Saturday, 23 October 2010

Memorandum Submitted to Muncipal Commissioner demanding withdrawal of G.O. M.S No 450

                                                                                 తేదీ:23.10.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా!

విషయం:- జీ.వో. యం.యస్‌. నెం. 450 తేదీ 13.10.2010 ని రద్దు చేయాలని కోరుతూ.....

      అక్రమ కట్టడాలను నిరోధించడమన్న సాకుతో 100 చ.మీ. ఆపైన ఉన్న స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారందరూ తప్పనిసరిగా నిర్మాణ స్థలంలో 10శాతాన్ని మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 13.10.2010 తేదీతో విడుదల చేసిన జీ.వో. యం.యస్‌. నెం.450 ప్రజల ప్రయోజనాలకు విరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము స్పష్టం చేస్తున్నాము.నివాసం కోసం గృహాలు నిర్మించుకునేవారికి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఈ జీ.వో ఇబ్బంది కలిగిస్తుందని తెలియజేస్తున్నాము.
 అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిని నిర్మాణ దశలోనే ఆపాలి. వాటిని ఆపవలసిన బాధ్యత మున్సిపల్‌
అధికారులది.కాని మున్సిపల్‌ సిబ్బంది అందుకు భిన్నంగా చూస్తూ ఊరుకుంటున్నారు.సంవత్సరాలతరబడి నిర్మించే భారీ కట్టడాలను బిల్డర్లు ప్లానుకు విరుధ్ధంగా నిర్మిస్తుంటే అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకుంటున్నది.వారు అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్ళిన తరువాత వాటిని అక్రమ నిర్మాణాలంటూ కొనుక్కున్నవారిని వేధించడం, భారీగా పెనాలిటీలు విధించటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిర్మాణ దశలో ఆపకుండా పెనాలిటీలు విధిస్తేనో, లేక తాకట్టు పెట్టించుకుంటేనో అక్రమ నిర్మాణం సక్రమమై పోతుందాయని ప్రశ్నిస్తున్నాము. భారీ కట్టడాలను అక్రమంగా నిర్మించి అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్ళే బిల్డర్లు నిర్మిస్తున్న నిర్మాణాలను వదలివైసి, చిన్న చిన్న ప్లాట్లలో నిర్మించుకునే నివాస గృహాలే అక్రమనిర్మాణాలుగా తేల్చి చెప్పటం, వాటిని తాకట్టు పెట్టమనటం సమంజసం కాదని స్పష్టం చేస్తున్నాము.
అక్రమ నిర్మాణాలు పెరగటానికి ప్రధాన కారణం బిల్డర్లు, మున్సిపల్‌ సిబ్బంది తప్ప చిన్న చిన్న గృహ యజమానులుకాదు. మరింత లాభాలు రావాలనే దురాశతో అక్రమనిర్మాణాలకు పాల్పడే బిల్డర్లనూ, కేవలం తమ కుటుంబాలు నివసించడానికి అనువుగా ఇళ్ళు నిర్మించుకునే గృహయజమానులను ఒకే రీతిగా పరిగణించడం సరికాదు. కనుక జీ.వో. యం.యస్‌. నెం.450 ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమనిర్మాణాలను నిర్మాణ స్థాయిలోనే ఆపాలి తప్ప, నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని మున్సిపాలిటీకి తాకట్టు పెట్టమనడం, నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్రమనిర్మాణమని పెనాలిటీలు విధించడం లాంటి చర్యలు విరమించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా డిమాండు చేస్తున్నాము.

                                                                                   అభివందనాతో
                                                                           యం.వి.ఆంజనేయులు
                                                                                     కార్యదర్శి

No comments:

Post a Comment