ప్రచురణార్ధం తేదీ:17.11.2010
జీ.వో నెం. 450
కట్టడపు ఏరియాలో 10వ వంతు మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలంటూ జారీ చేసిన జీ.వో నెం. 450ని తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.ఈ మేరకు మున్సిపల్ కమీషనర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ లేఖలు వ్రాశింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్రాసిన లేఖ కాపీలను స్థానిక శాసన సభ్యులకు కూడా అందజేసి జీ.వోను రద్దు చేయించడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరింది.ఆలేఖ కాపీలను ఈ రోజు పత్రికలకు విడుదల చేశారు.ఈ జీ.వో ప్రకారం 100చ.మీ.(అంటే సుమారుగా 120 చ.గ.) పైన ఉన్న స్థలాలలో ఇళ్ళు కట్టుకునేవారు నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని తప్పని సరిగా