PRESS NOTE DATE 07.12.2015
స్వరాజ్య మైదానాన్ని నగరంలోని ప్రజాతంత్ర కార్యక్రమాలకు, విజ్ఞాన వినోదకార్యక్రమాలకోసం అందుబాటులో ఉండేవిధంగా ఖాళీస్ధలంగానే ఉంచాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా వస్తున్న వార్తల పట్ల టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆంధోళన వ్యక్తం చేస్తున్నది. దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించకపోవటం, బుక్ ఎగ్జిబిషన్ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించటం, డ్రైవింగ్ స్కూల్ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పటం, హెలీపాడ్‌లు నిర్మించడం లాంటిచర్యలు ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది.
ఈ గ్రౌండ్ నగరానికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతున్నది.బుక్ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు, భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలకు పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు, హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు, సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి, డ్రైవింగ్ నేర్చుకునేవారికి, రైతుబజార్ ద్వారా ప్రజలకు, ఇలా ఎన్నోవిధాలుగా నగరప్రజలకు ఉపయోగనడుతున్నది.దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపవాణీ లాంటి జాతీయ సంస్థలు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి. ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు విజయవాడ ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయాలనుకోవటం దారుణం. ఇవేవీ లేకుండా విజయవాడ ప్రజలు ఎడారి బ్రతుకులు ఎందుకు బ్రతకాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది.
నగరంలో ఇప్పటికే చిన్నవి పెద్దవి అన్నీకలిపి126 పార్కులున్నాయి.వీటన్నింటి సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకు వారివారి ప్రాంతాలలోనే పార్కులు అందుబాటులోఉంటాయి. మరల క్రొత్తపార్కును నిర్మించవలసిన అవసరంలేదు. ఈ గ్రౌండును పార్కుగా మార్చితేే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించంటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికే ఈ ఆలోచన అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
విజయవాడ రాజధానిలో భాగంగా మారింది. రాష్ట్రపాలన ఇక్కడనుండే మొదలయింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్ డెంటల్ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా నగరంలోని ఖాళీస్థలాలన్నింటనీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది.
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. అందువలన స్వరాజ్యమైదానాన్ని పూర్తిస్థాయిలో ప్రజల ప్రయోజనార్ధం ఖాళీస్థలంగానే ఉంచాలని, సభలు సమావేశాలకు ఉచితంగా ఇవ్వాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment