Friday, 23 November 2018
Tuesday, 20 November 2018
"రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం"- ఈ క్షణం వెబ్ ఛానల్‌తో M.V. Anjaneyulu

Monday, 12 November 2018
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచే జీ.వో 336ను రద్దు చేయాలి- టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ 12.11.2018
ప్రచురణార్ధం
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి ఉద్దేశించిన జీ.వో నెం.336ను తక్షణమే ఉపసంహరించు కోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థలలో వివిధ పనులను చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రు.12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అందులో 90 శాతం అంటే రు. 11,340 కోట్లు బ్యాంకులనుండి 8 శాతం వడ్డీకి ఋణం తీసుకోబోతున్నది. మిగతా 10 శాతం అంటే రు.1260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా, సివరేజి మేనేజ్‌మెంట్, వర్షపునీటి కాలువలు, రోడ్ల పునర్నిర్మాణం, శ్మశానవాటికలు, పార్కుల అభివృధ్ధి- ఈ ఆరుపనులు ఈ ఋణంతో చేస్తారట. నిజానికి మున్సిపల్ నిధులతో ఈ పనులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులనుండి స్ధానికాభివృధ్ధికోసం మున్సిపాలిటీలకు నిధులను కేటాయించాలి. ఇవేవి చేయకుండా వేలకోట్లరూపాయలు అప్పులుచేసి ఈ పనులు చేస్తామనటం దారుణం. ఇప్పటికే నీటి కనెక్షన్ ఇవ్వాలన్నా, డ్రైనేజి కనెక్షన్ ఇవ్వాలన్నా డొనేషన్‌లపేరుతో వాటికయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు భారీగా పెంచి వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తున్నారు. పార్కులు ప్రైవేటువారికి ఇస్తున్నారు. ఒకవైపు నిర్మాణ,నిర్వహణా వ్యయాలను ప్రజలనుండి వసూలు చేస్తూ తిరిగి అవే పనులకు వేలాది కోట్లరూపాయలు అప్పులు తెచ్చి చేస్తామనటంలో ఔచిత్యమేమిటని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది.
అయితే ఈ ఋణం తీసుకునేది ప్రభుత్వమైనా భరించేది ప్రభుత్వం కాదు. ఈ పనులకు చేయటానికి ఏ మున్సిపల్ సంస్థ పరిధిలో ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ మున్సిపాలిటీ లేదా ఆ మున్సిపల్ కార్పొరేషన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆ జీ.వోలో నిబంధన విధించారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మున్సిపల్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఈ ఋణంలో మొదటి దఫాగా రు.3000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం 4 నెలలో కాలంలో రు.3000 కోట్లు విలువగలిగిన పనులు ఎలా అవుతాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. విజయవాడలో వర్షపునీటి కాలువల నిర్మాణం కోసం కేంద్రం నుండి రు.461 కోట్లు వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా, నేటికీ పనులు అరకొరగా జరుగుతున్నాయే తప్ప పూర్తికాలేదు. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశంకూడా కనుపించటం లేదు. మూడేళ్ళలో రు.461 కోట్ల విలువ కలిగిన పనులు చేయలేని ప్రభుత్వం, 4 నెలల కాలంలో రు.3000 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తామనటం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. మరో 5 నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రు.3000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకోవటం మున్సిపాలిటీలలో పనులు చేయటానికి కాదని, ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్ళించటానికి వేసిన ఎత్తుగడ అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేసే అప్పును పట్ణణాలు, నగరాలలోని ప్రజలే భరించాలి. దానికోసం మున్సిపల్ సంస్థలు పట్టణ ప్రజలపై పన్నుల భారం వేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగా మారబోతున్నది. అదే విధంగా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను శాశ్వితంగా ఎగ్గొట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణాలన్నింటి రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఋణం కోసం విడుదల చేసిన ఈ జీ.వోను టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి, ప్రజలపై భారాలను మోపటానికి ఉద్దేశించిన ఈ జీ.వో ను తక్షణమే ఉప సంహరించుకోవాలని, నగరాలలో పట్టణాలలో ఈ ఆరు పనులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
వి.సాంబి రెడ్డి యం.వి. ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి

Subscribe to:
Posts (Atom)