Sunday, 10 June 2018
Monday, 4 June 2018
Saturday, 2 June 2018
Saturday, 14 April 2018
Press Note released at Press meet on 14.4.18
14.04.2018 న టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రెస్ నోట్
ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలలో సౌకర్యాలు కల్పించటం కోసం ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క భవనం కూడా పూర్తికాని అమరావతిలో ఎప్పుడో కల్పించబోయే సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టి సదస్సులు నిర్వహించటం ఎవరి ప్రయోజనం కోసమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. మన రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాలు, నగరాలు 110 ఉన్నాయి. వీటిలో 2011 జనాభాలెక్కల ప్రకారం 1 కోటీ 36 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలున్నాయి. ఈ నగరాలన్నీ మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో అనేక పట్టణాలలో నీటి కొరత తీవ్రంగా తలెత్తుతున్నది. అనేక పట్టణాలు నగరాలలో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు లేవు. సరైన రోడ్లు లేవు. పార్కింగ్ సౌకర్యాలు లేవు. సరైన మురుగునీటి వ్యవస్థలేదు. పారిశుధ్యం పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు లేవు. కాలుష్య నివారణకు చర్యలు లేవు. పబ్లిక్ రవాణా వ్యవస్థ కుంచించుక పోతున్నది. విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఉపాధిó లభించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అనేక చోట్ల పాఠశాలలకు భవనాలు లేవు. అద్దెలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. గృహ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా పట్టణాలు, నగరాలలో ఉండే ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నివాసయోగ్య పట్టణంగా రూపొందించడం కోసం ప్రతి పట్టణానికి ఒక నిర్థిష్టమైన ప్రణాళిక ఉండాలి. అలాంటి ప్రణాళికలు లేవు. ఇవన్నీ పట్టించుకోకుండా, వీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టకుండా, ఎప్పుడో వచ్చే అమరావతికోసం సదస్సులు నిర్వహించటం, హాపీ సిటీ డిక్లరేషన్ పేరుతో తీర్మానాలు చేయటం, ఇప్పటికే పట్టణాలలో నివసిస్తున్న ప్రజలను పరిహసించటమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది. ఈసదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారు రాజధాని అమరావతిని అత్యంత నివాస యోగ్యమైన, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన నగరంగా తీర్చిదిద్దుతామని, అన్నీ బ్యాటరీ వాహనాలే వాడతామని, 70 నుండి 80 శాతం ప్రజా రవాణావ్యవస్థ ద్వారా రవాణా జరుపుతామని, సైకిల్ ట్రాక్‌లు నిర్మిస్తామని, సౌరవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అన్నారు. ఇలా అమరావతిలో కల్పించే అనేక సౌకర్యాలగురించి ఏకరువు పెట్టారు. ఇవన్నీ ఇప్పటికే పట్టణాలలో నివసిస్తున్న ప్రజలకు అవసరంలేదా అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది.
