ప్రచురణార్ధం: తేదీ:23.04.2019
విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో నీటి సరఫరాలో కొరత ఏర్పడటం పట్ల టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. న్యూరాజరాజేశ్వరీ పేట, రాజీవ్‌నగర్, వాంబే కాలనీలలో ఇప్పటికే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది. విజయవాడ నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం ఏప్రిల్ నెలలోనే 6 అడుగులకు పడిపోయింది. మండు వేసవిగా ఉండే మే, జూన్ నెలలో నీటి మట్టం మరింతగా పడిపోయే అవకాశం ఉంది. దీనితో నగరంలో నీటి సరఫరా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ సాగునీటికి ఉద్దేశించినది. దాని నుండే నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలో సుమారు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ నగరానికి సరిపడా నీటిని నిల్వ ఉంచుకునేటందుకు ప్రత్యేక రిజర్వాయర్ లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే ప్రకాశం బ్యారేజికి దిగువన కృష్ణా నదిపై చెక్ డ్యాం నిర్మించి నీటిని నిల్వ ఉంచాలన్న ప్రతి పాదన వచ్చింది. ఇది నిర్మిస్తే వరద నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అప్పుడు విజయవాడ నగరం పూర్తిగా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రాష్ట్ర విభజన అనంతరం పాలకులు ఆ ప్రతిపాదనను గాలికొదిలేశారు. భవిష్యత్తులో ఎప్పుడో అమరావతికిి చేరే జనానికి కావలసిన నీటి కోసం ఇప్పుడే వైకుంఠపురం వద్ద చెక్ డ్యాం నిర్మించడానికి పూనుకుంటున్న పాలకులు,ఇప్పటికే 10 లక్షలకు పైగా జనం ఉన్న విజయవాడ నగర ప్రజలకు కావలసిన నీటి అవసరాల కోసం చెక్ డ్యాం నిర్మించాలన్న ఆలోచన చేయక పోవటం దారుణం.
త్రాగునీటి సమస్య కేవలం విజయవాడ నగరానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడి పోయాయి. కొన్ని మండలాలలో చలమలు, ఊటల నుండి కొబ్బరి చిప్పలతో, డబ్బాలతో తోడి పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడి పోయాయి. తిరుపతిలో ట్యాంకర్లద్వారా నీటిని తెప్పించుకోవలసి వస్తున్నది. ఉత్తరాంధ్రలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపుర్లం, గుంటూరు జిల్లా వినుకొండలలో 3 రోజులకొకసారి నీరిస్తున్నారు. విశాఖ రూరల్‌లో 126 గ్రామాలలో నీటి కొరత ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో దాదాపు జిల్లా అంతటా నీటి సమస్య తీవ్రంగాఉన్నది.గిద్దలూరులో రోజూ 20లక్షల లీటర్ల లోటు ఉందని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల, గురజాల, కృష్ణా జిల్లాలో తిరువూరు, మైలవరం, గంపలగూడెం లాంటి మండలాలలో నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రం మొత్తం త్రాగునీటి సమస్య తీవ్రమవుతున్నది. ప్రభుత్వాలు త్రాగునీటి సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసిన దాని ఫలితంగానే త్రాగునీటి కరువు ఏర్పడుతున్నది. మన పాలకులు సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, త్రాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వటం లేదు. వేసవి రాగానే సమీక్షల మీద సమీక్షలు జరపటం అక్కడక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం మినహా, ఈ సమస్యను శాశ్వితంగా పరిష్కరించాలన్న దృక్ఫథంలేదు. ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించటంలో వైఫల్యం చెందిన పాలకులు అభివృధ్ధిని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది.
ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం రాష్ట్రంలో మంచి నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత నివ్వాలని, విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా కోసం కనీసం 5 టి.యం.సిల నీటిని నిల్వ ఉంచేవిధంగా చెక్ డ్యాంలు నిర్మించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ వేసవిలో విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా సజావుగా జరిగేటందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment