Tuesday, 19 February 2019

Press Meet TRAI rule on TV Channells

ప్రచురణార్ధం:                                                                                                తేదీ:18.02.2019
దేశంలో అనుమతించిన అన్ని స్వదేశీ,విదేశీ టెలివిజన్‌ ఛానల్స్‌ ప్రసార బాధ్యతను ప్రభుత్వమే ప్రత్యేక ట్రాన్స్‌పాండర్‌ ద్వారా చేపట్టాలని, నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు(చీజఖీ) ను, జి.ఎస్‌.టీని పూర్తిగా రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాధోర్‌ కు లేఖ వ్రాశింది. అనవసరంలేని ఛానల్స్‌ను వదలి వేసి కేవలం అవసరమైన ఛానల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకుని చూసే అవకాశం కల్పిస్తూ టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్‌ ఇండియా ( ట్రాయ్‌) ఇటీవల ఇచ్చిన ఆదేశాలు పైకి బాగున్నట్లుగా కనుపిస్తున్నప్పటికీ, ఆచరణలో టి.వి.కనెక్షన్‌ వినియోగదారులకు భారంగా మారిందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో స్పష్టం చేసింది. దేశంలో ఉన్న అన్ని ఛానల్స్‌ను ప్రసారం చేసే శక్తి ఏ ఆపరేటర్‌కు లేదని అందువలన టి.వి.కనెక్షన్‌ వినియోగదారులకు కావలసిన ఛానల్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఆచరణలో కుదించ బడిందని అలేఖలో సోదాహరణంగా వివరించింది. నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు మొదటి 100 ఛానల్స్‌కు పన్నుతో కలిపి రు.154లు ( రు.130లు దానిమీద జిఎస్‌టి 18శాతం) గా, ఆపైన ప్రతి 25 ఛానల్స్‌కు పన్నుతో కలిపి రు.24లు ( రు.20లు దానిమీద జిఎస్‌టి 18శాతం) గా ట్రాయ్‌ నిర్ణయించింది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం మొదటి 100 ఛానల్స్‌లో పూర్తిగా ఉచిత ఛానల్స్‌ ( ప్రీ టు ఎయిర్‌ ఛానల్స్‌)గాని, పూర్తిగా పెే ఛానల్స్‌ గాని, ఉచిత ఛానల్స్‌, పే ఛానల్స్‌ కలిపి గాని, ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆపరేటర్లు మొదటి 100 ఛానల్స్‌ను పూర్తిగా ఉచిత ఛానల్స్‌ ( ప్రీ టు ఎయిర్‌ ఛానల్స్‌)తోనే నింపేస్తున్నారు. ఫలితంగా పెయిడ్‌ ఛానల్‌ తీసుకోవాలంటే ఛానల్‌ రేటుతో బాటుగా నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు క్రింద మరో రు.24లు అదనంగా చెల్లించవలసి వస్తున్నది. దీనితో టి.వి.కనెక్షన్‌ వినియోగదారులు ఎంపిక చేసుకునే హక్కును కోల్పోతున్నారని ఆలేఖలో స్పష్టం చేసింది. పేఛానల్‌ యాజమాన్యాలు ఇతర అవసరం లేని ఛానల్స్‌తో కలిపి బొకేలుగా తయారుచేసి ఎంపిక చేసుకోమనటంతో ఛానల్స్‌ సంఖ్య పెరిగి పోయి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు అదనంగా చెల్లించవలసి వస్తున్నదని, బొకే కాకుండా కావలసిన వాటిని మాత్రమే విడివిడిగా ఎంపిక చేసుకుంటే ఛానల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆలేఖలో స్పష్టం చేసింది. నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు, ఛానల్‌ ధరలు అధికంగా ఉండటం, వాటిపై జి.ఎస్‌.టి విధించటం, ఎంపిక చేసుకునే అవకాశం కుదించబడటంతో ఎంపిక అనేది టి.వి.కనెక్షన్‌ వినియోగదారులకు భారంగా మారిందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే దేశంలో అనుమతించిన అన్ని ఛానల్స్‌ను ప్రభుత్వం ప్రత్యేక ట్రాన్స్‌ పాండర్‌ ద్వారా ప్రసారం చేసినప్పుడు మాత్రమే టి.వి.కనెక్షన్‌ వినియోగదారులకు నిజమైన ఎంపిక చేసుకునే హక్కు లభిస్తుందని, నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు, జి.ఎస్‌.టిలను రద్దు చేయటం, పే ఛానల్స్‌ ధరలను తగ్గించటం లాంటి చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే టి.వి.కనెక్షన్‌ వినియోగదారులపై భారం తగ్గుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది, అందువలన అన్ని ఛానల్స్‌ను ప్రభుత్వం ప్రత్యేక ట్రాన్స్‌ పాండర్‌ ద్వారా ప్రసారం చేయాలని, నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు, జి.ఎస్‌.టిలను పూర్తిగా రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది
(వి.సాంబిరెడ్డి)                                                         (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                   కార్యదర్శి                                                               





 

No comments:

Post a Comment