2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి
చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కరపత్రాలను పంపిణీ
చేయటం పట్ల టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.
సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించాలనటం చట్టవిరుధ్ధమని
టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. ఇది చట్ట విరుధ్ధమని
తెలియజేస్తూ మున్సిపల్ కమీషనర్‌కు, మేయర్‌కు టాక్స్‌పేయర్స్ అసోసియేషన్
లేఖలు వ్రాశింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు
1955, సెక్షన్ 264 ప్రకారం ఆస్తి పన్నును అర్ధసంవత్సరానికి కాని లేక 3
నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలే తప్ప సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమనే
హక్కు కమీషనర్‌కు లేదు. మున్సిపల్ కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3
నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది తప్ప,
సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు
కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడా లేని హక్కును మున్సిపల్
అధికారులు ఎలా అమలు జరుపుతారని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్
ప్రశ్నిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్ట విరుధ్ధమైన
అంశాలను ప్రోత్సహించటం దారుణమని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్
అభిప్రాయపడుతున్నది.
మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు 1955, సెక్షన్ 269(2) మరియు సెక్షన్ 270ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాసి ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్లను ప్రయోగించి ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది. పన్నులు చెల్లించని ఇలాంటి వారిపై అధికారులు ఈ సెక్షన్‌ల ప్రకారం చర్యలు తీసుకోనందున కార్పొరేషన్ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. వీరివలన కార్పొరేషన్ ఖజానాకు కలుగుతున్న నష్టానికి అధికారులే బాధ్యత వహించాలి.
ఆస్తి పన్ను ముందస్తుగా చలెల్లించకపోతే పోతే వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపి వేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తే సాధారణ పన్ను చెల్లింపుదారులు బెదిరిపోయి ఆస్తిపన్ను, దానితోబాటే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, యూజర్ చార్జీలను సంవత్సరం మొత్తానికీ ఒకేసారి కట్టేస్తారన్న వ్యూహంతోనే ఈ కరపత్రాలను పంచుతున్నారని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది. చట్టవిరుధ్దమైన అంశాలతో, బెదిరింపులతో కూడిన ఈ కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు 1955 సెక్షన్ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలని, ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షత లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు 1955 సెక్షన్ 269(2)మరియు సెక్షన్ 270 ప్రకారం అత్యధిక మొత్తాలలో బకాయిలున్న వారితో ప్రారంభించి అవరోహణా క్రమం(Descending order) లో బకాయిదారులపై చర్యలు చేపట్టాలని, పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటి కప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment