తేదీ:23.10.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గారికి,
ఆర్యా!
విషయం:- జీ.వో. యం.యస్. నెం. 450 తేదీ 13.10.2010 ని రద్దు చేయాలని కోరుతూ.....
అక్రమ కట్టడాలను నిరోధించడమన్న సాకుతో 100 చ.మీ. ఆపైన ఉన్న స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారందరూ తప్పనిసరిగా నిర్మాణ స్థలంలో 10శాతాన్ని మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 13.10.2010 తేదీతో విడుదల చేసిన జీ.వో. యం.యస్. నెం.450 ప్రజల ప్రయోజనాలకు విరుధ్ధమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా మేము స్పష్టం చేస్తున్నాము.నివాసం కోసం గృహాలు నిర్మించుకునేవారికి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఈ జీ.వో ఇబ్బంది కలిగిస్తుందని తెలియజేస్తున్నాము.
అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిని నిర్మాణ దశలోనే ఆపాలి. వాటిని ఆపవలసిన బాధ్యత మున్సిపల్