తేదీః 13.02.2017
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మెన్ గారికి,
33-12-14E, కడియాలవారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ-2
ఆర్యా,
విషయం:- విజయవాడ అజిత్ సింగ్ నగర్ మున్సిపల్ వ్యర్ధాల డంపింగ్
యార్డు - మరియు చెత్త తగులబెట్టడాన్ని గురించి మెమొరాండం.
రిఫరెన్స్:- మా ఫిర్యాదు తేదీ 12.10.2016 (Sent by Registered Post vide RL No A RN 634379782IN dated 13.10.2016 to APPCB Hyderabd Address)
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పడే మున్సిపల్ ఘన
వ్యర్ధాలనుండి ఎరువులు తయారీకి, విద్యుత్ తయారీకి దశాబ్దాల క్రింతం రెండు
ప్లాంట్లను అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ల వద్ద
చట్ట విరుధ్ధంగా ఒక డంపింగ్ యార్డును ఏర్పాటుచేశారు. ఈ ప్లాంట్లు
కొంతకాలం పని చేసి మూతపడ్డాయి. ప్లాంట్లు మూతపడినప్పటికీ, నగరంలోని ఘన
వ్యర్ధాలను ఆప్లాంట్ల ఆవరణలో పడవేయటం మున్సిపల్ కార్పొరేషన్ మానలేదు.
ఫలితంగా చెత్త అక్కడ పేరుకుపోయి దుర్వాసన వెదల్లుతున్నది. ఈ ప్లాంట్లు
ఏర్పాటు చేసిన తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డు ఆవరణ
చుట్టూ ప్రభుత్వం వాంబేకాలనీ, ఆతర్వాత జె.ఎన్.ఎన్.యు. ఆర్. ఎం. పథకం
క్రింద పేదలకు గృహసముదాయాలు నిర్మించి ఇచ్చింది. పేదలకోసం కొన్నిగృహాలను
ఆడంపింగ్ యార్డు ఆవరణలోనే నిర్మిస్తున్నది. ప్రస్తుతం డంపింగ్ యార్డు
ప్రభావిత ప్రాంతంలో చుట్టూ సుమారు లక్ష మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి
ప్రజలు చెత్త వెలువరిస్తున్న దుర్వాసనకు కనీసం భోజనంకూడా చేయలేని
పరిస్థితి నెలకొని ఉన్నది. పదార్ధాల మీద దుమ్ము, ధూళీ పేరుకు పోతున్నది.
తినుబండారాలు అనారోగ్యకరంగా మారుతున్నాయి. బాగా దుర్వాసన వచ్చినప్పుడు
వాంతులు, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. చర్మవ్యాధులు
సోకుతున్నాయి. ఈ డంపింగ్‌యార్డు సమీపంలోనే మున్సిల్ కార్పొరేషన్ మంచి
నీటిఫరా రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్‌లో నీటినే ఆ ప్రాంత ప్రజలు
త్రాగుతున్నారు. ఈ ఘనవ్యర్ధాలలో అప్పుడప్పుడు చనిపోచిన జంతుకళేబరాలు కూడా
వస్తున్నాయి. వీటిని కుక్కలు పిక్కుతింటూ వాటి భాగాలను చుట్టుప్రక్కల ఇళ్ళ
ముందు పడవేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ డంపింగ్ యార్డు పరిసర
ప్రాంతాలలోని ఇళ్ళకు బంధువులు కూడా రావటానికి భయపడుతున్నారు.
ఈ డంపింగ్‌యార్డు బాధలు భరించలేక స్థానిక ప్రజలు అనేక రూపాలలో ఆంధోళన
చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడ
ప్రాంతీయ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. టాక్స్ పేయర్స్
అసోసియేషన్‌గా మేము కూడా మున్సిపల్ కమీషనర్‌కు, మీ కార్యాలయానికీ
ఫిర్యాదులు చేసాము. అయినా ఫలితం లేక పోయింది.
ఇది చాలదన్నట్లుగా గత 15 రోజులుగా ఆ డంపింగ్‌యార్డులోని చెత్త
తగలబడుతున్నది. దీనితో ఆ ప్రాంతమంతా పొగతో నిండి పోతున్నది. దీనివలన
ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతున్నది. కళ్ళు మంటలతో, ఊపిరాడని పరిస్థితిలో
కొంతమంది ఇళ్ళు వదలి వెళ్ళిపోతున్నారు. వెళ్ళలేని వాళ్ళు నరకయాతన
అనుభవిస్తున్నారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌లో పోలిధియాన్ కవర్లు,
ప్లాస్లిక్ పధార్ధాలు ఉంటాయి. ఇవి తగుల బడితే వెలువరించే పొగలో
డయాక్సిన్‌లు, ఫ్యూరాన్‌లు, ఆర్సెనిక్, మెర్క్యురీ, లెడ్, కార్బన్
మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, సల్ఫర్ ఆక్సైడ్‌లు, హైడ్రో క్లోరిక్
ఆసిడ్‌లు ఉంటాయని,వీటివలన ఉబ్బసం, ఊపిరిపీల్చటం కష్టంగా మారటం, చర్మసంబంధ
వ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం
చేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాంత ప్రజలను కనీసం మనుషులుగా
చూడటంలేదన్న విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము. ఇంత భయంకరమైన పొల్యూషన్
బారీన పడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఆచరణ
శూన్యం.
ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారూ భారతీయ పౌరులే. భారత రాజ్యాంగం ఆర్టికల్
21 ప్రకారం వీరికి జీవించే హక్కు ఉందన్న విషయాన్ని మీదృష్టికి
తెస్తున్నాము.
మా ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, మంటలను పూర్తిగా
ఆర్పివేసేవిధంగానూ, ఘన వ్యర్ధాలను ఆ ప్రాంతంలో వేయటం తక్షణమే నిలుపుదల
చేసేవిధంగానూ , ఇప్పటికే అక్కడ నిల్వయున్న ఘన వ్యర్ధాలను తక్షణమే అక్కనుండి
తొలగించే విధంగానూ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.
రిఫరెన్స్‌లో చూపిన ఫిర్యాదు కాపీని కూడా దీనితో జత చేస్తున్నాము.
అభివందనాలతో
యంవి ఆంజనేయులు వి.శ్రీనివాస్
కార్యదర్శి సహాయ కార్యదర్శి
No comments:
Post a Comment