నీటి ప్రయివేటీకరణతో సంక్షోభం- మనీలాలో దుస్థితి
ఇబ్బందుల్లో ప్రజలు - 1700 శాతం పెరిగిన ఛార్జీలు
ప్రయివేటీకరణ దుష్ఫలితాలు అనేక దేశాల్లో బయటపడుతున్నప్పటికీ మన ప్రభుత్వం ప్రయివేటీ కరణకు అర్రులు చాస్తున్నది.ప్రభుత్వం సరఫరా చేయాల్సిన మంచినీటిని ప్రయివేటుకు అప్పగిస్తే ఎంతటి దుష్పరిణామాలు తలెత్తుతాయో మెట్రో మనీలాలోని నీటి సంక్షోభం కళ్ళకు కడుతోంది.అక్కడ వర్షాలు కురిసిన అనంతరం కూడా ఈ నీటి సంక్షోభం తొలగిపోయే అవకాశాలు లేనట్టు భావిస్తున్నారు.జులైలో 30లక్షల మందికి
పైగా ప్రజలకు రోజూ అనేక గంటల పాటు నీటి సరఫరాను నిలిపి వేశారు.నిరంతరంగా కురిసే వర్షాలపై ఆధారపడి పూర్తి స్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరణ ఆధారపడి ఉన్నట్లు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా పశ్చిమ జోన్‌లో నీటిని సరఫరా చేస్తున్న మేనిలాడ్ వాటర్ సర్వీసెస్ తెలిపింది.
పైగా ప్రజలకు రోజూ అనేక గంటల పాటు నీటి సరఫరాను నిలిపి వేశారు.నిరంతరంగా కురిసే వర్షాలపై ఆధారపడి పూర్తి స్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరణ ఆధారపడి ఉన్నట్లు ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా పశ్చిమ జోన్‌లో నీటిని సరఫరా చేస్తున్న మేనిలాడ్ వాటర్ సర్వీసెస్ తెలిపింది.
జాతీయ రాజధాని ప్రాంతంలో 1997లో మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణను ప్రయివేటీకరించారు. ఇది గొప్ప విజయమంటూ అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు దీన్ని ప్రశంసించాయి.జులైలో వారమంతా విధించిన మంచినీటి రేషనింగ్ అసలు వాస్తవాన్ని బట్టబయలు చేసింది. ప్రయివేటీకరణ జరిగిన 1997 నుంచి నేటివరకు నీటి రేట్లు సగటున 1,700 శాతం పెరిగాయి. మనీలాలోని గృహాల్లో కేవలం 12 శాతానికి మాత్రమే సీవరేజి సౌకర్యం కల్పించారు. మిగిలిన మురికి నీటిని నదుల్లోకి లేదా కాలువల్లోకి వదిలారు. మెట్రో మనీలాలోని సుమారు 60 శాతం నీటి కాలుష్యానికి ఈ మురుగునీరే కారణం. ఈ రకంగా మురుగు నీటిని వదలడం వల్ల ఒకప్పుడు తాగునీటికి, చేపల పెంపకం, ఈతకు ఉపయోగించిన పాసిగ్ నది ఇప్పుడు పూర్తిగా కలుషితమైంది.ప్రజలను పణంగా పెట్టి ప్రయివేటు సంస్థలు లాభాలు దండుకొంటుండగా లక్షలాది మంది ప్రజలు సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం పొందే ప్రాథమిక హక్కును కోల్పోయారు.
పశ్చిమ జోన్ ప్రాంతంలో మెనిలాడ్ వాటర్ సర్వీసెస్ నీటి రేషనింగ్‌ను విధించింది. ఆ జోన్ కింద జాతీయ రాజధాని ప్రాంతం లోని 11 నగరాలు, పొరుగున ఉన్న కువైట్ రాష్ట్రంలోని 5 పట్టణాలకు చెందిన 70 లక్షల మంది ప్రజలున్నారు. ఒక వారం తరువాత పబ్లిక్ వర్క్స్ మంత్రి,మేనిలాడ్ మాజీ అధిపతి రొగెలియో సింగ్సన్ వేసిన అంచనాలను బట్టి 29లక్షల మంది వినియోగదారులకు రోజుకు ఆరు గంటలు నీటి సరఫరా ఉండగా ఏడు లక్షల మందికి 12 గంటల పాటు సరఫరా ఉన్నట్లు ఎబిఎస్-సిబిఎన్ న్యూస్ తెలిపింది.61వేల గృహాలు లేదా మూడు లక్షల మందికి పైగా ప్రజలకు అసలు నీటి సరఫరానే లేదని సింగ్సన్ చెప్పారు. 24 గంటల నీటి సరఫరా బూటకమని తేలిపోయింది.
మేనిలాడ్ నీటి కంపెనీ లాభాలను కాపాడేందుకే నీటి రేషనింగ్ విధించారనేది వాస్తవం. అనేక సంవత్సరాలుగా ఆ కంపెనీ కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసేందుకు,పాత పైపులను బాగు చేసేందుకు అతి తక్కువ నిధులు కేటాయించడమే దీనికి కారణం.దీని ఫలితంగా దానికి కేటాయించిన నీటిలో 50శాతానికి పైగా లేదా రోజుకు వంద కోట్ల లీటర్ల నీరు లీకేజీ వల్ల,చోరీ వల్ల వృధా అవుతోంది. కేటాయింపులో కోత అంటే రోజుకు 58.092 కోట్ల లీటర్ల నీరు తగ్గిపోవడమని అర్థం. మేనిలాడ్ తన ప్రత్యర్థి, తూర్పు జోన్‌లో నీటి సరఫరా చేస్తున్న సంస్థ మనీలా వాటర్ నుంచి నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది.ఆ కంపెనీ నష్టాలు భరించడానికి బదులు లీకేజీలున్న ప్రాంతాల్లో నీటి సరఫరాను తగ్గించి కార్మికులను,పేదలను శిక్షిస్తోంది.నీటి కొరత మూలంగా మలాబోన్ నగరంలోని పేదలు నీటి పైపును పగుల గొట్టి నీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు దినపత్రికలు తెలిపాయి.స్వేచ్చగా నీటిని వినియోగించుకున్న మనిలా ప్రజలు నేడు కొనలేక నీటిని దొంగతనం చేసి తెచ్చుకోవలసిన దుస్తితికి నెట్టబడ్డారు. లక్షలాది మంది ప్రజలు ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ధనిక వర్గాలు ఆ ఇబ్బందులను సొమ్ము చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం అంగత్ డ్యాంలోని జల విద్యుత్ కేంద్రం ప్రయివేటీకరణకు పూను కున్నారు. మాజీ అధ్యక్షురాలు గ్లోరియా అరయో ప్రభుత్వం కొరియా వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేట్ అత్యున్నత బిడ్డర్‌గా నిలిచినట్లు గత ఏప్రిల్‌లో ప్రకటించింది. అరయోకు వ్యతిరేకంగా ప్రస్తుత అధ్యక్షుడు అక్వినోకు మద్దతిస్తున్న కుటుంబాలకు చెందిన కార్పొరేషన్లను అది వెనక్కు నెట్టింది. కొద్ది మంది ధనికుల ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజల జీవితాలను పణంగా పెట్టిన వైనాన్ని ఈ నీటి సంక్షోభం వెల్లడిస్తోంది. నియంత ఫెర్డినాండ్ మార్కోస్ నుంచి కొరజాన్ అక్వినో, ఫైడల్ రామోస్, జోసెఫ్ ఎస్ట్రాడా, గ్లోరియా అరయో నుంచి అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో వరకూ ఒకదాని తరువాత ఒకటిగా ప్రభుత్వాలు ప్రయివేటీకరణ, ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం పేరిట వందల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రాథమిక సామాజిక సేవలకు డబ్బు లేదనే సాకు చెబుతూ వచ్చాయి.
అక్వినో పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంలో తాను పేదల అనుకూలమన్నట్లు మాటలు చెప్పారు. వందలాది కోట్ల పెసోలను రుణ సేవలకు,రక్షణ,మౌలిక సదుపాయాలకు కేటాయించినట్లు చెబుతూనే సామాజిక సేవలు,కార్యక్రమాలకు ఖజానాలో కేవలం 2.25కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.ఇంకా పొదుపు చర్యలు చేపడుతున్నట్లు,సమర్థత పేరిట ప్రభుత్వోద్యోగులను తొలగించాలనుకొంటున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రైలు ఛార్జీలు, విద్యుత్ రేట్లు పెంచనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.రోడ్ల నిర్మాణం,ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణం,నీటి సరఫరాను ఇంకా పెద్ద ఎత్తున ప్రయివేటీ కరిస్తామని, ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం కిందికి తెస్తామని కూడా అక్వినో వెల్లడించారు.
No comments:
Post a Comment