విజయవాడ నగరంలో ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్యమైదానం.
దానిని కాపాడుకోవటం మనందరి బాధ్యత
స్వరాజ్య మైదానాన్ని (PWD గ్రౌండ్‌ను) కాపాడుకుందాం.
సోదరీ సోదరులారా!
మన విజయవాడ నగరం 10 లక్షల జనాభాగల పెద్దనగరం. ఇంత పెద్ద నగరంలో ప్రజల అవసరాల కోసం అనేక గ్రౌండ్లు కావాలి. కాని మన నగరానికి ఉన్న ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్య మైదానం (ూఔణ గ్రౌండ్) మాత్రమే. ఇదికూడా మన చేయిజారిపోతే? ఇది అన్యాక్రాంతమైపోతే మన నగరం పరిస్థితి ఏమిటి?
ఇది మన నగరానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నదో చూడండి.
01. బుక్ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది.
02. భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది.
03. ఈ గ్రౌండ్‌లో ఎందరో మహాను భావుల బహిరంగ సభలు జరిగాయి. వివిధ రాజకీయ
పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఆవిధంగా అది
ప్రజాస్వామ్య కార్య క్రమాలకు ఉపయోగపడుతున్నది.
04. పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది.
05. హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది.
06. సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి ఉపయోగపడుతున్నది.
07. డ్రైవింగ్ నేర్చుకునేవారికి ఉపయోగపడు తున్నది.
08. రైతుబజార్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతున్నది.
09. దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది.
10. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపావాణీ వారు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. 11. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి.
ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఈ గ్రౌండు ఉపయోగపడుతున్నది.
ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు మన ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయబోతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించలేదు. బుక్ ఎగ్జిబిషన్ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించారు. గతంలోలాగా మొత్తం గ్రౌండులో అనుమతించలేదు. డ్రైవింగ్ స్కూల్ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పినట్టు భోగట్టా.
గతంలో ఎవరైనా హెలీకాప్టర్‌లో వస్తే వారికి హెలీపాడ్ ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఈ గ్రౌండులోనే హెలీపాడ్‌లు ఏర్పాటుచేశారు. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా మార్చబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. అంటే ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారన్నమాట.
మన నగరం రాజధానిలో భాగంగా మారింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్ డెంటల్ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా గ్రౌండ్‌లన్నీ ప్రజల అవసరాలకు లేకుండా చేస్తే నగర ప్రజలు కాలుతీసి కాలు పెట్టడానికి స్థలం ఉండదు.
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు మరిన్ని గ్రౌండ్లు కావాలి. అందుకు భిన్నంగా మనకున్న ఆ ఒక్క గ్రౌెండు కూడా లేకుండా పోతే మన నగర పరిస్థితి ఏమిటి? వినోద విజ్ఞాన కార్యక్రమాలు లేకుండా, రాజకీయ, సామాజిక సభలు సమావేశాలు జరగకుండా, ఆధ్యాత్మిక అవసరాలు తీరకుండా నగరంలో మనం ఎడారి బ్రతుకులు బ్రతకాలా? ఇవన్నీ జరగాలంటే గ్రౌండ్ కావాలి కదా?
అందుకే విజయవాడ పౌరులుగా మనం మేల్కొనాలి. నగరంలోని ఖాళీ స్థలాలను కాపాడుకోవాలి. నగరానికి మకుటాయమానంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవటం నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. స్వరాజ్యమైదాన పరిరక్షణ వేదిక చేపట్టే కార్యక్రమాలలో కలసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం.సమైక్యంగా కదులుదాం.స్వరాజ్య మైదానాన్ని కాపాడుకుందాం.
అభివందనాలతో
స్వరాజ్య మైదాన పరిరక్షణ వేదిక-విజయవాడ

No comments:
Post a Comment