ప్రచురణార్ధం: తేదీ:21.01.2019
విజయవాడ నగరపాలక సంస్థ ప్రవేశ పెట్టబోతున్న చివరి బడ్జెట్ ప్రతి పాదనలుకూడా పలు అనుమానాలకు తావిచ్చేవిగా ఉన్నాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయ పడుతున్నది. కార్పొరేషన్‌కు రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు, 13,14 కేంద్ర ఆర్ధిక సంఘాల నిధులు, అమృత్ పథకం నిధులు, ఎసి సబ్ ప్లాన్ నిధులు, నాన్ ప్లాన్ గ్రాంట్ ఎ.పి.ప్రభుత్వ గ్రాంట్, తదితర గ్రాంటులు, నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి వస్తాయి. వాటిని ఆదాయంలో చూపెట్టాలి. ఈ నిధులనుండి ఏపని చేస్తే ఆపని క్రిందఖర్చు చూపెట్టాలి. అందుకు భిన్నంగా అవే పద్దు పేరుతో ( ఉదా: రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు, 13,14 కేంద్ర ఆర్ధిక సంఘాల నిధులు, అమృత్ పథకం నిధులు, ఎసి సబ్ ప్లాన్ నిధులు, నాన్ ప్లాన్ గ్రాంట్ ఎ.పి.ప్రభుత్వ గ్రాంట్ పేర్లతో )ఖర్చు చూపారు. ఆర్ధిక వనరుల పేరుతో ఖర్చులు ఉండవు. ఎదో ఒక పని చేయటానికి ఖర్చులుంటాయి. ఏ పనికి ఈ నిధులు వాడారని చూపెట్టాడానికి బదులుగా, ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వ వనరుల పేర్లను వాడారు. ఇలా చూపించటంలో ఉద్దేశం ఈ నిధులను ఎందుకు ఖర్చు పెెట్టారన్నది కౌన్సిల్‌కు, ప్రజలకు తెలియకుండా చేయటమే నని అర్ధమవుతున్నది. చేసిన ఖర్చుకు స్పష్టత లేదు. అంతే కాకుండా ఆదాయంలో చూపిన మొత్తాలకు, ఖర్చులో చూపిన మొత్తాలకు పొంతనలేదు. రాష్ట్ర ముఖ్యంత్రిగారు ఇటీవల విడుదల చేసిన 8వ శ్వేతపత్రంలో విజయవాడలో కేంద్రం విడుదల చేసిన రు.461కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా ప్రకటించారు. కాని బడ్జెట్‌లో ఎక్కడా ఆనిధులను చూపలేదు. కాని ఖర్చులో మాత్రం కొంత చూపారు. 2017-18లో రు.3,55,16,799లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2018-19 లో ఖర్చు సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2019-20 బడ్డెట్‌లో రు.7,50,000 గా ఖర్చు చూపారు. అంటే మొత్తం ఖర్చు రు.3,62,66,799 గా చూపారు. ఆదాయం చూపకుండా ఖర్చు ఎలా చూపారన్నది ప్రశ్నార్ధకం. ఈ సంవత్సర బడ్జెట్ సవరించిన ఆదాయాలలో జIIూ ఔశీతీసర (జతీఱ్‌ఱషaశ్రీ Iఅటతీaర్‌తీబష్‌బతీవ Iఅఙవర్‌ఎవఅ్ ూశ్రీaఅ) నిధులు రు.150.13 కోట్లుగా చూపారు. వచ్చే ఏడాది బడ్జెట్ అంచనాలలో రు.175.22 కోట్లుగా చూపారు. వెరశి రు.325.25 కోట్లుగా చూపారు. 2018 అక్టోబరు 22న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో. నెం.336 ప్రకారం కేవలం 6 పనులకు మాత్రమే ఈ నిధులు సమకూర్చుతారు. అందులో స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణం కూడా ఉంది. ఇందులో 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 90 శాతం బ్యాంకులోన్ తీసుకోవాలి. అంటే అప్పు చేయాలి. ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వం భరించదు. కార్పొరేషనే భరించాలి. ఇప్పుడు బడ్జెట్‌లో చూపిన రు. 175.22 కోట్లలో రు. 292.73 కోట్లు అప్పుగానే ఉంటుంది. ఈ అప్పును కార్పొరేషనే తీర్చాలి. ఆదాయంలో చూపిన ఈ జIIూ నిధులతో ఈ 6 పనులలో ఏపనికి ఎంత ఖర్చు చేస్తారో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రు.461 కోట్ల స్ధానంలో ఈ జIIూ నిధులను స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణంకోసం ఖర్చు చేయబోతున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే జరిగితే కేంద్రం విడుదల చేసిన రు.461 కోట్లలో ఒక్క పైసాకూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా, స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణంకోసం నగరపాలక సంస్థ చేత అప్పు చేయించబోతున్నదని స్పష్టమవుతుంది. కనుక నిజంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణ పనులు కేంద్రం ఇచ్చిన రు.461 కోట్ల నిధులతోనే జరుగుతున్నాయా లేక అప్పుగా వచ్చే జIIూ నిధులను స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి వాడబోతున్నారా? స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి కాకపోతే జIIూ నిధులను దేనికి వాడబోతున్నారు? ఈ ప్రశ్నలకు కార్పొరేషన్ పాలకులు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment