సరాల కాలంలో నగర కౌన్సిల్లో అత్యధికులు జె.యన్.యన్.యు.ఆర్.యం మీద భ్రమలు పెంచుకున్నారే తప్ప నగరానికి రావలసిన మేరకు నిధులు దీని ద్వారా రావన్న వాస్తవాన్ని పట్టించుకోలేదు. అంతే కాకుండా ఒక సారి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం మానేసి ప్రతి పనికీ ప్రజలనుండి వసూలు చేయటం మెదలు పెడితే, ఈ పథకం ముగిసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని కూడా ఆలోచించలేదు.ఫలితంగా నగర పాలక సంస్థ నిధుల కొరతతో సతమతమవుతున్నది.నిధుల కొరతతో నగరంలో ఎక్కడి పనులు అక్కడ నిలచి పోయాయి. అండర్ గ్రౌండు డ్రైనేజి కోసం నగరంలో అనేక ప్రాంతాలలో త్రవ్వారు.గోతులతో ప్రజలు ఇబ్బంది నడుతున్నప్పటికీ,రోడ్లు వేయటానికి నిధులు లేవు.టీచర్లకు సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.నిధుల కోసం ప్రజలపై భారాలు మోపుతూ బి.పి.యస్ లాంటి పథకాలు, చెత్త పన్ను, నీటిమీటర్లు, ఆస్థి పన్ను పెంపుదల, డ్రైనేజి పన్నుపెంపుదల లాంటి ప్రజలపై భారాలను మోపే అనేక అంశాలను ముందుకు తెచ్చారు.నగర పాలక సంస్థకున్న ఆస్థులను ప్రైవేటికరించడం, పార్కుల నిర్వహణను కాలనీలకు అప్పగించటం లాంటి అనేక చర్యలను చేపట్టారు. నగరంలో భూముల విలువను అధికారికంగా పెంచటం, పట్టణ భూపరిమితి చట్టాన్ని సవరించడం లాంటి అనేక చర్యల ద్వారా నగరంలో సాధారణ మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా చేశారు.చివరకు నగరపాలక సంస్థ అప్పుల కోసం ఆస్థులను తనఖా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది.ఇవన్నీ జె.యన్.యన్.యు.ఆర్.యం షరతుల ఫలితమే.ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరానికి జె.యన్.యన్.యు.ఆర్.యం.పథకం ఒక శాపం లాగా మారిందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయ పడుతున్నది. జె.యన్.యన్.యు.ఆర్.యం.పథకం లేకుండా, ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం నగరానికి నిధులు విడుదల చేసియున్నట్లయితే నగరంలో ఇప్పుడు జరిగిన పనులకు రెట్టింపు పనులు నగరంలో జరిగి ఉండేవి. ప్రజలకు భారాలు తప్పేవి.

ప్రస్తుతం జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకం గడువు ముగిసినందున, ఇక ఎంత మాత్రము ఈ పథకాన్ని కొన సాగించటం నగరానికి శ్రేయస్కరంకాదు.మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తే నగరానికి మేలు జరుగుతుంది. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం నగరానికి రావలసిన నిధులను రాబట్టడానికి శాసన సభ్యులు చొరవ తీసుకోవాలి.
No comments:
Post a Comment