పట్టణాలలో నగరాలలో సమస్యల పరిష్కారాలకోసం తగిన చర్యలను రూపొందించటానికి ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌లు కావాలి. అంతేకాని జగ్గీ వాసుదేవ్ లాంటి ఆధ్యాత్మిక గురువులు కాదు. పచ్చని అడవులను, పంటపొలాలను నాశనం చేస్తూ పచ్చదనాన్ని గురించి వల్లించటం హాస్యాస్పదం. అదే విధంగా మన పట్టణాలను నగరాలను సౌకర్యవంతంగా రూపొందించటానికి ఉపయోగపడేది మన దేశపు ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లే తప్ప విదేశీ సంస్థలుకావు. ఇప్పటికైనా ఇటువంటి జిమ్మిక్కులు మాని, ముందుగా ఇప్పటికే పట్టణాలలో నివసిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారంకోసం ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని, అందులో ఖచ్చితంగా మన దేశీయ ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌లను, వివిధ ప్రజా సంఘాలను, ట్రేడ్ యూనియన్లను, రాజకీయపార్టీలను భాగస్వాములను చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

Tuesday, 20 March 2018
Wednesday, 7 February 2018
Press Meet on 06.02.2018
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఈనెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ మద్దత్తునిస్తున్నది. బడ్జెట్‌లో పట్టణాలకు, నగరాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు కేవలం కంపెనీలను బాగు చేయటానికే తప్ప పట్టణ ప్రజలకు నేరుగా ఉపయోగపడేవిధంగా లేవు. స్మార్ట్ సిటీ క్రింద ఎంపిక చేసిన 99 నగరాలకు రు.2.04 లక్షలకోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. స్మార్ట్ సిటీలకు ఇచ్చే నిధులు నేరుగా పట్టణాలలో పనులు నిర్వహించటానికి రావు. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం నగరాన్ని కంపెనీలకు అప్పగిస్తారు. ఈ కంపెనీలు నగరంలో పనులు చేసి, వాటికి అయిన ఖర్చును, లాభాలను ప్రజలనుండి రాబట్టుకుంటాయి. ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన రు.2.04 కోట్లు ఈ కంపెనీలకు పెట్టుబడిగా చేరి, నగర ప్రజలతో వ్యాపారం చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప నేరుగా నగర ప్రజలకు ఉపయోగపడవు. కాని ప్రజలకు ఎంతోకొంత చేరే అమృత్ పథకానికిమాత్రం కేవలం రు.6000కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది పట్టణ ప్రజలను వంచించటమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది.
కేంద్ర ఖజానాకు ఎగ్గొట్టిన రు.7 లక్షల కోట్లు పన్నులనుగాని, బ్యాంకులకు ఎగ్గొట్టిన రు.8 లక్షల కోట్ల బకాయిలను రాబట్టడానికి కాని ఈ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవు. గత సంవత్సరం కార్పొరేట్ కంపెనీలకు సుమారు రు6 లక్షలకోట్లు రాయితీలిచ్చారు. మరల ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా కొన్ని రాయితీలు ప్రకటించారు. కాని ఉద్యోగులు ఆకాంక్షించిన విధంగా ఆదాయపు పన్ను మినహాయింపులు మాత్రం ఇవ్వలేదు. ఎం.పి.లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్‌గా జీతాలు పెరిగేవిధంగా ఈ బడ్జెట్‌లో ఏర్పాటు చేసుకున్నారు. పెట్రోలు డీజిల్ మీద లీటరుకు రు.8లు పన్ను తగ్గించారు. డ్యూటీ సెస్ పేరుతో లీటరుకు రు.8లు విధించారు. ఇవన్నీ ప్రజాధనాన్ని కొల్లగొట్టేవిగా ఉన్నాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది.
ఈ బడ్జెట్ రాష్ట్ర విభజన హామీలను ఏమాత్రం నెరవేర్చేదిగా లేదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. మొదటి సంవత్సరపు బడ్జెట్ లోటు, రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చటం, రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, పోలవరం డ్యాం నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక అభివృధ్ధికి నిధులు, రాష్ట్రంలో ప్రత్యేక రైల్వే జోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, మెట్రో రైళ్ళు ఇవన్నీ విభజన హామీలు. వీటిలో కొన్ని చట్టంలో ఉన్నవి వున్నాయి. కొన్ని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 2 సంవత్సరాలు రు.50 కోట్లు ఇచ్చారు. ఆతర్వాత అదీలేదు. ఒరిస్సాకోసం మన రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని డిమాండు చేసింది ఈ బీ.జే.పీ. వారే. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ¬దా ఇచ్చేది లేదు పొమ్మన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. చివరకు అదీ లేదు. పోలవరం నిర్మిస్తామన్నారు. దానికి కావలసిన నిధుల కేటాయింపులేదు. ఆంధ్రలో మెట్రో రైళ్ళు వదిలేసి, ఇప్పటికే నడుస్తున్న బెంగుళూరు మెట్రోరైలుకు రు.17,000కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రైల్వే ట్రైనింగ్ సెంటర్ పెడతామన్నారు. దానిని గాలికొదిలేసి, గుజరాత్‌లోని వడోదరాలో రైల్వే యూనివర్శిటి ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు.
రాష్ట్రానికీ, రాష్ట్రంలోని పట్టణాలకు, పట్టణ ప్రజలకు, ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించే స్థితిలో లేదని స్పష్టమవుతున్నది. ఈనేపధ్యంలో రాష్ట్ర ప్రజలు ఆంధోళనాబాట పట్టడం మినహా వేరే మార్గం లేదు. అందుకే ఈ నెల 8 వతేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ మద్దత్తునిస్తున్నది. నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ ఈ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నది.

Saturday, 4 November 2017
Press Meet on 03.11.2017
ప్రచురణార్ధం: తేదీ:03.11.2017
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో
బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం కోసం నగరపాలక సంస్థ చేత అప్పు
చేయించటాన్ని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. విజయవాడలో
జె.యన్.యన్.యు.ఆర్.యం.-బి.ఎస్.యు.పి పథకం క్రింద బలహీన వర్గాల కోసం
జి+3 ఇళ్ళు నిర్మించుటకై రు. 100 కోట్లు అప్పు చేయాలని మున్సిపల్
కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఋణం తీసుకోవటానికి వడ్డీ రేట్ల వివరాలను
తెలియజేయవలసిందిగా బ్యాంకర్లను కోరుతూ ఈనెల 1 వ తేదీన మున్సిపల్
కార్పొరేషన్ ఒక దిన పత్రికలో ప్రకటన
ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాక్స్ పేయర్స్ అసోసియేషన్
విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌కు ఒక లేఖను వ్రాశింది.
బలహీన
వర్గాలకు ఇళ్ళు నిర్మించటం, పౌరులకు గృహ వసతి కల్పించటం కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల విధి. విజయవాడ నగరపాలక సంస్థకు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికీ
సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనికి నగరపాలక సంస్థ అప్పు చేయటం
ఏమిటని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆ లేఖలో ప్రశ్నించింది. విజయవాడ
నగరపాలక సంస్థ ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఋణం నగరపాలక
సంస్థకు భారంగా మారనున్నదని ఆలేఖలోస్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు
సంబంధంలేని పనికి నగరపాలక సంస్థ అప్పుచేయటం నగర ప్రజల నెత్తిన అప్పును
రుధ్దటమే అవుతుందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆ లేఖలో స్పష్టం చేసింది.
వర్షం వస్తే నగరం జలాశయంలా మారటం, డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్తంగా
ఉండటం, పారిశుధ్ధ్యం నానాటికీ దిగజారటం, రోడ్లు అధ్వాన్నంగా తయారవటం,
ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ తీవ్రమవటం, ఫుట్ పాత్‌లు లేకపోవటం లాంటి
అనేక సమస్యల పరిష్కారానికిి నిధులు కావలసి యుండగా, వాటిని వదిలేసి, రాష్ట్ర
ప్రభుత్వం చేయవలసిన పనులకు కార్పొరేషన్ అప్పులు చేయటం దారుణమని టాక్స్
పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ అప్పును తీర్చవలసింది
విజయవాడ నగర ప్రజలేనని, ఈ అప్పు తీర్చటం కోసం భవిష్యత్తులో నగర ప్రజలపై
భారాన్ని మోపవలసి వస్తుందని స్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని
పనికి నగర పాలక సంస్థ అప్పుచేస్తే, దానిని నగర ప్రజలు ఎందుకు భరించాలని
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు, నగర ప్రజలకు
భారంగా మారే ఈ ఋణ ప్రతి పాదనను తక్షణమే విరమించుకోవలసినదిగా టాక్స్ పేయర్స్ అసోసియేషన్ మున్సిపల్ కమీషనర్‌ను కోరింది.
Subscribe to:
Posts (Atom)