తేదీ 27.11.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గారికి,
ఆర్యా,
విషయం: డి&ఓ ట్రేడ్ లైసెన్స్ పై యూజర్ చార్జీల విధింపుపై అభ్యంతరములు
మీరు వ్యాపార సంస్థలకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్‌పై యూజర్ చార్జీలను విధించి ఉన్నారు. సదరు వ్యాపార సంస్థలవారు కొన్ని అభ్యంతములు మీ ముందుంచినారు. వాటికి మీకార్యాలయం 19.10.2012 తేదీతో RCF9-144147 నెంబరుగల ఎండార్సుమెంట్ ద్వారా జవాబును పంపియున్నారు. సదరుఎండార్సుమెంట్ లో మీ కార్యాలయం పేర్కొన్న అంశాలపై టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా కొన్ని విషయాలను మీ ముందుంచుతున్నాము.
01. మీ కార్యాలయం వ్రాశిన సదరు ఎండార్సుమెంట్ లో ''నగర ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు పారిశుధ్ధ్యముపై ప్రత్యేక దృష్టితో ప్రతి దినము మురుగు కాల్వలు శుభ్ర పరచుట , రోడ్లు ఊడ్చుట, ప్రధాన ప్రాంతములలో 24 గంటలు శానిటేషన్ నిర్వహించుట, ప్రతి ఇల్లు మరియు వ్యాపార సంస్థల వారి వద్ద నుండి స్వయముగా పబ్లిక్ హెల్త్ వర్కర్‌ల ద్వారా చెత్తను సేకరించుట జరుగుచున్నది. చెత్త సేకరించువారికి వృత్తిపరమైన రక్షణ చర్యలతో బాటు, పరిశుభ్రమైన పరిస్థితులలో వ్యర్ధములను సేకరించుట, తరలించుట సురక్షిత విధానములో డిస్పోజ్ చేయు ప్రక్రియలు నిర్దేశిత నిబంధనలమేర అమలు చేయవలసిన ఆవశ్యకత కలదు'' అని పేర్కొనియున్నారు. ఇది Solid Waste Management Rules మరియు GHMC Act 1955 ప్రకారం నగరంలో శానిటేషన్ నిర్వహించ వలసిన పధ్ధతిని తెలియ జేస్తున్నది. ఇందులో ప్రత్యేకత ఏదీలేదు. నగరంలో పబ్లిక్ హెల్త్‌ను కాపాడవలసిన బాధ్యత కార్పొరేషన్‌కు ఉన్నది. దానికి ఎటువంటి పధ్ధతులనవలంబించాలన్నది కార్పొరేషన్ మరియు అర్బన్ మంత్రిత్వ శాఖలలోని నిపుణులు నిర్ణయించే అంశాలు. దీనికీ, మీరు విధిస్తున్న యూజర్ చార్జీలకు సంబంధంలేదు. కార్పొరేషన్ నిర్వహణలో శానిటేషన్ ఒక భాగం. కార్పొరేషన్ నిర్వహణకు కావలసిన ఆదాయ మార్గాలుకూడా GHMC Act 1955లో ఇవ్వబడినవి.Solid Waste Management Rules లోగాని, GHMC Act 1955 లోగాని ఎక్కడా శానిటేషన్‌కు యూజర్ చార్జీలు విధించమని పేర్కొనలేదు. కనుక కార్పొరేషన్‌గా చట్టప్రకారం నిర్వహించవలసిన బాధ్యతను నిర్వహించడానికి, చట్టపరిధిలో లేని యూజర్ చార్జీలను ప్రజలనుండి వసూలు చేయటం సరైంది కాదని తెలియ జేస్తున్నాము.
02. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము (Solid Waste Management Rules)నందు, ఆవ్యర్ధాల ఉత్పత్తికి కారణమైనవారు, ఆవ్యర్థ పదార్ధముల తొలగింపునకు అగు ఖర్చు భరించవలసియుండునని సదరుఎండార్సుమెంట్‌లో పేర్కొన్నారు. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules) అనునది వ్యర్థపదార్ధములను నశింపజేయుటకు ఉద్దేశించిన విధానమును నిర్దేశించినదేతప్ప, ఆర్థిక వ్యవహారాలను నిర్ధేశించలేదు(Solid Waste Management Rules deal with only the procedural aspect of the disposal of Solid Waste, but do not deal with financial aspect).. కనుక వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules) ప్రకారము యూజర్ చార్జీలను వసూలు చేయుట చట్టవిరుధ్ధమని తెలియ జేయుచున్నాము.
03.వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి అగు చెత్త (Trade Refuse) తొలగింపునకు మరల ప్రత్యేకముగా వసూలు చేయరాదని శ్రీయుత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టువారు Laxmi Lodge, Warangal and others vs Government of AP and another (2002 (6) ALD 605- W.P. NO 20789/1998) కేసులో తీర్పు వెల్లడించిన విషయం మీదృష్టికి తీసుక వస్తున్నాము. ఈ తీర్పును కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా GHMC Act 1955 ప్రకారం వ్యాపార సంస్థలనుండి ఉత్పత్తి అగు చెత్తను (Trade Refuse) కూడా తొలగించవలసిన బాధ్యత కార్పొరేషన్‌దేనన్న విషయం మీకు తెలియందికాదు.
04. జీ.వో ఆర్‌టి నెంబర్ 973 తేదీ 21.08.2010 అనేది ప్రభుత్వం జారీ చేసిన చట్ట బధ్ద ఉత్తర్వులని మీరు ఆ ఎండార్సుమెంట్ లో పేర్కొన్నారు. అది చట్టవిరుధ్ధమని మేము భావిస్తున్నాము. అది చట్టబధ్ధమా లేక చట్ట విరుధ్ధమాయన్న విషయాన్ని తేల్చవలసింది న్యాయస్థానము మాత్రమే. అందువలననే ఈ వివాదాన్ని నెం.33550/2011గా గల రిట్ పిటీషన్ ద్వారా శ్రీఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వారిముందు ఉంచిన విషయం మీకు తెలుసు. ఈ రిట్ పిటీషన్ శ్రీ హైకోర్టు వారి వద్ద పెండింగులో ఉన్నది. ఆ వివాదం పరిష్కారమయ్యేవరకు వేచిచూడకుండా, సదరు జీ.వో చట్టబధ్దమేనన్న వాదనను సమర్ధించుకుంటూ యూజర్ చార్జీలను విధించుకుంటూ కొన సాగుతున్నారు. వివాదం కోర్టు పరిధిలో ఉండగా మీరు కొనసాగించడం సరైందికాదు. కనుక కోర్టువారి తీర్పు వెలువడేవరకు ఈ జీ.వో అమలును నిలిపి వేయాలని కోరుతున్నాము.
పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు తీర్పు వెలువడే వరకు యూజర్ చార్జీలను వసూలును నిలిపి వేయవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాలతో
(వి. సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment